తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Honda New Bike : హోండా నుంచి కొత్త బైక్​.. స్టైలిష్​ సీబీ1000 హార్నెట్​ ఇదిగో!

Honda new bike : హోండా నుంచి కొత్త బైక్​.. స్టైలిష్​ సీబీ1000 హార్నెట్​ ఇదిగో!

Sharath Chitturi HT Telugu

13 November 2023, 13:46 IST

    • Honda CB1000 Hornet : బ్రాండ్ ​న్యూ బైక్​ని రివీల్​ చేసింది హోండా. దీని పేరు సీబీ1000 హార్నెట్​. ఈ బైక్​ విశేషాలను ఇక్కడ తెలుసుకోండి..
స్టైలిష్​ సీబీ1000 హార్నెట్​ ఇదిగో
స్టైలిష్​ సీబీ1000 హార్నెట్​ ఇదిగో

స్టైలిష్​ సీబీ1000 హార్నెట్​ ఇదిగో

Honda CB1000 Hornet : దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ హోండా నుంచి సరికొత్త బైక్​ రాబోతోంది. ఈ స్టైలిష్​ బైక్​ పేరు సీబీ1000 హార్నెట్​. ఈ మోడల్​ని.. 2023 ఈఐసీఎంఏ ఈవెంట్​లో ఆవిష్కరించింది సంస్థ. ఈ నేపథ్యంలో ఈ బ్రాండ్​ న్యూ బైక్​ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..

ట్రెండింగ్ వార్తలు

Skoda new SUV : మారుతీ సుజుకీ బ్రెజాకు పోటీగా స్కోడా కొత్త ఎస్​యూవీ..!

Infinix GT 20 Pro : ఇండియాలో ఇన్ఫీనిక్స్​ జీటీ 20 ప్రో లాంచ్​ డేట్​ ఫిక్స్​.. ఫీచర్స్​ ఇవే!

Honda Civic into Lamborghini : హోండా సివిక్​ని లంబోర్ఘినిగా మార్చిన యూట్యూబర్​- నెటిజన్లు ఫిదా!

Motorola X50 Ultra : మోటోరోలా ఎక్స్​50 అల్ట్రా లాంచ్​.. సూపర్​ కూల్​ ఫీచర్స్​తో!

హోండా కొత్త బైక్​..

ఇప్పటికే మార్కెట్​లో ఉన్న హోండా సీబీ1000ఆర్​ నియో స్పోర్ట్​ కేఫ్​ని ఈ సీబీ1000 హార్నెట్​ రిప్లేస్​ చేస్తుంది. దీని డిజైన్​ చాలా బోల్డ్​గా, అట్రాక్టివ్​గా ఉంది. చూస్తుంటే.. డుకాటీ స్ట్రీట్​ఫైటర్​ డిజైన్​ నుంచి స్ఫూర్తి పొంది.. ఈ మోడల్​ని తయారు చేసినట్టు ఉంది. ఇందులో ఫుల్​- ఎల్​ఈడీ హెడ్​లైట్​, రెసెస్డ్​ ఫ్యూయెల్​ ట్యాంక్​ ఉన్నాయి. టెయిల్​ సెక్షన్​.. సీబీ1000ఆర్​ని పోలి ఉంది.

Honda CB1000 Hornet price : ఈ బైక్​లో 999 సీసీ, లిక్విడ్​ కూల్డ్​, 16 వాల్వ్​, ఇన్​-లైన్​ 4 సిలిండర్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది.. 150 హెచ్​పీ పవర్​ని జనరేట్​ చేస్తుంది. బైక్​ సస్పెన్షన్స్​ కోసం ఫ్రెంట్​లో షోవా ఇన్​వర్టెడ్​ ఫోర్క్స్​ని, రేర్​లో ప్రో-లింక్​ మోనో షాక్​ యూనిట్​ని వినియోగించారు.

ఇక ఈ బైక్​లో సరికొత్త టెక్నాలజీని వాడుతోంది హోండా. సీబీ1000 హార్నెట్​లో రైడ్​ బై్​ వైర్​ సిస్టెమ్​, 5 ఇంచ్​ ఫుల్​- కలర్​ టీఎఫ్​టీ స్క్రీన్​, 5 రైడింగ్​ మోడ్స్​ ఉంటాయి.

హోండా కొత్త బైక్​ లాంచ్​ ఎప్పుడు?

Honda CB1000 Hornet 2024 launch date : హోండా సీబీ1000 హార్నెట్​.. 2024లో లాంచ్​ అయ్యే అవకాశం ఉంది. అన్ని అనుకున్నట్టు జరిగితే.. 2024లో ఈ మోడల్​ ఇండియాలోకి అడుగుపెడుతుంది. బిగ్​వింగ్​ డీలర్​షిప్స్​ ద్వారా ఈ బైక్​ సేల్స్​ జరుగుతాయి.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాలను చూస్తుంటే.. ఈ హోండా సీబీ1000 హార్నెట్​ అనేది ఒక ప్రీమియం, హై- ఎండ్​ బైక్​ అని స్పష్టంగా తెలుస్తోంది. మరి దీని ధర ఎంత ఉంటుంది? లాంచ్​ డేట్​ ఎప్పుడు? ఇతర ఫీచర్స్​ ఏంటి? మైలేజ్​ ఎంత ఇస్తుంది? వంటి వివరాలపై సంస్థ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

హోండా ఎక్స్​ఎల్​750 ట్రాన్సల్ప్​ని చూశారా?

హోండా మోటార్​సైకిల్​ అండ్​ స్కూటర్​ ఇండియా సంస్థ.. దేశంలో కొత్త బైక్​ని లాంచ్​ చేసింది. దీని పేరు హోండా ఎక్స్​ఎల్​750 ట్రాన్సల్ప్​. ఇదొక అడ్వెంచర్​ టూరర్​.

హోండా ఎక్స్​ఎల్​750 ట్రాన్సల్ప్​ డిజైన్​.. 1980 దశకంలో మంచి డిమాండ్​ సంపాదించుకున్న ట్రాన్సల్ప్​ మోడల్​ని పోలి ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం