తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Honda New Bike : క్రేజీ లుక్స్​తో హోండా కొత్త బైక్​.. రాయల్​ ఎన్​ఫీల్డ్​ క్లాసిక్​ 350కి పోటీగా!

Honda new bike : క్రేజీ లుక్స్​తో హోండా కొత్త బైక్​.. రాయల్​ ఎన్​ఫీల్డ్​ క్లాసిక్​ 350కి పోటీగా!

Sharath Chitturi HT Telugu

17 November 2023, 11:15 IST

    • Honda new bike : స్టైలిష్​ లుక్స్​తో ఉన్న ఓ బైక్​ టీజర్​ని రివీల్​ చేసింది హోండా సంస్థ. రాయల్​ ఎన్​ఫీల్డ్​ క్లాసిక్​ 350కి.. ఈ బైక్​ గట్టిపోటీనిచ్చే విధంగా ఉంది!
: రాయల్​ ఎన్​ఫీల్డ్​ క్లాసిక్​ 350కి పోటీగా హోండా కొత్త బైక్​!
: రాయల్​ ఎన్​ఫీల్డ్​ క్లాసిక్​ 350కి పోటీగా హోండా కొత్త బైక్​!

: రాయల్​ ఎన్​ఫీల్డ్​ క్లాసిక్​ 350కి పోటీగా హోండా కొత్త బైక్​!

Honda new bike : హోండా మోటార్​సైకిల్​ అండ్​ స్కూటర్​ ఇండియా.. కొత్త స్టైలిష్​ బైక్​ని లాంచ్​ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ బైక్​కి సంబంధించిన టీజర్​ను ఇటీవలే రివీల్​ చేసింది. ఈ కొత్త మోడల్​.. హోండా హైనెస్​ సీబీ350ని పోలి ఉంది! వివరాల్లోకి వెళితే..

ట్రెండింగ్ వార్తలు

Skoda new SUV : మారుతీ సుజుకీ బ్రెజాకు పోటీగా స్కోడా కొత్త ఎస్​యూవీ..!

Infinix GT 20 Pro : ఇండియాలో ఇన్ఫీనిక్స్​ జీటీ 20 ప్రో లాంచ్​ డేట్​ ఫిక్స్​.. ఫీచర్స్​ ఇవే!

Honda Civic into Lamborghini : హోండా సివిక్​ని లంబోర్ఘినిగా మార్చిన యూట్యూబర్​- నెటిజన్లు ఫిదా!

Motorola X50 Ultra : మోటోరోలా ఎక్స్​50 అల్ట్రా లాంచ్​.. సూపర్​ కూల్​ ఫీచర్స్​తో!

హోండా కొత్త బైక్​ విశేషాలు..

హోండా కొత్త బైక్​ పేరును సంస్థ ఇంకా ప్రకటించలేదు. టీజర్​ని చూస్తే.. కొన్ని వివరాలు తెలుస్తున్నాయి. ఇందులో స్ల్పిట్​ సీట్​ సెటప్​, గ్రాబ్​ రెయిల్​, స్విచ్​గేర్​ వంటివి కనిపిస్తున్నాయి. నిస్సిన్​ కాలిపర్​తో కూడిన ఫ్రెంట్​ డిస్క్​ బ్రేక్​, రేర్​లో షాక్​ అబ్సార్బర్​ వంటివి ఈ బైక్​లో వస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే.. రాయల్​ ఎన్​ఫీల్డ్​ క్లాసిక్​ 350కి గట్టిపోటీనిచ్చే విధంగా ఓ బైక్​ని సంస్థ సిద్ధం చేస్తోందని అనిపిస్తోంది.

కాగా.. సరికొత్త 350సిసీ మోటార్​ బైక్​పై వర్క్​ చేస్తున్నట్టు ఈ ఏడాది మార్చ్​లోనే వెల్లడించింది హోండా సంస్థ. హోండా హైనెస్​ సీబీ350, సీబీ350 ఆర్​ఎస్​లను రూపొందించిన ప్లాట్​ఫామ్​పైనే దీనిని కూడా తయారు చేయనున్నట్టు పేర్కొంది. ఈ రెండు మోడల్స్​ కూడా ఇప్పటికే ఇండియన్​ మార్కెట్​లో అందుబాటులో ఉన్నాయి.

హోండా హైనెస్​ సీబీ350 అనేది ఒక నియో- రెట్రో బైక్​. హోండా విక్రయిస్తున్న యాక్ససరీస్​ కిట్​తో.. ఈ బైక్​ని మనకు నచ్చినట్టుగా మాడిఫై చేసుకోవచ్చు. మంచి ఫీల్​ వస్తుంది. సీబీ350 ఆర్ఎస్​.. ఒక సూడో స్క్రాంబ్లర్​ బైక్​. దీనిని కూడా కిట్​తో మాడిఫై చేసుకోవచ్చు.

ఇదీ చూడండి:- Bullet 350 vs Honda H'ness CB350 : ఈ రెండు బైక్స్​లో ఏది బెస్ట్​?

ఈ రెండు వెహికిల్స్​లో ఉన్న ఇంజిన్​నే.. కొత్త బైక్​లో కూడా హోండా వినియోగిస్తుందని సమాచారం. ఇదే నిజమైతే.. హోండా కొత్త 2 వీలర్​లో 350 సీసీ, సింగిల్​ సిలిండర్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 21 బీహెచ్​పీ పవర్​ని, 30 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఇందులో 5 స్పీడ్​ గేర్​బాక్స్​ ఉంటుంది.

Honda new bike latest news : హోండా హైనెస్​ సీబీ350లో 4 వేరియంట్లు ఉన్నాయి. అవి డీఎల్​ఎక్స్​, డీఎల్​ఎక్స్​ ప్రో, క్రోమ్​, లీగల్​ ఎడిషన్​. ఈ మోడల్​ ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 2.10లక్షలుగా ఉంది. సీబీ350 ఆర్​ఎస్​లో రెండు వేరియంట్లు ఉంటాయి. అవి.. డీఎల్​ఎక్స్​, న్యూ హ్యూ. ఈ మోడల్​ ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 2.15లక్షలుగా ఉంది.

కొత్తగా వచ్చే బైక్​ ధర ఈ రెండు మోడల్స్​ మధ్యలో ఉండే అవకాశం ఉంది. లాంచ్​ డేట్​, ఫీచర్స్​, రేంజ్​, ధర వంటి వివరాలను సంస్థ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. త్వరలోనే వీటిపై ఓ క్లారిటీ రావొచ్చు.

టాపిక్

తదుపరి వ్యాసం