Royal Enfield Himalayan 450 vs KTM 390 Adventure : ఈ రెండు బైక్స్‌లో ఏది కొనాలి?
Royal Enfield Himalayan 450 vs KTM 390 Adventure : రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450 వర్సెస్ కేటీఎం 390 అడ్వెంచర్.. ఈ రెండింట్లో ఏది బెస్ట్? ఏది కొనాలి? ఇక్కడ తెలుసుకుందాము..
Royal Enfield Himalayan 450 vs KTM 390 Adventure : రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450 ఇటీవలే లాంచ్ అయ్యింది. ఈ బైక్‌పై ప్రజల్లో మంచి ఆసక్తి కనిపిస్తోంది. అయితే.. ఇప్పటికే మార్కెట్లో ఉన్న కేటీ 390 అడ్వెంచర్‌కి ఈ మోడల్ గట్టిపోటీనిస్తుందని అంచనాలు ఉన్నాయి. ఈ రెండింట్లో ఏది కొనాలి? అని చాలా మంది ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఈ రెండు బైక్స్‌లో ఏది బెస్ట్? ఏది కొంటే వాల్యూ ఫర్ మనీ? అనేది ఇక్కడ తెలుసుకుందాము..
రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450 వర్సెస్ కేటీఎం 390 అడ్వెంచర్- ఫీచర్స్..
సరికొత్త హిమాలయన్ 450 బైక్‌లో చాలా ఫీచర్సే ఉన్నాయి! ఎల్ఈడీ హెడ్‌లైట్స్, ఇంటిగ్రేటెడ్ టెయిల్‌లైట్, టర్న్ ఇండికేటర్స్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన 4 ఇంచ్ టీఎఫ్టీ డిస్ప్లే వంటివి వస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌ని కనెక్ట్ చేసిన తర్వాత.. నేవిగేషన్, మీడియా కంట్రోల్స్, కాల్స్, ఎస్ఎంఎస్ నోటిఫికేషన్‌ను స్క్రీన్‌పై పొందొచ్చు. రైడ్-బై- వైర్‌తో కూడిన రెండు మోడ్స్, స్విచెబుల్ ఏబీఎస్ వంటివి ఇందులో ఉన్నాయి.
ఇక కేటీఎం 390 అడ్వెంచర్‌లో ఎల్ఈడీ లైట్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, అడ్జెస్టెబుల్ విండ్‌షీల్డ్, కలర్ టీఎఫ్టీ డిస్ప్లే వంటివి ఉంటాయి. స్మార్ట్‌ఫోన్‌ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఛార్జింగ్ పాయింట్ కూడా ఉంది. ఆఫ్ రోడ్ అడ్వెంచర్, 2 రైడింగ్ మోడ్స్, టర్న్ బై టర్న్ నేవిగేషన్, ఏబీఎస్ మోడ్స్, ట్రాక్షన్ కంట్రోల్, బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ వంటివి ఇందులో లభిస్తున్నాయి.
రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450 వర్సెస్ కేటీఎం 390 అడ్వెంచర్- ఇంజిన్..
Royal Enfield Himalayan 450 price Hyderabad : రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త బైక్‌లో 452 సీసీ, సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది.. 39.2 బీహెచ్పీ పవర్‌ని 40 ఎన్ఎం టార్క్‌ని జనరేట్ చేస్తుంది. 6 స్పీడ్ గేర్‌బాక్స్ దని సొంతం.
మరోవైపు కేటీఎం బైక్‌లో 373.2 సీసీ, సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 43 బీహెచ్పీ పవర్‌ని, 37 ఎన్ఎం టార్క్‌ని జనరేట్ చేస్తుంది. 6 స్పీడ్ గేర్‌బాక్స్ దీని సొంతం. క్విక్ షిఫ్టర్, స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ వంటివి వస్తున్నాయి.
రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450 వర్సెస్ కేటీఎం 390 అడ్వెంచర్- ధరలు..
Royal Enfield Himalayan 450 on road price : రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450లో మూడు వేరియంట్లు ఉన్నాయి. అవి బేస్, పాస్, సమిట్. వీటి ఎక్స్‌షోరూం ధరలు వరుసగా.. రూ. 2.69లక్షలు, రూ. 2.74లక్షలు, రూ. 2.84లక్షలు.
ఇక కేటీఎం 390 అడ్వెంచర్ అలాయ్ వీల్స్ వేరియంట్ ఎక్స్‌షోరూం ధర రూ. 3.39లక్షలు. స్పోక్డ్ వీల్స్ ఎక్స్‌షోరూం ధర రూ. 3.61లక్షలుగా ఉంది.
సంబంధిత కథనం