Alloy wheels to Royal Enfield: రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్స్ కు అలాయ్ వీల్స్ ను ఫిట్ చేయడం ఎలా..?
Alloy wheels to Royal Enfield: మీ రాయల్ ఎన్ ఫీల్డ్ ఇంటర్ సెప్టార్ 650,రాయల్ ఎన్ ఫీల్డ్ కాంటినెంటల్ 650 లకు అలాయ్ వీల్స్ ను ఫిట్ చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం..

Alloy wheels to Royal Enfield: రాయల్ ఎన్ ఫీల్డ్ ఇంటర్ సెప్టార్ 650,రాయల్ ఎన్ ఫీల్డ్ కాంటినెంటల్ 650 బైక్స్ గత కొంతకాలంగా మార్కెట్‌లో ఉన్నాయి. ఈ బైక్స్ లో అతిపెద్ద సమస్య వీటికి ట్యూబ్‌లెస్ టైర్లు లేకపోవడం. వీటి బరువు 200 కిలోల కంటే ఎక్కువగా ఉన్నందున, పంక్చర్ అయిన సమయంలో రైడర్ చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాడు. వెనుక డిస్క్ బ్రేక్ కారణంగా చాలా మంది ఈ బైక్ పంక్చర్ ను సరి చేయడానికి కూడా వెనుకాడుతారు. మరవైపు సరైన ట్యూబ్ ను వెతుక్కోవడం మరో సమస్య.
ట్యూబ్ లెస్ టైర్స్ తో అలాయి వీల్స్
ఇకపై లేటెస్ట్ మోడల్స్ లో అల్లాయ్ వీల్స్‌ను అమర్చాలని రాయల్ ఎన్‌ఫీల్డ్ నిర్ణయించుకుంది. అయితే అవి ఇంటర్‌సెప్టర్ 650 మరియు కాంటినెంటల్ GT 650 యొక్క బ్లాక్-అవుట్ ఎడిషన్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా, ఇప్పటికే ఆర్ఈ బైక్స్ ను కొనుగోలు చేసినవారికి ఈ అలాయ్ వీల్స్ ను అందించడం లేదు. ఎన్ ఫీల్డ్ బైక్స్ కు స్పోక్డ్ వీల్స్ మంచివని మరి కొందరు వాదిస్తుంటారు. ఈ బైక్స్ కు పంక్చర్ అయినప్పుడు, అల్లాయ్ వీల్స్ అవసరం తెలుస్తుంది. ఇండియన్ మార్కెట్లో 18-అంగుళాల వీల్స్ కు సరైన టైర్స్ లభించడం లేదు. అదృష్టవశాత్తూ, Vredestein Centauro STలు 2023 కాంటినెంటల్ GT 650 బైక్ కు అనువుగా ఉన్నాయి.
How to get alloy wheels?: అల్లాయ్ వీల్స్ పొందడం ఎలా?
స్పేర్ పార్ట్స్ గా అల్లాయ్ వీల్స్ కావాలని కోరుతూ RE వర్క్‌షాప్ లో ఆర్డర్ ఇవ్వాలి. అయితే, అవి మీ సర్వీస్ సెంటర్ కు రావడానికి చాలా సమయం పడుతుంది. కనీసం 10 రోజులైనా పడుతుందని రాయల్ ఎన్ ఫీల్డ్ సర్వీస్ మెకానిక్స్ చెబుతారు. అలాయ్ వీల్స్ లో ఫ్రంట్ వీల్ ధర రూ.7,500 కాగా వెనుక చక్రానికి రూ.9,000 వరకు అవుతుంది. ఇది కాకుండా, మీరు సర్వీస్ సెంటర్ లేదా టైర్ షాప్ ద్వారా అల్లాయ్ వీల్స్ ను బిగించినట్లయితే ఫిట్టింగ్ ఛార్జీ కూడా అదనంగా ఉంటుంది.