తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Honda 2 Wheelers Offers: దీపావళి సందర్భంగా యాక్టివా సహా హోండా టూ వీలర్స్ పై స్పెషల్ డిస్కౌంట్స్

Honda 2 Wheelers offers: దీపావళి సందర్భంగా యాక్టివా సహా హోండా టూ వీలర్స్ పై స్పెషల్ డిస్కౌంట్స్

HT Telugu Desk HT Telugu

28 October 2023, 19:07 IST

    • Honda 2 Wheelers offers: హోండా కంపెనీ తమ టూ వీలర్ వాహనాలపై ఈ దీపావళి సందర్భంగా ప్రత్యేక ఆఫర్స్ ను ప్రకటించింది.
హోండా యాక్టివా 2023 లిమిటెడ్ ఎడిషన్
హోండా యాక్టివా 2023 లిమిటెడ్ ఎడిషన్

హోండా యాక్టివా 2023 లిమిటెడ్ ఎడిషన్

Honda 2 Wheelers offers: భారత్ లోని ప్రముఖ ద్వి చక్ర వాహన తయారీ సంస్థ హోండా తమ టూ వీలర్ వాహనాలపై ఈ దీపావళి సందర్భంగా ప్రత్యేక డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ ఆఫర్స్ లో రూ. 5 వేల వరకు క్యాష్ బ్యాక్, జీరో డౌన్ పేమెంట్, నో కాస్ట్ ఈఎంఐ, రుణాలపై అతి తక్కువ వడ్డీ రేటు, నో హైపొథికేషన్.. మొదలైనవి ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Skoda new SUV : మారుతీ సుజుకీ బ్రెజాకు పోటీగా స్కోడా కొత్త ఎస్​యూవీ..!

Infinix GT 20 Pro : ఇండియాలో ఇన్ఫీనిక్స్​ జీటీ 20 ప్రో లాంచ్​ డేట్​ ఫిక్స్​.. ఫీచర్స్​ ఇవే!

Honda Civic into Lamborghini : హోండా సివిక్​ని లంబోర్ఘినిగా మార్చిన యూట్యూబర్​- నెటిజన్లు ఫిదా!

Motorola X50 Ultra : మోటోరోలా ఎక్స్​50 అల్ట్రా లాంచ్​.. సూపర్​ కూల్​ ఫీచర్స్​తో!

తక్కువ వడ్డీ రేటు..

ఈ దీపావళి సందర్భంగా హోండా బైక్స్ లేదా స్కూటర్స్ కొనుగోలు చేసేవారికి అతి తక్కువ వడ్డీ రేటుకే వాహన రుణాలను హోండా అందిస్తోంది. ఈ వడ్డీ రేటు 6.99% అని సంస్థ ప్రకటించింది. హోండా షైన్ 100 బైక్ పై ‘‘100 పై 100’’ (100 pe 100) స్కీమ్ ను కూడా అమలు చేస్తోంది. ఈ ఆఫర్స్ పరిమిత కాలం పాటు మాత్రమే అమల్లో ఉంటాయని, అలాగే, పలు షరతులు వర్తిస్తాయని హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా (Honda Motorcycle and Scooter India) సంస్థ వెల్లడించింది.

సీబీ 300 ఆర్

హోండా ఇటీవలే భారతీయ మార్కెట్లో CB300R OBD2-అనుకూల వెర్షన్‌ను విడుదల చేసింది. దీని ధర రూ. 2.40 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇది గతంలో ఉన్న ధర కంటే రూ. 37,000 తక్కువ. ఇది బజాజ్ డామినార్ 400, TVS అపాచీ RTR 310, KTM 390 డ్యూక్, BMW G 310 R లకు పోటీగా ఉంది. CB300R బైక్ లో 286 సీసీ, సింగిల్-సిలిండర్ ఇంజన్ ను అమర్చారు. ఇది DOHC సెటప్, లిక్విడ్ కూలింగ్‌ని ఉపయోగిస్తుంది. ఇది 9,000 ఆర్పీఎం వద్ద 29.98 బీహెచ్పీ గరిష్ట శక్తిని, 7,500 ఆర్పీఎం వద్ద 27.5 ఎన్ఎం గరిష్ట టార్క్ అవుట్‌పుట్‌ను విడుదల చేస్తుంది. ఈ బైక్ లో స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్‌తో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ ఉంది.

యాక్టివా..

హోండా సంస్థ యాక్టివా కొత్త లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌ను కూడా మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధరలు స్టాండర్డ్ వేరియంట్ కు రూ.80,734, స్మార్ట్ వేరియంట్ కు రూ.82,734 లుగా నిర్ణయించారు. రెండు కూడా ఎక్స్-షోరూమ్ ధరలు. ఈ లిమిటెడ్ ఎడిషన్ లో మెకానికల్ మార్పులేవీ చేయలేదు. కొద్దిగా కాస్మెటిక్ మార్పులు మాత్రం చేశారు. ఈ లిమిటెడ్ ఎడిషన్ పెర్ల్ సైరన్ బ్లూ, మ్యాట్ స్టీల్ బ్లాక్ మెటాలిక్ కలర్స్ లో లభిస్తుంది.

తదుపరి వ్యాసం