తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Royal Enfield New Bike : రాయల్​ ఎన్​ఫీల్డ్ నుంచి సరికొత్త బైక్​..​ హిమాలయన్​ 452 ఇదిగో!

Royal Enfield new bike : రాయల్​ ఎన్​ఫీల్డ్ నుంచి సరికొత్త బైక్​..​ హిమాలయన్​ 452 ఇదిగో!

Sharath Chitturi HT Telugu

09 October 2023, 14:11 IST

google News
    • Royal Enfield new bike : రాయల్​ ఎన్​ఫీల్డ్​ హిమాలయన్​ 452ని సంస్థ తాజాగా ఆవిష్కరించింది. నవంబర్​లో ఈ బైక్​ లాంచ్​ అవుతుందని సమాచారం.
హిమాలయన్​ 452 ఇదిగో!
హిమాలయన్​ 452 ఇదిగో!

హిమాలయన్​ 452 ఇదిగో!

Royal Enfield Himalayan 452 : రూమర్స్​కి బ్రేక్​లు వేస్తూ.. సరికొత్త, మచ్​ అవైటెడ్​ బైక్​ను ఆవిష్కరించింది ప్రముఖ ఆటోమొబైల్​ సంస్థ రాయల్​ ఎన్​ఫీల్డ్​. దీని పేరు హిమాలయన్​ 452! ఈ అడ్వెంచర్​ మోటార్​సైకిల్​.. 2016లో లాంచ్​ అయిన హిమాలయన్​ 411ని పోలి ఉంది. కాగా.. ఈ కొత్త మోడల్​.. ఈ ఏడాది నవంబర్​లో లాంచ్​ అవుతుందని తెలుస్తోంది.

కొత్త బైక్​ విశేషాలివే..

హిమాలయన్​ 411తో పోల్చుకుంటే ఈ సరికొత్త రాయల్​ ఎన్​ఫీల్డ్​ హిమాలయన్​ 452లో చాలానే మార్పులు జరిగాయి! ఇందులో స్లీకర్​ స్టైల్​లో ఫ్లూయెల్​ ట్యాంక్​, రీడిజైన్డ్​ ఫెండర్స్​, స్ప్లిట్​ సీట్​ సెటప్​ వంటివి వస్తున్నాయి. ఫ్రెంట్​ మడ్​గార్డ్​లో హిమాలయన్​ బ్రాండింగ్​ వస్తోంది. ఫ్యుయెల్​ ట్యాంక్​, సైడ్​ ప్యానెల్​, రేర్​ ఫెండర్స్​కు హిమాలయన్​ గ్రాఫిక్స్​ వస్తున్నాయి. ఈ బైక్​లో క్రోమ్​ ప్యానెల్​తో కూడిన సింగిల్​ ఎగ్సాస్ట్​ ఉంటుంది.

Royal Enfield Himalayan 452 price : త్వరలో లాంచ్​కానున్న హిమాలయన్​ 452లో యూఎస్​డీ ఫ్రెంట్​ ఫోర్క్స్​ విత్​ ఫోర్క్​ కవర్​ వస్తోంది. 21 ఇంచ్​ మల్టీ స్పోక్​ వీల్స్​, ఆఫ్​ రోడ్​ టైర్స్​ దీని సొంతం.

ఇక ఈ రాయల్​ ఎన్​ఫీల్డ్​ కొత్త బైక్​లో 451.65 సీసీ, లిక్విడ్​ కూల్డ్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 40 బీహెచ్​పీ పవర్​ను, 45 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఈ బైక్​ బరువు 210 కేజీలు ఉండొచ్చని సమాచారం. ఎనలాగ్​ డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​ విత్​ టీఎఫ్​టీ డిస్​ప్లే వస్తుందని, ఇందులో టర్న్​ బై టర్న్​ నేవిగేషన్​ సెటప్​ కూడా ఉంటుందని తెలుస్తోంది.

Royal Enfield Himalayan 452 price in India : ఈ హిమాలయన్​ 452 అడ్వెంచర్​ బైక్​కి సంబంధించి.. వీటికి మించి, ఇతర వివరాలను వెల్లడించలేదు రాయల్ ​ఎన్​ఫీల్డ్​ సంస్థ. కాగా.. దీని ఎక్స్​షోరూం ధర రూ. 2.80లక్షలుగా ఉంటుందని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి.

లాంచ్​ తర్వాత.. ఈ రాయల్​ ఎన్​ఫీల్డ్​ హిమాలయ్​ 452.. కేటీఎం 390 అడ్వెంచర్​, బీఎండబ్ల్యూ జీ310 జీఎస్​, యెజ్డి అడ్వెంచర్​తో పాటు త్వరలో లాంచ్​కు సిద్ధమవుతున్న హీరో ఎక్స్​పల్స్​ 400కి గట్టిపోటీనిస్తుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి.

సరికొత్త రైడింగ్​ జాకెట్​ చూశారా..?

Royal Enfield Streetwind V3 jacket : మన దేశంలో బైక్​ లవర్స్​ చాలా మందే ఉన్నారు! మరీ ముఖ్యంగా నచ్చిన బైక్​లో లాంగ్​ డ్రైవ్​కి వెళ్లి ఆ ఫీల్​ని ఎంజాయ్​ చేయాలని చాలా మంది కలలుకంటారు. ఇలాంటి వారికి ఫస్ట్​ చాయిస్​.. రాయల్​ ఎన్​ఫీల్డ్​! ఈ ఆటోమొబైల్​ సంస్థకు చెందిన రెట్రో బైక్స్​కు మంచి డిమాండ్​ ఉంటుంది. అయితే.. లాంగ్​ డ్రైవ్స్​కు కేవలం బైక్​ ఉంటే సరిపోదు. జర్నీకి తగ్గట్టు రైడింగ్​ జాకెట్​ కూడా ఉంటేనే మంచి లుక్​, ఆ వైబ్స్​ వస్తాయి! అందుకే.. రాయల్​ ఎన్​ఫీల్డ్​ సంస్థ రైడింగ్​ జాకెట్స్​ని కూడా లాంచ్​ చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా.. సరికొత్త జాకెట్​ను ఇటీవలే తీసుకొచ్చింది. దీని పేరు స్ట్రీట్​విండ్​ వీ3. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం