Hyundai Exter SUV : హ్యుందాయ్ కొత్త ఎస్‌యూవీకి బ్రాండ్ అంబాసిడర్‌గా హార్దిక్ పాండ్యా
12 June 2023, 14:20 IST
- Hyundai Exter SUV brand ambassador : ప్రముఖ క్రికెటర్ హార్దిక్ పాండ్యాను ఎక్స్టర్ ఎస్‌యూవీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేసుకుంది హ్యుందాయ్ సంస్థ. త్వరలోనే ఈ ఎస్యూవీ ఇండియాలో లాంచ్కానుంది.
హ్యుందాయ్ కొత్త ఎస్‌యూవీకి బ్రాండ్ అంబాసిడర్‌గా హార్దిక్ పాండ్యా
Hardik Pandya Hyundai Exter SUV : హ్యుందాయ్ మోటార్ ఇండియా మంచి జోరు మీద ఉంది. కొత్త ఎస్యూవీ ఎక్స్టర్ను జులై 10న లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్న హ్యుందాయ్ సంస్థ.. మరో పెద్ద ప్లానే వేసింది. ఇందులో భాగంగా ప్రముఖ క్రికెటర్ హార్దిక్ పాండ్యాను ఎక్స్టర్ ఎస్‌యూవీకి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది.
క్రేజ్, సేల్స్ పెంచుకోవాలని..!
హ్యుందాయ్ ఎక్స్టర్ను జెన్ జెడ్ కస్టమర్ల కోసం ప్రత్యేకంగా తయారు చేసినట్టు ఇప్పటికే అనేకమార్లు చెప్పింది సంస్థ. ఇక ఇప్పుడు.. హార్దిక్ పాండ్యాను బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేసుకుంది. ఈ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌కు యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ ఫాలోయింగ్‌తో ఎక్స్టర్ సేల్స్‌ను పెంచుకోవాలని హ్యుందాయ్ అభిప్రాయపడుతోంది.
"హ్యుందాయ్ ఎక్స్టర్ ఇమేజ్ను మరో స్థాయికి తీసుకెళ్లాలని మాకు ఉంది. ఈ పనికి హార్దిక్ పాండ్యా తప్ప ఇంకెవ్వరు సరిపోరు. ఈ తరం క్రికెట్ చరిత్రలో అత్యంత ప్రతిభావంతమైన క్రికెటర్‌గా పాండ్యాకు గుర్తింపు ఉంది," అని హ్యుందాయ్ మోటార్ ఇండియా సీఓఓ తరుణ్ గర్గ్ తెలిపారు.
ఇదీ చూడండి:- Honda Elevate SUV : ఇదిగో.. హోండా ఎలివేట్ ఎస్యూవీ- అదిరిన ఫీచర్స్!
ఎక్స్టర్ ఇలా ఉంటుంది..!
Hyundai Exter SUV price : లాంచ్ డేట్ సమీపిస్తున్న కొద్ది.. వెహికిల్‌కు సంబంధించిన టీజర్లను ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ వస్తోంది హ్యుందాయ్ సంస్థ. వీటి ద్వారా ఎస్‌యూవీలో ఉండే కొన్ని ఫీచర్స్పై క్లారిటీ వచ్చింది. డ్యూయెల్ కెమెరాలు ఉన్న డాష్కామ్, స్మార్ట్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వంటివి ఇందులో ఉంటాయి. వాయిస్ కమాండ్స్‌తో ఈ సన్‌రూఫ్‌ను ఆపరేట్ చేసే ఫీచర్ కూడా ఈ ఎక్స్టర్ ఎస్‌యూవీలో ఉన్నట్టు తెలుస్తోంది. 'ఓపెన్ సన్‌రూఫ్', 'ఐ వాంట్ టు సీ ది స్కై (నాకు ఆకాశాన్ని చూడాలని ఉంది)' అని కొన్ని కమాండ్స్ ఇస్తే.. సన్‌రూఫ్ ఓపెన్ అవుతుందని సమాచారం. అయితే ఇది కేవలం టాప్ ఎండ్ వేరియంట్‌కే అందుబాటులో ఉండొచ్చు.
హ్యుందాయ్ ఎక్స్టర్లో 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్ 82 బీహెచ్పీ పవర్‌ను, 114 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇందులో 5 స్పీడ్ మేన్యువల్, 5 స్పీడ్ ఏఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్స్ ఉండనున్నాయి. సీఎన్జీ ఆప్షన్ కూడా లభించొచ్చు.
Hyundai Exter SUV specifications : హ్యుందాయ్ ఎక్స్టర్ ఎస్యూవీ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, ధర వంటి వివరాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. లాంచ్ టైమ్‌కి వీటిపై ఓ క్లారిటీ వస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.