Royal Enfield Himalayan 450 : రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త బైక్ లాంచ్.. ధర ఎంతంటే!
25 November 2023, 8:05 IST
- Royal Enfield Himalayan 450 : రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ లవర్స్‌కి క్రేజీ న్యూస్! సరికొత్త బైక్‌ని ఈ ఆటోమొబైల్ సంస్థ లాంచ్ చేసింది. దీని పేరు హిమాలయన్ 450. ఈ బైక్ ఫీచర్స్, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త బైక్ లాంచ్..
Royal Enfield Himalayan 450 : దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్.. సరికొత్త బైక్‌ని ఇండియాలో లాంచ్ చేసింది. దీని పేరు రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450. ఈ నేపథ్యంలో.. ఈ బైక్ ఫీచర్స్, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త బైక్ విశేషాలివే..
రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450లో 450సీసీ, సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది.. 450 హెచ్‌పీ పవర్‌ని, 40 ఎన్ఎం టార్క్‌ని జనరేట్ చేస్తుంది. ఈ వెహికిల్ బరువు 196కేజీలు. ఇందులో 17 లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. 825ఎంఎం అడ్జెస్టెబుల్ సీట్ హైట్ లభిస్తోంది.
ఇక ఈ కొత్త బైక్‌లో రౌండ్ టీఎఫ్టీ కలర్ స్క్రీన్ వస్తోంది. ఇందులో గూగుల్ మ్యాప్స్ ఇంటిగ్రేటెడ్‌గా ఉంటాయి. ఈ స్క్రీన్‌ని స్మార్ట్‌ఫోన్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు. కాల్స్, నోటిఫికేషన్స్, ఎస్ఎంఎస్లని యాక్సెస్ చేసుకోవచ్చు. అదనంగా.. రైడ్- బై- వైర్ టెక్నాలజీ, స్విఛ్చెబుల్ ఏబీఎస్, ఫుల్- ఎల్ఈడీ లైటింగ్ వంటివి కూడా ఈ బైక్‌కి వస్తున్నాయి.
Royal Enfield Himalayan 450 price : రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త బైక్‌లో 21/17 ఇంచ్ స్పోక్ వీల్స్ వస్తున్నాయి. సస్పెన్షన్స్ విషయానికొస్తే.. ఫ్రెంట్లో షోవా యూఎస్డీ ఫోర్క్స్, రేర్‌లో మోనో-షాక్ అబ్సార్బర్స్ లభిస్తున్నాయి. ఫ్రెంట్, రేర్ వీల్స్‌కి డిస్క్ బ్రేక్స్ వస్తున్నాయి.
రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450 ధర..
ఈ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450లో మూడు వేరియంట్లు ఉన్నాయి. వాటి పేర్లు.. బేస్, పాస్, సమిట్. బేస్ వేరియంట్ ఎక్స్‌షోరూం ధర రూ. 2.69లక్షలుగా ఉంది. పాస్ వేరియంట్ ఎక్స్‌షోరూం ధర రూ. 2.74లక్షలుగా ఉంది. సమిట్ వేరియంట్ ఎక్స్‌షోరూం ధర రూ. 2.84లక్షలుగా ఉంది. ఇవి ఇంట్రొడక్టరీ ప్రైజ్లని తెలుస్తోంది. డిసెంబర్ 31 వరకు ఈ రేట్లు కొనసాగనున్నట్టు సమాచారం. ఆ తర్వాత.. కొత్త బైక్ ధర పెరిగే అవకాశం ఉంది.
Royal Enfield Himalayan 450 price in India : ఈ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450 బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. సంస్థకు చెందన డీలర్షిప్షోరూమ్స్లో ఈ వెహికిల్‌ని బుక్ చేసుకోవచ్చు.
కేటీఎం 390 అడ్వెంచర్, బీఎండబ్ల్యూ జీ310 జీఎస్ వంటి బైక్స్‌కి ఈ రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త వెహికిల్ గట్టిపోటీనిస్తుందని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి.
హిమాలయ్ 411కి గుడ్ బై..!
హిమాలయన్ 411 బైక్‌ని ఈ నెల చివరికి డిస్కంటిన్యూ చేయనున్నట్టు రాయల్ ఎన్ఫీల్డ్ ఇప్పటికే ప్రకటించింది. దేశ, విదేశీ విపణిలో ఇది కనిపించదని స్పష్టం చేసింది. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 411 బైక్.. 2016లో లాంచ్ అయ్యింది. అడ్వంచర్ టూరింగ్ బైక్‌గా దీనికి మంచి గుర్తింపు లభించింది. తాజా పరిస్థితుల్లో.. హిమాలయన్ 452 మోడల్.. ఈ 411 మోడల్ని రిప్లేస్ చేస్తుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.