తెలుగు న్యూస్ / ఫోటో /
SUV's waiting period : ఈ ఎస్‌యూవీలకు వెయిటింగ్ పీరియడ్ ఎక్కువే!
- SUV's waiting period : ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్‌యూవీలు రయ్‌రయ్‌మంటూ దూసుకుపోతున్నాయి. గత కొన్నేళ్లుగా ఎస్‌యూవీల విక్రయాలు భారీగా పెరుగుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఆటోమొబైల్ సంస్థలు కొత్త కొత్త ఎస్‌యూవీలను లాంచ్ చేస్తున్నాయి. కానీ డిమాండ్‌ను అందుకోలేకపోతున్నాయి. ఫలితంగా పలు మోడల్స్‌కు వెయిటింగ్ పీరియడ్ విపరీతంగా పెరిగిపోతోంది.

(1 / 6)
కియాకు బెస్ట్ సెల్లింగ్ మోడల్స్‌లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది సోనెట్. ఢిల్లీలో కియా సోనెట్‌కు 2 నెలలు, బెంగళూరులో 3 నెలలు, ముంబైలో 3-4 నెలల వెయిటింగ్ పీరియడ్ ఉంది. హైదరాబాద్‌లో 4 నెలల వరకు వెయిట్ చేయాల్సి వస్తోంది.
(2 / 6)
నిస్సాన్ మాగ్నైట్ మోడల్‌కి కూడా మంచి డిమాండే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో మాగ్నైట్‌కు 2 వారాల వెయిటింగ్ పీరియడే నడుస్తోంది. కానీ బెంగళూరులో 1.5 నెలలు, ముంబైలో 2-3 వారాల వరకు వెయిట్ చేయాల్సి వస్తోంది. ఇక హైదరాబాద్‌లో ఈ వెహికిల్‌కు 1 నెల వెయిటింగ్ పీరియడ్ ఉంది. (HT AUTO)
(3 / 6)
హ్యుందాయ్ వెన్యూకు ఢిల్లీలో 3 నెలల వెయిటింగ్ పీరియడ్ ఉంది. బెంగళూరులో 2-3 నెలలు, ముంబైలో 2 నెల వెయిటింగ్ పీరియడ్ నడుస్తోంది. హైదరాబాద్‌లో 1-1.5 నెలల వరకు వెయిట్ చేయాల్సి వస్తోంది. (HT AUTO)
(4 / 6)
మరో డిమాండ్ ఉన్న ఎస్యూవీ.. ఎక్స్‌యూవీ300కి ఢిల్లీలో ఏకంగా 3 నెలల వెయిటింగ్ పీరియడ్ ఉంది. బెంగళూరులో 2-3 నెలలు, ముంబైలో 3-4 నెలల పాటు వెయిటింగ్ పీరియడ్ నడుస్తోంది. హైదరాబాద్‌లో ఏకంగా 6 నెలల వరకు వెయిటింగ్ పీరియడం ఉండటం గమనార్హం. (HT AUTO)
(5 / 6)
మారుతీ బ్రెజాకు ఢిల్లీలో 2-3 నెలల వెయిటింగ్ పీరియడ్ నడుస్తోంది. బెంగళూరులో అది 2 నెలలుగాను, ముంబైలో 2-3 నెలలుగాను ఉంది. ఇక హైదరాబాద్‌లో కూడా 2.5 నుంచి 3 నెలల పాటు వెయిటింగ్ పీరియడ్ ఉంది. (HT AUTO)
ఇతర గ్యాలరీలు