Honda new electric scooter : హోండా నుంచి సరికొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​- స్టైలిష్​ లుక్స్​తో!-honda reveals new electric scooter with stylish looks check details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Honda New Electric Scooter : హోండా నుంచి సరికొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​- స్టైలిష్​ లుక్స్​తో!

Honda new electric scooter : హోండా నుంచి సరికొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​- స్టైలిష్​ లుక్స్​తో!

Sharath Chitturi HT Telugu
Oct 27, 2023 06:40 AM IST

Honda new electric scooter : హోండా సంస్థ నుంచి స్టైలిష్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ రాబోతోంది. ఈ మోడల్​కు సంబంధించిన కాన్సెప్ట్​ను ఇటీవలే రివీల్​ చేసింది సంస్థ. ఆ వివరాలు..

హోండా నుంచి సరికొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్
హోండా నుంచి సరికొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్

Honda new electric scooter : దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ హోండా నుంచి సరికొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​ రాబోతోంది. దీని పేరు హోండా ఎస్​సీ ఈ. ఈ మోడల్​కి సంబంధించిన కాన్సెప్ట్​ వర్షెన్​ని.. 2023 జపాన్​ మొబిలిటీ షోలో ఇటీవలే ప్రదర్శించింది హోండా. ఈ 2 వీలర్​ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..

హోండా కొత్త ఈ-స్కూటర్​..

ఈ ఈ-స్కూటర్​ ప్రోటోటైప్​తో పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. సంస్థకు బెస్ట్​ సెల్లింగ్​ మోడల్​గా ఉన్న యాక్టివాకు.. ఇది ఎలక్ట్రిక్​ వర్షెన్​గా కనిపిస్తోంది. ఈ ఈవీ డిజైన్​ చాలా స్టైలిష్​గా ఉంది. ఇందులో లైటింగ్​ కాంపోనెంట్స్​, స్లీక్​ బాడీ ప్యానెల్స్​, ప్రీమియం సింగిల్​ పీస్​ సీట్​, ఫ్లాట్​ ఫ్లోర్​బోర్డ్​ వంటివి స్టైలిష్​గా ఉన్నాయి.

Honda SC E electric scooter : ఈ హోండా ఎస్​సీ ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో రెండు ఇంటర్​ఛేంజెబుల్​ మొబైల్​ పవర్​ ప్యాక్​ బ్యాటరీలు ఉంటాయని తెలుస్తోంది. వీటి వల్ల ఛార్జింగ్​ టైమ్​ తగ్గుతందని, పవర్​ఫుల్​ రైడ్​ లభిస్తుంది సంస్థ చెబుతోంది.

ఇక ఈ ఈ-స్కూటర్​లో వాడుతున్న ఎలక్ట్రిక్​ మోటార్​లో నాయిస్​ తక్కువగా ఉండటంతో పాటు వైబ్రేషన్లు కూడా ఉండవని హోండా చెబుతోంది. నగరాల్లో దీనిని ఎక్కువగా వాడుకోవచ్చని సూచిస్తోంది.

ఈ హోండా ఎస్​సీ ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ ఫీచర్స్​, రేంజ్​, బ్యాటరీ ప్యాక్​లపై ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేదు. ఇది ఇంకా కాన్సెప్ట్​ దశలోనే ఉంది. ప్రొడక్షన్​ స్టేజ్​లోకి ఎప్పుడు వెళుతుంది? అన్న ప్రశ్నకు ప్రస్తుతం హోండా సమాధానం ఇవ్వలేదు.

ఇదీ చూడండి:- Two-seater electric car: హోండా నుంచి అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో రెండు సీట్ల సెల్ఫ్ డ్రైవింగ్ ఎలక్ట్రిక్ కార్

Honda Activa electric : కాకపోతే ఇది.. హోండా యాక్టివాకు ఎలక్ట్రిక్​ వర్షెన్​లా ఉందని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి. సరిగ్గా ప్లాన్​ చేస్తే.. ఈ మోడల్​కి కూడా యాక్టివా రేంజ్​లో డిమాండ్​ వస్తుందని అభిప్రాయపడుతున్నాయి.

ప్రొడక్షన్​ మొదలైన తర్వాత.. తోలుత ఈ ఈ-స్కూటర్​ జపాన్​లో లాంచ్​ అవ్వొచ్చు. ఆ తర్వాత.. ఇండియాలో అడుగుపెట్టొచ్చు! ఇండియాలో ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్​ వాహనాలకు మంచి డిమాండ్​ కనిపిస్తోంది. ముఖ్యంగా 2 వీలర్​ సెగ్మెంట్​లో ఈవీలు దూసుకెళుతున్నాయి. ఈ నేపథ్యంలో అనేక సంస్థలు ఈ సెగ్మెంట్​ను క్యాష్​ చేసుకోవాలని చూస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే.. లాంచ్​ తర్వాత, ఈ హోండా ఈవీ కూడా ఇండియాలోకి ఎంట్రీ ఇస్తుందని ఆశించవచ్చని మార్కెట్​ వర్గాలు చెబుతున్నాయి.

Honda electric scooter news : ఈ వార్త ఈవీ లవర్స్​లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. హోండా ఎస్​సీ ఈ చాలా స్టైలిష్​గా ఉందని అంటున్నారు. ఈ మోడల్​ లాంచ్​ కోసం ఎదురుచూస్తున్నట్టు చెబుతున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం