Honda electric scooter : హోండా నుంచి బుడ్డి ఎలక్ట్రిక్​ స్కూటర్​.. ఇదిగో 'మోటోకాంపాక్టో'!-honda revives motocompacto micro electric scooter check details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Honda Electric Scooter : హోండా నుంచి బుడ్డి ఎలక్ట్రిక్​ స్కూటర్​.. ఇదిగో 'మోటోకాంపాక్టో'!

Honda electric scooter : హోండా నుంచి బుడ్డి ఎలక్ట్రిక్​ స్కూటర్​.. ఇదిగో 'మోటోకాంపాక్టో'!

Sharath Chitturi HT Telugu
Sep 15, 2023 01:34 PM IST

Honda electric scooter : హోండా నుంచి ఓ బుడ్డి ఎలక్ట్రిక్​ స్కూటర్​ వస్తోంది. దీని పేరు హోండా మోటోకాంపాక్టో. ఈ ఈవీ విశేషలను ఇక్కడ తెలుసుకుందాము..

హోండా నుంచి బుడ్డి ఎలక్ట్రిక్​ స్కూటర్​.. ఇదిగో 'మోటోకాంపాక్టో'!
హోండా నుంచి బుడ్డి ఎలక్ట్రిక్​ స్కూటర్​.. ఇదిగో 'మోటోకాంపాక్టో'!

Honda electric scooter : 1980 దశకంలో ఓ మైక్రో-స్కూటర్​ను లాంచ్​ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ హోండా. దీని పేరు 'మోటోకాంపో'. ఇక ఇప్పుడు.. ఈ బుడ్డి స్కూటర్​కు ఈవీ టచ్​ ఇచ్చింది! దీని పేరు 'మోటోకాంపాక్టో' ఈ మోడల్​ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..

మోటోకాంపాక్టో ఈ-స్కూటర్​ విశేషాలివే..

హోండా సిటీ బూట్​లో పట్టే విధంగా ఈ మోటోకాంపోను రూపొందించింది సంస్థ. రవాణాకు, స్టోరేజ్​కు చాలా అనుకూలంగా ఉంటుంది. దీనిని 'ట్రంక్​ బైక్​' అని కూడా ప్రచారాలు చేసింది హోండా. ఇందులో 50సీసీ ఇంజిన్​ ఉండేది. దీని టాప్​ స్పీడ్​ 48కేఎంపీహెచ్​.

Honda Motocompacto : ఇక ఇప్పుడు హోండా రివీల్​ చేసిన ఆల్​-న్యూ, ఈకో-ఫ్రెండ్లీ మోటోకాంపాక్టో ఈ-స్కూటర్​ కూడా ఆకర్షణీయంగా ఉంది. ఈ స్కూటర్​ బరువు 18.6కేజీలు. ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ను ఫోల్డ్​ చేసి.. కారు బూట్​లో పెట్టుకోవచ్చు. కారు వెళ్లలేని ప్రదేశాల్లో దీనిని ఉపయోగించుకోవచ్చు.

ఇందులో ఉన్న బ్యాటరీతో 19.3కి.మీల వరకు ప్రయాణించవచ్చు. 0-100శాతం రీఛార్జ్​కు 3.5 గంటల సమయం పడుతుందని సంస్థ వెల్లడించింది. ఈ ఏడాది నవంబర్​ నాటికి.. ఈ హోండా మోటోకాంపాక్టో ఎలక్ట్రిక్​ స్కూటర్​.. డెలివరీలను మొదలుపెట్టాలని సంస్థ భావిస్తోంది. దీని ధర 995 డాలర్లు. ఇండియన్​ కరెన్సీలో అది సుమారు రూ. 83వేలు!

Honda Motocompacto price : 2040 నాటికి తమ పోర్ట్​ఫోలియోలో అన్ని ఈవీలే ఉండే విధంగా ప్లాన్​ చేస్తున్న హోండాకు.. ఈ మోటోకాంపాక్టో సక్సెస్​ చాలా కీలకంగా మారనుంది. ఈ మోడల్​ ఇతర ఫీచర్స్​పై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇండియాలో ఈ మోడల్​ లాంచ్​ అవుతుందా? లేదా? అన్న విషయంపై సంస్థ నుంచి ఇంకా ఎలాంటి వివరాలను వెల్లడించలేదు.

హోండా ఎలివేట్​కు క్రేజీ డిమాండ్​..

Honda Elevate SUV waiting period : ఇక ఇండియాలో హోండా కార్యకలాపాల గురించి మాట్లాడుకుంటే.. సంస్థ ఇటీవలే లాంచ్​ చేసిన ఎలివేట్​ ఎస్​యూవీకి విపరీతమైన డిమాండ్​ కనిపిస్తోంది. లాంచ్​ అయిన కొన్ని రోజులకే, ఈ మోడల్​ వెయిటింగ్​ పీరియడ్​ 6 నెలలు దాటేసింది! హోండా ఎలివేట్​ ఎస్​యూవీని.. సెప్టెంబర్​ 4న లాంచ్​ అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ వెహికిల్​ కోసం బుకింగ్స్​ వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా వెయిటింగ్​ పీరియడ్​ 6నెలలకు చేరింది. మరీ ముఖ్యంగా.. టోటల్​ బుకింగ్స్​లో టాప్​ ఎండ్​ వేరియంట్స్​కే 60శాతం వాటా ఉండటం విశేషం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం