Mahindra & Mahindra SUV's : రికార్డు స్థాయి ఎస్‌యూవీలను విక్రయించిన ఎం అండ్ ఎం!
03 April 2023, 13:41 IST
- Mahindra & Mahindra SUV sales : ఎస్యూవీ సేల్స్ విషయంలో ఎం అండ్ ఎం దూసుకెళుతోంది. సంస్థ చరిత్రలోనే తొలిసారిగా.. గతనెలలో భారీ మొత్తంలో ఎస్‌యూవీలను విక్రయించింది.
రికార్డు స్థాయి ఎస్‌యూవీలను విక్రయించిన ఎం అండ్ ఎం!
Mahindra & Mahindra SUV sales : 2023 ఆర్థిక ఏడాదిలో చివరి నెలైన మార్చ్‌లో 35,976 ఎస్‌యూవీలను విక్రయించినట్టు దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా ప్రకటించింది. ఫలితంగా 31శాతం వృద్ధి సాధించినట్టు పేర్కొంది. సంస్థ చరిత్రలో ఇదే అత్యధికం అని స్పష్టం చేసింది. మొత్తం మీద మార్చ్ నెలలో 66,091 యూనిట్లను సేల్ చేసినట్టు పేర్కొంది. ఈ విషయంలో ఎన్నడూ లేనంతగా, 21శాతం వృద్ధిని నమోదుచేసినట్టు వెల్లడించింది.
ఎస్‌యూవీలకు విపరీతమైన డిమాండ్..!
2020లో అప్డేటెడ్ థార్‌ను లాంచ్ చేసినప్పటి నుంచి మహీంద్రా అండ్ మహీంద్రా దశ తిరిగిపోయింది! ఎక్స్‌యూవీ700, బోలేరో నియో, స్కార్పియో- ఎన్ వంటి మోడల్స్‌తో కస్టమర్లను విపరీతంగా ఆకర్షిస్తోంది ఈ సంస్థ. "ఎస్యూవీ అంటే.. ఎం అండ్ ఎం సంస్థే" అన్నంత రేంజ్లో గుర్తింపు తెచ్చుకుంది.
ఎం అండ్ ఎం ఎస్‌యూవీలకు విపరీతమైన డిమాండ్ లభిస్తుండటంతో వెయిటింగ్ పీరియడ్ కూడా అధికంగానే ఉంటోంది. కొన్ని మోడల్స్‌కు ఏకంగా 18నెలల వెయిటింగ్ పీరియడ్ నడుస్తోంది. డిమాండ్‌ను అందుకునేందుకు ప్రొడక్షన్ కెపాసిటీతో పాటు సిబ్బంది షిఫ్ట్‌లను కూడా పెంచింది సంస్థ.
M&M march sales data : గత నెలలో 2,115 వాహనాలను ఎగుమతి చేసిన ఎం అండ్ ఎం.. దేశీయ మార్కెట్లో 5,697 3 వీలర్స్‌ను విక్రయించింది.
అన్ని మోడల్స్‌కు మంచి డిమాండ్ లభిస్తుండటంపై మహీంద్రా అండ్ మహీంద్రా హర్షం వ్యక్తం చేసింది.
"పోర్ట్‌ఫోలియోలోని అన్ని మోడల్స్‌కు మంచి డిమాండ్ దక్కుతుండటం సంతోషకర విషయం. 2023 మార్చ్‌లో 31శాతం వృద్ధితో మా ఎస్యూవీ బిజినెస్ పెరిగింది. ఇది ఆల్‌టైమ్ హై. ఎఫ్వై23లో మా ఓవరాల్ గ్రోత్ 60శాతంగా నమోదైంది," అని ఎం అండ్ ఎం ఆటోమొబైల్ డివిజన్ ప్రెసిడెంట్ వీజయ్ నాక్రా తెలిపారు.
ఇక ఈవీలపై ఫోకస్..!
M&M SUV sales : ఎస్‌యూవీలపై ఇంతకాలం ఫోకస్ చేసిన ఎం అండ్ ఎం.. ఇప్పుడు ఈవీలపైనా దృష్టిసారించింది. దేశ ఈవీ సెగ్మెంట్లో రారాజుగా కొనసాగుతున్న టాటా మోటార్స్‌కు ధీటుగా నిలిచేందుకు గట్టి పోర్ట్‌ఫోలియోను సిద్ధం చేసుకుంటోంది. ఇందులో భాగంగా.. మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఇటీవలే మార్కెట్లోకి వచ్చింది. భారీ అంచనాల మధ్య లాంచ్ అయిన ఈ మోడల్‌కి మార్కెట్లో అదిరిపోయే డిమాండ్ లభిస్తుండటం విశేషం. ఎక్స్‌యూవీ400కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.