Hyundai Exter SUV : మెరుగైన సెఫ్టీ ఫీచర్లతో హ్యుండాయ్ ఎక్స్‌టర్ కారు.. వివరాలను ప్రకటించిన కంపెనీ
17 May 2023, 12:47 IST
- Hyundai Exter SUV : ఎక్స్‌టర్ ఎస్‍యూవీ సేఫ్టీ ఫీచర్లను హ్యుండాయ్ వెల్లడించింది. స్టాండర్డ్ వేరియంట్లు కూడా ఆరు ఎయిర్ బ్యాగ్‍లను కలిగి ఉంటాయి.
Hyundai Exter SUV : మంచి సెఫ్టీ ఫీచర్లతో హ్యుండాయ్ ఎక్స్‌టర్ కారు.. వివరాలను ప్రకటించిన కంపెనీ
Hyundai Exter SUV : హ్యుండాయ్ ఎక్స్‌టర్ ఎస్‍యూవీ త్వరలో భారత మార్కెట్‍లో లాంచ్ కానుంది. ఇప్పటికే బుకింగ్స్ మొదలుకాగా.. ఈ కారు జూన్ లేకపోతే జూలైలో విడుదలవుతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ తరుణంలో ఎక్స్‌టర్ మైక్రో ఎస్‍యూవీకి చెందిన సేఫ్టీ ఫీచర్లను హ్యుండాయ్ (Hyundai) వెల్లడించింది. స్డాండర్డ్‌గా హ్యుండాయ్ ఎక్స్‌టర్ కారులో ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. అన్ని వేరియంట్లకు ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఉన్న తొలి సబ్-ఫోర్ మీటర్ ఎస్‍యూవీ కారుగా హ్యుండాయ్ ఎక్స్‌టర్ నిలువనుంది. మొత్తంగా 26 సెఫ్టీ ఫీచర్లు ఉంటాయి. టాప్ వేరియంట్లలో 40కుపైగా అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్లు ఉండన్నాయి. హ్యుండాయ్ ఎక్స్‌టర్ కారు సెఫ్టీ ఫీచర్లు, మిగిలిన వివరాలు ఇవే.
Hyundai Exter SUV : ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‍మెంట్ (VSM), హిల్ అసిస్ట్ కంట్రోల్ (HAC), బర్గ్‌లర్ అలారమ్ సిస్టమ్.. హ్యుండాయ్ ఎక్స్‌టర్ స్టాండర్డ్ సెఫ్టీ ఫీచర్లుగా ఉన్నాయి. త్రీ పాయింట్ సీట్ బెల్ట్, సీట్ బెల్ట్ రిమైండర్, ఈబీడీతో ఏబీఎస్, కీలెస్ ఎంట్రీ, రేర్ పార్కింగ్ సెన్సార్స్, ఈఎస్ఎస్ సహా మరిన్ని బేసిక్ ఫీచర్లుగా ఉంటాయి.
Hyundai Exter SUV : ఇక.. హెడ్‍ల్యాంప్ ఎస్కార్ట్ ఫంక్షన్, ఆటో హెడ్‍ల్యాంప్స్, ఐఓస్ఓఫిక్స్, రేర్ డిఫాగర్, రేర్ పార్కింగ్ కెమెరా లాంటి అడ్వాన్స్డ్ సెఫ్టీ ఫీచర్లను హ్యుండాయ్ ఎక్స్‌టర్ టాప్ వేరియంట్లు కలిగి ఉంటాయి. ఈ సెగ్మెంట్‍లో తొలిసారి డ్యుయల్ కెమెరా, టీపీఎంఎస్ డ్యాష్ క్యామ్‍ను హ్యుండాయ్ ఇస్తోంది.
Hyundai Exter SUV : హ్యుండాయ్ ఎక్స్‌టర్ EX, S, SX, SX(O), SX(O) కనెక్ట్ అనే ఐదు వేరియంట్లలో రానుంది. ఇందులో EX, S ఎంట్రీ లెవెల్ వేరియంట్లుగా ఉండగా.. మిగిలిన మూడు టాప్ స్పెక్ వేరియంట్లుగా ఉంటాయి. ఇప్పటికే ఎక్స్‌టర్ ఎస్‍యూవీ బుకింగ్‍లను హ్యుండాయ్ ప్రారంభించింది. రూ.11,000 టోకెన్ అమౌంట్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు. టాటా పంచ్, నిస్సాన్ మాగ్నైట్, మారుతీ ఫ్రాంక్స్ లాంటి కార్లతో హ్యుండాయ్ ఎక్స్‌టర్ పోటీ పడనుంది.
Hyundai Exter SUV : 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ (E20 ఫ్యుయెల్ రెడీ)తో హ్యుండాయ్ ఎక్స్‌టర్ కారు రానుంది. ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, స్మార్ట్ ఆటో ఏఎంటీ ఆప్షన్‍లు ఉంటాయి. అలాగే 1.2-లీటర్ బయో ఫ్యుయెల్ పెట్రోల్, సీఎన్‍జీ ఆప్షన్ కూడా ఉంటుంది. సీఎన్‍జీ వేరియంట్ ఫైవ్-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‍ను కలిగి ఉంది. హ్యుండాయ్ ఎక్స్‌టర్ ఎస్‍యూవీ ప్రారంభ ధర రూ.6లక్షల దరిదాపుల్లో ఉండొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి.