తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Renault Rafale Suv : ఇదిగో రెనాల్ట్​ 'రఫేల్​'.. ఎస్​యూవీ లుక్​ అదిరింది!

Renault Rafale SUV : ఇదిగో రెనాల్ట్​ 'రఫేల్​'.. ఎస్​యూవీ లుక్​ అదిరింది!

Sharath Chitturi HT Telugu

19 June 2023, 13:40 IST

google News
    • Renault Rafale SUV : రెనాల్ట్​ రఫేల్​ ఎస్​యూవీని తాజాగా ఆవిష్కరించింది ఆటోమొబైల్​ సంస్థ. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..
ఇదిగో రెనాల్ట్​ రఫేల్​.. ఎస్​యూవీ లుక్​ అదిరింది!
ఇదిగో రెనాల్ట్​ రఫేల్​.. ఎస్​యూవీ లుక్​ అదిరింది!

ఇదిగో రెనాల్ట్​ రఫేల్​.. ఎస్​యూవీ లుక్​ అదిరింది!

Renault Rafale SUV : ఫ్రాన్స్​కు చెందిన దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ రెనాల్ట్​.. మరో ఎస్​యూవీని సిద్ధం చేస్తోంది. ఈ ‘రెనాల్ట్​ రఫేల్’​ కూపే ఎస్​యూవీని తాజాగా ఆవిష్కరించింది. వచ్చే ఏడాదిలో డెలివరీలు మొదలవుతాయని స్పష్టం చేసింది.

డాషింగ్​ లుక్స్​తో..

1934 నాటి కాడ్రాన్​- రెనాల్ట్​ రఫేల్​ ఫైటర్​ జెట్​కు గుర్తుగా.. ఈ ఎస్​యూవీని సిద్ధం చేస్తోంది రెనాల్ట్​ సంస్థ. ఈ వాహనం లుక్స్​ చాలా అగ్రెసివ్​గా, డాషింగ్​గా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్​లో లాంచ్​ తర్వాత.. ఇండియాలోనూ ఈ మోడల్​ అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి.

ఇక రెనాల్ట్​ రఫేల్​లో స్లోపింగ్​ రూఫ్​లైన్​, పెద్ద బానెట్​, బ్లాక్​డ్​ ఔట్​ గ్రిల్​, వైడ్​ ఎయిర్​ వెంట్​, మాట్రిక్స్​ ఆకారంలో ఎల్​ఈడీ హెడ్​లైట్స్​ వంటివి ఉన్నాయి. రేర్​లో.. బ్లాక్​ పిల్లర్స్​, ఓఆర్​వీఎంలు, ఫ్లేర్డ్​ వీల్​ ఆర్చీస్​, స్టైలిష్​ ఎయిరోడైనమిక్​ వీల్స్​, షార్క్​ ఫిన్​ యాంటీనా, వ్రాప్​ అరౌండ్​ టెయిల్​ల్యాంప్స్​ వంటివి వస్తున్నాయి.

ఆల్పైన్​ బ్లూ, సాటిన్​ పర్ల్​ వైల్​ కలర్స్​లో ఈ మోడల్​ అందుబాటులో ఉండనుంది. ఇక ఈ కూపే ఎస్​యూవీ పొడవు 4,710ఎంఎం. వెడల్పు 1,860ఎంఎం.

రెనాల్ట్​ రఫేల్​..

రెనాల్ట్​ కొత్త ఎస్​యూవీ ఇంజిన్​..

ఈ రెనాల్ట్​ వెహికిల్​లో 1.2 లీటర్​ టర్బోఛార్జ్​డ్​, 3 సిలిండర్​, పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 2 ఎలక్ట్రిక్​ మోటార్స్​తో కనెక్ట్​ అయి ఉంటుంది. సాధారణంగా 130 హెచ్​పీ పవర్​ను జనరేట్​ చేసే ఈ ఇంజిన్​.. ఎలక్ట్రిక్​ మోటార్లను కనెక్ట్​ చేస్తే.. 200 హెచ్​పీ వరకు ఔట్​పుట్​ను ఇస్తుంది.

ఇక ఫీచర్స్​ విషయానికొస్తే.. ఈ రెనాల్ట్​ రఫేల్​ 5 సీటర్​ కేబిన్​లో పానోరమిక్​ గ్లాస్​ రూఫ్​, ఆర్మ్​రెస్ట్​తో కూడిన భారీ సెంటర్​ కన్సోల్​, ఫ్లాట్​- బాటమ్​ మల్టీఫంక్షనల్​ స్టీరింగ్​ వీల్​, 9.3 ఇంచ్​ హెడ్​-అప్​ డిస్​ప్లే, 12.3 ఇంచ్​ డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, 12.0 ఇంచ్​ వర్టికల్లీ ఓరియెంటెడ్​ టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​లు వంటివి లభిస్తున్నాయి. యాపిల్​ కార్​ప్లే, ఆండ్రాయిడ్​ ఆటో వంటి కనెక్టివిటీ ఫీచర్స్​ ఎలాగో ఉంటాయి.

ఇక సేఫ్టీ కోసం ఈ రెనాల్ట్​ ఎస్​యూవీలో మల్టిపుల్​ ఎయిర్​బ్యాగ్స్​తో పాటు ఇతర ఫీచర్స్​ వస్తున్నాయి.

రెనాల్ట్​ రఫేల్​ రేర్​ లుక్​..

మరి.. ధర ఎంత?

రెనాల్ట్​ రఫేల్​ లాంచ్​, ధర వంటి వివరాలు ఇంకా తెలియరాలేదు. అయితే.. యరోప్​లో ఈ ఎస్​యూవీ​ ధర 55,000 యూరోలుగా ఉండొచ్చు. అంటే ఇండియన్​ కరెన్సీలో అది రూ. 49.3లక్షలు.

రెనాల్ట్​ క్విడ్​ ఈవీ.. లాంచ్​ ఎప్పుడు?

ఇండియా మార్కెట్​లో.. డిమాండ్​ అధికంగా ఉన్న ఎలక్ట్రిక్​ వాహనాల సెగ్మెంట్​పై ఇప్పుడు దాదాపు అన్ని ఆటో సంస్థలు పెట్టాయి. కొత్త కొత్త లాంచ్​లతో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఈ జాబితాలోకి రెనాల్ట్​ కూడా చేరే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. క్విడ్​కు ఈవీ వర్షెన్​ను తీసుకొచ్చి.. ఇండియా మార్కెట్​లో వేగంగా వృద్ధి చెందాలని రెనాల్ట్​ సంస్థ భావిస్తున్నట్టు సమాచారం.

క్విడ్​ హ్యాచ్​బ్యాక్​కు మేడ్​-ఇన్​- ఇండియా ఎలక్ట్రిక్​ వర్షెన్​ లాంచ్​ చేసే విషయంపై రెనాల్ట్​ కసరత్తులు చేస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే.. భాగస్వామి సంస్థ నిస్సాన్​ మోటార్​తో ఈ విషయంపై ఇంకా చర్చలు జరిపినట్టు కనిపించడం లేదు. కానీ ఈవీ సెగ్మెంట్​లో బిజినెస్​ను చూసి.. ఎలక్ట్రిక్​ వాహనాలను ఇండియాలోకి తీసుకొచ్చేందుకు రెనాల్ట్​ సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం