తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hyundai Exter Suv Bookings : హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఎస్​యూవీ బుకింగ్స్​ షురూ..

Hyundai Exter SUV bookings : హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఎస్​యూవీ బుకింగ్స్​ షురూ..

Sharath Chitturi HT Telugu

08 May 2023, 12:56 IST

google News
    • Hyundai Exter SUV bookings : త్వరలోనే మార్కెట్​లోకి అడుగుపెట్టనున్న హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఎస్​యూవీ బుకింగ్స్​ ప్రారంభమయ్యాయి. పూర్తి వివరాలు..
హ్యుందాయ్​ ఎక్స్​టర్​
హ్యుందాయ్​ ఎక్స్​టర్​ (Instagram/seoul_car_spotting)

హ్యుందాయ్​ ఎక్స్​టర్​

Hyundai Exter SUV bookings : భారత ఆటోమొబైల్​ మార్కెట్​లో హాట్​ టాపిక్​గా మారిన హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఎస్​యూవీకి సంబంధించిన బుకింగ్స్​ ప్రారంభమయ్యాయి. రూ. 11వేల టోకెన్​ అమౌంట్​తో ఆన్​లైన్​లో ఈ ఎస్​యూవీని బుక్​ చేసుకోవచ్చు. ఈ విషయాన్ని హ్యుందాయ్​ మోటార్స్​ సోమవారం ప్రకటించింది.

ఐదు వేరియంట్లలో హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఎస్​యూవీ..

సౌత్​ కొరియాలో ఉన్న ‘కాస్పర్’​ను ఇండియాలో ఎక్స్​టర్​గా విక్రయిస్తోంది హ్యుందాయ్​ మోటార్స్​. కంపెనీకి ఈ మోడల్​ ఒక ఎంట్రీ- లెవల్​ ఎస్​యూవీగా ఉండనుంది. వెన్యూ, క్రేటా, టుక్సాన్​ వంటి కంపెనీ మోడల్స్​ సరసన ఇది చేరనుంది. ఇండియాలో ఎస్​యూవీలకు పెరుగుతున్న డిమాండ్​ను క్యాష్​ చేసుకోవాలని భావిస్తున్న హ్యుందాయ్​ సంస్థ.. ఈ ఎక్స్​టర్​పై భారీ ఆశలే పెట్టుకుంది. ముఖ్యంగా యువతను ఆకర్షించే విధంగా దీనిని రూపొందిస్తోంది!

Hyundai Exter SUV launch in India : ఈ హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఎస్​యూవీ మొత్తం ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. వాటి పేర్లు.. ఈఎక్స్​, ఎస్​, ఎస్​ఎక్స్​, ఎస్​ఎక్స్(ఓ), ఎస్​ఎక్స్​(ఓ) కనెక్ట్​. ఈ ఎస్​యూవీలో మూడు ఇంజిన్​ ఆప్షన్స్​ ఉంటాయి. అవి.. 1.2 ఎల్​ కప్పా పెట్రోల్​ ఇంజిన్​ (5 స్పీడ్​ మేన్యువ్​ ట్రాన్స్​మిషన్​/ స్మార్ట్​ ఆటో ఎంటీ), 1.2 ఎల్​ బై- ఫ్యూయెల్​ కప్పా పెట్రోల్​, సీఎన్​జీ వర్షెన్​.

ఎక్స్​టర్​ ఎస్​యూవీలో మూడు డ్యూయెల్​ టోన్​, ఆరు సింగిల్​ టోన్​ కలర్​ ఆప్షన్స్​ ఉండటం విశేషం. రేంజర్​ ఖాఖీ షేడ్​ రంగుపై అందరు ఆసక్తిగా ఉన్నారు.

హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఎస్​యూవీ- డిజైన్​..

Hyundai Exter SUV launch date : ఇటీవలే లీక్​ అయిన స్పై షాట్స్​ ప్రకారం.. ఎక్స్​టర్​ ఎస్​యూవీ సైడ్​లో అలాయ్​ వీల్స్​తో కూడిన స్క్వేర్డ్​ వీల్​ ఆర్చీస్​ ఉంటాయి. సీ- పిల్లర్​కు డ్యూయెల్​ టోన్​, బ్లాక్​ రూఫ్​ రెయిల్స్​ లభిస్తున్నాయి. రేర్​లో ఎస్​యూవీకి వ్రాప్​ అరౌండ్​ టెయిల్​లైట్స్​, ఫ్రెంట్​లో ఎల్​ఈడీ యూనిట్​ తరహా హెడ్​లైడ్స్​ వస్తున్నాయి. టెయిల్​లైట్స్​కి కూడా 'హెచ్​' షేప్​ డీఆర్​ఎల్స్​ లభిస్తున్నాయి. ఫ్రెంట్​ లైట్స్​కి ఇవి ఉన్నట్టు డిజైన్​ రెండర్​లో స్పష్టమైంది. ఎస్​యూవీ రేర్​లో టెయిల్​లైట్స్​ని కనెక్ట్​ చేస్తూ లైట్​ బార్​​ వస్తోంది. రెండర్​ ప్రకారం ఫ్రెంట్​లో పారామెట్రిక్​ పాటర్న్​తో కూడిన గ్రిల్​ ఉంటుంది.

Hyundai Exter SUV price in India : ఈ కొత్త ఎస్​యూవీ ప్రారంభం ఎక్స్​షోరూం ధర రూ. 6లక్షలుగా ఉండొచ్చు. లాంచ్​ డేట్​, స్పెసిఫికేషన్స్​, ఫీచర్స్​ వంటి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక లాంచ్​ తర్వాత ఈ ఎస్​యూవీ.. టాటా పంచ్​, సిట్రోయెన్​ సీ3, మారుతీ సుజుగీ ఇగ్నిస్​, నిస్సాన్​ మాగ్నైట్​ వంటి మోడల్స్​కు గట్టి పోటీనిస్తుందని మార్కెట్​ వర్గాల్లో అంచనాలు ఉన్నాయి.

తదుపరి వ్యాసం