Hyundai Exter SUV : ఇండియాలో లాంచ్​కు సిద్ధమవుతున్న హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఇదే..!-hyundai exter suv revealed for the first time to compete with tata punch see pics ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hyundai Exter Suv : ఇండియాలో లాంచ్​కు సిద్ధమవుతున్న హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఇదే..!

Hyundai Exter SUV : ఇండియాలో లాంచ్​కు సిద్ధమవుతున్న హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఇదే..!

Sharath Chitturi HT Telugu
May 05, 2023 06:33 AM IST

Hyundai Exter : హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఎస్​యూవీ ఆన్​లైన్​లో రివీల్​ అయ్యింది. త్వరలోనే ఇండియాలో లాంచ్​ అవుతుంది. పూర్తి వివరాలు..

హ్యుందాయ్​ ఎక్స్​టర్​
హ్యుందాయ్​ ఎక్స్​టర్​ (Instagram/seoul_car_spotting)

Hyundai Exter SUV : ఇండియాలో లాంచ్​ అయ్యేందుకు హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఎస్​యూవీ సిద్ధమవుతోంది. అయితే.. అధికారిక లాంచ్​కు  ముందు ఈ కొత్త ఎస్​యూవీ ఫొటోలు రివీల్​ అయ్యాయి. టాటా పంచ్​, సిట్రోయెన్​ సీ3కి గట్టిపోటీనిచ్చే విధంగా ఉన్న ఈ ఎక్స్​టర్.. సౌత్​ కొరియా విధుల్లో టెస్ట్​ డ్రైవ్​ చేస్తుండగా కనిపించింది. ఎస్​యూవీ వెనక, ముందు భాగాలను తొలిసారిగా ఈ ఫొటోల ద్వారా చూడవచ్చు. ఈ కారుకు సంబంధించిన డిజైన్​ రెండర్​​ను హ్యుందాయ్​ మోటార్స్​ ఇటీవలే రివీల్​ చేసిన విషయం తెలిసిందే.

హ్యుందాయ్​ ఎక్స్​టర్​.. వావ్​ అనిపించేలా!

Hyundai Exter SUV launch in India : స్పై షాట్స్​ ప్రకారం.. ఎక్స్​టర్​ ఎస్​యూవీ సైడ్​లో అలాయ్​ వీల్స్​తో కూడిన స్క్వేర్డ్​ వీల్​ ఆర్చీస్​ ఉన్నాయి. సీ- పిల్లర్​కు డ్యూయెల్​ టోన్​, బ్లాక్​ రూఫ్​ రెయిల్స్​ లభిస్తున్నాయి. రేర్​లో ఎస్​యూవీకి వ్రాప్​ అరౌండ్​ టెయిల్​లైట్స్​, ఫ్రెంట్​లో ఎల్​ఈడీ యూనిట్​ తరహా హెడ్​లైడ్స్​ వస్తున్నాయి. టెయిల్​లైట్స్​కి కూడా హెచ్​ షేప్​ డీఆర్​ఎల్స్​ లభిస్తున్నాయి. ఫ్రెంట్​ లైట్స్​కి ఇవి ఉన్నట్టు డిజైన్​ రెండర్​లో స్పష్టమైంది. ఎస్​యూవీ రేర్​లో టెయిల్​లైట్స్​ని కనెక్ట్​ చేస్తూ లైట్​ బార్​​ వస్తోంది. రెండర్​ ప్రకారం ఫ్రెంట్​లో పారామెట్రిక్​ పాటర్న్​తో కూడిన గ్రిల్​ ఉంటుంది.

ఇదీ చదవండి :- Hyundai Ai3 SUV launch : హ్యుందాయ్​ నుంచి కొత్త ఎస్​యూవీ.. త్వరలోనే లాంచ్​!

ఈ ఎక్స్​టర్ ఎస్​యూవీని కేవలం పెట్రోల్​ ఇంజిన్​తోనే హ్యుందాయ్​ ఆఫర్​ చేస్తుందని తెలుస్తోంది. ఇందులో మేన్యువల్​, ఆటోమెటిక్​ గేర్​బాక్స్​ ఆప్షన్స్​ ఉండనున్నాయి! ఐఎంటీ గేర్​బాక్స్​ ఆప్షన్​ కూడా ఉండొచ్చు. ఫీచర్​-లోడెడ్​ ఎస్​యూవీగా ఇది ఇండియా మార్కెట్​లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. భారీ ఇన్ఫోటైన్​మెంట్​ స్క్రీన్​, కనెక్టెడ్​ టెక్నాలజీలతో పాటు ఇతర ఫీచర్స్​ ఉండొచ్చు. ఇక హ్యుందాయ్​ పోర్ట్​ఫోలియోలో ఈ కొత్త ఎస్​యూవీ గ్రాండ్​ ఐ10 నియోస్​, వెన్యూల మధ్యలో ఉండొచ్చు.

కొత్త ఎస్​యూవీ ధర ఇదే..!

Hyundai Exter SUV price in India : హ్యుందాయ్​ ఎక్స్​టర్​ అతి త్వరలోనే ఇండియాలోకి వస్తుందని తెలుస్తోంది. దీని ప్రారంభం ఎక్స్​షోరూం ధర రూ. 6లక్షలుగా ఉండొచ్చు. లాంచ్​ సమయంలో ఈ ఎస్​యూవీకి సంబంధించిన స్పెసిఫికేషన్స్​, ఫీచర్స్​, ధరపై పూర్తి వివరాలు తెలిసే అవకాశ ఉంది. ఇక లాంచ్​ తర్వాత ఈ ఎస్​యూవీ.. టాటా పంచ్​, సిట్రోయెన్​ సీ3, మారుతీ సుజుగీ ఇగ్నిస్​, నిస్సాన్​ మాగ్నైట్​ వంటి మోడల్స్​కు గట్టి పోటీనిస్తుందని మార్కెట్​ వర్గాల్లో అంచనాలు ఉన్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం