Mahindra XUV400 exclusive edition : ఈ ఎక్స్​యూవీ400 ధర రూ. 1.75కోట్లు..!-mahindra xuv400 exclusive edition costs 1 crore 75 lakhs see full details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Mahindra Xuv400 Exclusive Edition Costs 1 Crore 75 Lakhs See Full Details Here

Mahindra XUV400 exclusive edition : ఈ ఎక్స్​యూవీ400 ధర రూ. 1.75కోట్లు..!

Sharath Chitturi HT Telugu
Feb 13, 2023 01:41 PM IST

Mahindra XUV400 exclusive edition : మహీంద్రా ఎక్స్​యూవీ400 ఎక్స్​క్లూజివ్​ ఎడిషన్​ ఇటీవలే ఆక్షన్​లోకి వెళ్లింది. హైదరాబాద్​కు చెందిన ఓ వ్యక్తి.. ఈ స్పెషల్​ ఎడిషన్​ను రూ. 1.75కోట్లకు కొనుగోలు చేశారు.

ఈ ఎక్స్​యూవీ400 ధర రూ. 1.75కోట్లు..!
ఈ ఎక్స్​యూవీ400 ధర రూ. 1.75కోట్లు..! (Representative image)

Mahindra XUV400 exclusive edition : ఎక్స్​యూవీ400 ఎలక్ట్రిక్​ ఎస్​యూవీకి చెందిన అల్ట్రా ఎక్స్​క్లూజివ్​ ఎడిషన్​ను ఇటీవలే ఆక్షన్​కు పెట్టింది దేశీయ దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ మహీంద్రా అండ్​ మహీంద్రా. ఆక్షన్​లో.. ఈ ఈవీ​ ఏకంగా రూ. 1.75కోట్లకు అమ్ముడుపోవడం విశేషం! హైదరాబాద్​కు చెందిన కరుణాకర్​ కుందావరమ్​.. ఈ మహీంద్రా ఎక్స్​యూవీ400 ఎక్స్​క్లూజివ్​ ఎడిషన్​ను సొంతం చేసుకున్నారు. మహీంద్రా గ్రూప్​ ఛైర్మన్​ ఆనంద్​ మహీంద్రా.. కరుణాకర్​కు వెహికిల్​ కీ అందించారు. ఎక్స్​క్లూజివ్​ ఎడిషన్​ విక్రయించడంతో వచ్చిన నిధులను సామాజిక సేవ కోసం వినియోగించనున్నట్టు సంస్థ పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు

సాధారణ మహీంద్రా ఎక్స్​యూవీ400 ఈవీతో పోల్చుకుంటే.. ఈ ఎక్స్​క్లూజివ్​ ఎడిషన్​లో కొన్ని ప్రత్యేకమైన మార్పులు జరిగాయి. ఈ ఎడిషన్​ను ప్రముఖ ఫ్యాషన్​ డిజైనర్​ రమీజ్​ దాదుతో కలిసి.. మహీంద్రా చీఫ్​ డిజైన్​ ఆఫీసర్​ ప్రతాప్​ బోస్​ డిజైన్​ చేశారు. ఫలితంగా.. వెహికిల్​లో 'రమీజ్​ దాదు X బోస్​' అనే బ్యాడ్జ్​ వస్తుంది. ఇందులో ఆర్కిటిక్​ బ్లూ థీమ్​ ఉంటుంది. బ్లూ ఔట్​లైన్​తో కూడిన కాపర్​ ఫినీష్డ్​ ట్విన్​- పీక్స్​ లోగో ఈ ఎస్​యూవీకి వచ్చింది. అయితే.. డైమెన్షన్స్​ పరంగా.. స్టాండర్డ్​ ఎక్స్​యూవీ400కు.. ఈ ఎక్స్​క్లూజివ్​ ఎడిషన్​కు ఎలాంటి మార్పులు లేవు.

మహీంద్రా ఎక్స్​యూవీ400 బుకింగ్స్​ జోరు..

Mahindra XUV400 exclusive edition price : ఇక మహీంద్రా ఎక్స్​యూవీ400 ఈవీ రెండు వేరియంట్​లలో లభిస్తోంది. ఎక్స్​యూవీ400 ఈఎల్​లో 39.4కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ఉంటుంది. ఇక ఎక్స్​యూవీ400 ఈసీలో 34.5కేడబ్ల్యూహచ్​ బ్యాటరీ ఉంటుంది. ఆర్కిటిక్​ బ్లూ, ఎవరెస్ట్​ వైట్​, గ్యాలెక్సీ గ్రే, నపోలీ బ్లాక్​, ఇన్ఫినిటీ బ్లూ, సాటిన్​ కాపర్​ డ్యూయెల్​ టోన్​ రంగుల్లో ఈ వేరియంట్స్​ లభిస్తున్నాయి.

Mahindra XUV 400 vs Tata Nexon EV: ఈ ఎలక్ట్రిక్ కార్ల రేంజ్, ధర, స్పెసిఫికేషన్లు.. ఏది బెస్ట్‌? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఎక్స్​యూవీ400 ఈవీ బుకింగ్స్​ పరంగా దూసుకెళుతోంది. ఈ ఏడాది జనవరి 26న ఎక్స్​యూవీ400 బుకింగ్స్​ ప్రారంభం కాగా.. కేవలం నాలుగు రోజుల్లోనే 10వేల బుకింగ్స్​ వచ్చాయి. ఆ తర్వాతి రెండు వారాలాకు.. టోటల్​ బుకింగ్స్​ సంఖ్య 15వేలు దాటింది. ఫలితంగా ఈ ఈవీ హిట్​ అని మార్కెట్​ వర్గాలు చెబుతున్నాయి.

Mahindra XUV400 on road price in Hyderabad : ఇక మహీంద్రా ఎక్స్​యూవీ400 ఎక్స్​షోరూం ధర రూ. 16.99లక్షలు- రూ. 18.99లక్షల మధ్యలో ఉంది. అంటే.. సాధారణ మోడల్​ ప్రారంభ ధర కన్నా.. ఎక్స్​యూవీ400 ఎక్స్​క్లూజివ్​ ఎడిషన్ దాదాపు​ రూ. 1.58కోట్లు ఎక్కువ ధరకు అమ్ముడుపోయింది.

Mahindra XUV400 EV : లాంచ్​ అయిన తర్వాత.. మహీంద్రా ఎక్స్​యూవీ400.. టాటా నెక్సాన్​కు గట్టిపోటీనిస్తుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి.

WhatsApp channel

సంబంధిత కథనం