Hyundai Ai3 SUV launch : హ్యుందాయ్ నుంచి కొత్త ఎస్యూవీ.. త్వరలోనే లాంచ్!
10 April 2023, 13:38 IST
- Hyundai Ai3 SUV launch in India : హ్యుందాయ్ నుంచి ఓ కొత్త ఎస్యూవీ ఇండియా మార్కెట్లోకి అడుగుపెట్టనున్నట్టు తెలుస్తోంది. దీని కోడ్నెమ్ హ్యుందాయ్ ఏఐ3 ఎస్యూవీ అని సమాచారం.
ఇండియా మార్కెట్లో కొత్త ఎస్‌యూవీని లాంచ్ చేయనున్న హ్యుందాయ్!
Hyundai Ai3 SUV launch in India : ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్) సెగ్మెంట్‌కు బీభత్సమైన డిమాండ్ కనిపిస్తోంది. చాలా మంది ఎస్యూవీలవైపు ఆకర్షితులవుతున్నాయి. ఇందుకు తగ్గట్టుగానే ఆటోమొబైల్ సంస్థలు కొత్త కొత్త ఎస్యూవీ మోడల్స్‌ను లాంచ్ చేస్తున్నాయి. ఇక ఇప్పుడు.. దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీ హ్యుందాయ్ కూడా ఓ కొత్త ఎస్‌యూవీని ఇండియాలో లాంచ్ చేయనున్నట్టు తెలుస్తోంది. దీని కోడ్నెమ్ హ్యుందాయ్ ఏఐ3! ఈ మోడల్ విశేషాలు ఇక్కడ తెలుసుకుందాము..
హ్యుందాయ్ ఏఐ3 ఎస్యూవీ..
Hyundai Ai3 SUV price details : నివేదికల ప్రకారం.. ఈ హ్యుందాయ్ ఏఐ3 ఎస్యూవీ ఈ ఏడాది ఆగస్టులో ఇండియాలో లాంచ్ అవుతుంది. అంతర్జాతీయంగా ఈ ఏడాది మొదట్లో లాంచ్ అయిన హ్యుందాయ్ కాస్పర్ను ఇది పోలి ఉంటుంది. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉండొచ్చు. మేన్యువల్, ఏఎంటీ ఆప్షన్స్ లంభించే అవకాశం ఉంది. సీఎన్జీ మోడల్ని కూడా లాంచ్ చేయాలని హ్యుందాయ్ భావిస్తోంది. ఈ ఎస్‌యూవీలో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ సైతం ఉండనుంది.
ఫీచర్స్, స్పెసిఫికేష్స్తో పోల్చుకుంటే.. ఈ ఏఐ3 ఎస్యూవీ.. హ్యుందాయ వెన్యూ కన్నా కాస్త తక్కువ ధరలో అందుబాటులో ఉండొచ్చని సమాచారం. ఇక లాంచ్ అనంతరం టాటా పంచ్‌కు ఈ మోడల్ గెట్టిపోటీనిస్తుందని తెలుస్తోంది. 2021 అక్టోబర్‌లో లాంచ్ అయిన పంచ్‌కు సంబంధించి ఇప్పటికీ నెలకు 10వేలకుపైగా యూనిట్లు అమ్ముడుపోతున్నాయి.
Hyundai Ai3 SUV price : ఇక లాంచ్ టైమ్ సమీపిస్తున్న కొద్ది.. ఈ ఎస్‌యూవీకి సంబంధించిన వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
హ్యుందాయ్ ఈవీకి వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్..
Worl car of the Year 2023 : ఆటోమొబైల్ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మక అవార్డుల్లో ఒకటి 'వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్' (డబ్ల్యూసీఓటీవై). ఇక 2023 వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డును హ్యుందాయ్ ఐయానిక్ 6 దక్కించుకుంది. వరల్డ్ ఎలక్ట్రిక్ వెహికిల్, కార్ డిజైన్ అవార్డులను సొంతం చేసుకుంది.
2023 వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ కోసం 2023 కియా నిరో, 2023 బీఎండబ్ల్యూ ఎక్స్1, 2024 హ్యుందాయ్ ఐయానిక్ 6 పోటీపడ్డాయి. చివరికి.. ఐయానిక్ 6 ఈవీ.. ఈ అవార్డును సొంతం చేసుకుంది. ఈ అవార్డులను ప్రపంచంలోని సీనియర్ జర్నలిస్ట్ ప్యానెల్ నిర్ణయిస్తుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.