New electric bike : అల్ట్రావయోలెట్ సంస్థ నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్..
05 November 2023, 11:45 IST
- Ultraviolette electric bike : అల్ట్రావయోలెట్ సంస్థ నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్ రాబోతోంది. ఈ బైక్ టాప్ స్పీడ్ 200 కేఎంపీహెచ్గా ఉండొచ్చు. వివరాల్లోకి వెళితే..
అల్ట్రావయోలెట్ సంస్థ నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్..
Ultraviolette new electric bike : అల్ట్రావయోలెట్ సంస్థ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ సిద్ధమవుతోంది. మిలాన్ వేదికగా ఈ నెల 7న ప్రారంభంకానున్న ఈఐసీఎంఏ 2023 ఈవెంట్లో.. ఈ ఈ-బైక్‌ని ఆవిష్కరించనుంది సంస్థ. ఈ నేపథ్యంలో ఈ మోడల్ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..
కొత్త బైక్ వివరాలు..
బెంగళూరు ఆధారిత అల్ట్రావయోలెట్ సంస్థ.. తన ఎఫ్77 ఎలక్ట్రిక్ బైక్‌తో ప్రపంచాన్ని ఆకర్షించింది. ఇక 2023 ఆటో ఎక్స్‌పోలో కొత్త బైక్‌కి సంబంధించిన కాన్సెప్ట్‌ని ఆవిష్కరించింది. ఆ తర్వాత.. ఈ బైక్ ఎఫ్99గా కార్యరూపం దాల్చింది. ఇక త్వరలోనే బయటకు రానున్న ఎలక్ట్రిక్ బైక్.. ఈ ఎఫ్99 ఆధారంగా, రేసింగ్ ప్లాట్‌ఫామ్‌పై రూపొందించినట్టు కనిపిస్తోంది. అయితే, ఇప్పటివరకు.. ఈ మోడల్ పేరును సంస్థ రివీల్ చేయలేదు.
Ultraviolette E-bike : కాగా.. ఈ కొత్త ఈ-బైక్‌కి సంబంధించిన టీజర్‌ను రివీల్ చేసింది అల్ట్రావయోలెట్. ఎఫ్77తో పోల్చుకుంటే, దీని డిజైన్ డిఫరెంట్‌గా ఉందనే చెప్పుకోవాలి. బైక్‌కి హెడ్‌ల్యాంప్ లేదు. సైడ్ ప్యానెల్ షార్ప్‌గా, బోల్డ్‌గా మారింది. టీఎఫ్టీ డిస్ప్లే కూడా ఇందులో ఉంది.
అల్ట్రావయోలెట్ ఈవీ స్టార్టప్ సంస్థకు ప్రస్తుతం ఎఫ్77 బైక్ ఒక్కటే మార్కెట్లో ఉంది. ఇందులోని బేస్ వేరియంట్లో 7.1 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీని టాప్ స్పీడ్ 152 కేఎంపీహెచ్. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. ఇది 207కి.మీల దూరం ప్రయాణిస్తుంది.
Ultraviolette new bike : ఇక త్వరలోనే అల్ట్రావయోలెట్ నుంచి రాబోతున్న కొత్త ఎలక్ట్రిక్ బైక్‌లో.. ఎఫ్77లో మించిన బ్యాటరీ ప్యాక్ ఉంటుందని టాక్ నడుస్తోంది. అంతేకాకుండా.. ఈ-బైక్ టాప్ స్పీడ్ 195-200 కేఎంపీహెచ్ మధ్యలో ఉండొచ్చని సమాచారం.
New electric bike : అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కి సంబంధించిన వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. మిలాన్ ఈవెంట్లో ఈ మోడల్ని సంస్థ ఆవిష్కరించిన తర్వాత.. ఫీచర్స్, బ్యాటరీ, రేంజ్‌పై ఓ క్లారిటీ వస్తుంది. ఇండియాలో ఈ మోడల్ ఎప్పుడు లాంచ్ అవుతుంది? అన్న విషయంపైనా త్వరలోనే ఓ క్లారిటీ రావొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.