Kia EV9 launch : 450కి.మీ రేంజ్​తో.. త్వరలో కియా ఈవీ9 లాంచ్​!-kia ev9 suv s global launch expected in this march see what all we know so far ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Kia Ev9 Suv's Global Launch Expected In This March, See What All We Know So Far

Kia EV9 launch : 450కి.మీ రేంజ్​తో.. త్వరలో కియా ఈవీ9 లాంచ్​!

Sharath Chitturi HT Telugu
Mar 06, 2023 06:25 AM IST

Kia EV9 launch in India : కియా నుంచి త్వరలోనే ఈవీ9 ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ అంతర్జాతీయ మార్కెట్​లో అడుగుపెట్టనుంది. ఆ వివరాలు ఓసారి తెలుసుకుందాము..

కియా ఈవీ9
కియా ఈవీ9 (Bloomberg)

Kia EV9 launch in India : ఎలక్ట్రిక్​ వాహనాల సెగ్మెంట్​లో మార్కెట్​ షేర్​ను పెంచుకునేందుకు కృషిచేస్తున్న కియా మోటార్స్​ నుంచి మరో ఈవీ త్వరలోనే రానుంది! కియా ఈవీ9 ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ.. ఈ మార్చ్​లోనే అంతర్జాతీయ మార్కెట్​లో లాంచ్​ అవుతుందని తెలుస్తోంది. ఈ మోడల్​ను జనవరిలో జరిగిన ఆటో ఎక్స్​పో 2023లో ప్రదర్శించింది కియా మోటార్స్​. ఈ నేపథ్యంలో ఈ ఎలక్ట్రిక్​ వెహికిల్​పై ఇప్పటి వరకు ఉన్న వివరాలను ఓసారి చూద్దాం..

ట్రెండింగ్ వార్తలు

కియా ఈవీ9.. అద్భుతహా..!

కియా మోటార్స్​ ప్రకారం.. ఈ కారును అభివృద్ధి చేసేందుకు 44 నెలలు పట్టింది. దీనిని ఈ- జీఎంపీ ప్లాట్​ఫామ్​పై రూపొందించారు. 2021 లాస్​ ఏంజెల్స్​ మోటార్​ షోలో తొలిసారిగా ఈ ఈవీని ప్రదర్శించారు. అప్పటి నుంచి ఈ మోడల్​పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈవీ6 క్రాసోవర్​ ఎస్​యూవీని ఇటీవలే లాంచ్​ చేసింది కియా మోటార్స్​. ఇక ఈ ఈవీ9తో ఎలక్ట్రిక్​ వెహికిల్​ పోర్ట్​ఫోలియోను మరింత బలపపడుతుందని ఆశిస్తోంది.

Kia EV9 India launch news : కియా ఈవీ9లో మస్క్యులర్​ క్లామ్​షెల్​ బానెట్​, టైగర్​ నోస్​ గ్రిల్​, ఆల్​- ఎల్​ఈడీ లైటింగ్​ సెటప్​, వైడ్​ ఎయిర్​ డ్యామ్​, ఓఆర్​వీఎంల స్థానంలో కెమెరాలు, ఫ్లేర్డ్​ వీల్​ ఆర్చీస్​, డిజైనర్​ వీల్స్​, సిల్వర్డ్​ స్కిడ్​ ప్లేట్స్​ వంటివి వచ్చే అవకాశం ఉంది. వర్టికల్లీ- స్టేక్​డ్​ టెయిల్​ల్యాంప్స్​, రూఫ్​ మౌంటెడ్​ స్పాయిలర్​ వంటివి రేర్​లో రావొచ్చు.

ఇక కియా ఈవీ9 కేబిన్​లో డాష్​బోర్డ్​ డిజైన్​ అత్యంత ఆకర్షణీయంగా ఉంటుందని అంచనాలు ఉన్నాయి. యోక్​ స్టైల్​ స్టీరింగ్​ వీల్​, పానారోమిక్​ గ్లాస్​ రూఫ్​, మల్టీ- కలర్​ యాంబియెంట్​ లైటింగ్​, మల్టీ- జోన్​ క్లైమేట్​ కంట్రోల్​, 2 పెద్ద స్క్రీన్స్​ ఉండనున్నాయి. ప్యాసింజర్​ సేఫ్టీ కోసం 6 ఎయిర్​బ్యాగ్స్​, ఏడీఏఎస్​ సెటప్​ ఉండొచ్చు.

450కి.మీ రేంజ్​తో కియా ఈవీ9..!

Kia EV9 features : కియా ఈవీ9 ఎలక్ట్రిక్​ ఎస్​యూవీలో ఉపయోగిస్తున్న మోటార్​ గురించి సంస్థ ఇంకా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. కాగా.. ఇందులో 800వీ ఎలక్ట్రిక్​ మోటార్​ ఉండొచ్చని తెలుస్తోంది. దీనిని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. 450కి.మీల దూరం ప్రయాణిస్తుందని సమాచారం.

Kia EV9 latest updates : అంతర్జాతీయ మర్కెట్​లో ఈ కియా ఈవీ9 ఈ నెలలో లాంచ్​కానుండగా.. ఇండియాలో 2024-2025 మధ్యలో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మోడల్​ ధరకు సంబంధించిన వివరాలపై రానున్న కాలంలో స్పష్టత వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

WhatsApp channel

సంబంధిత కథనం