Mahindra XUV 400 vs Tata Nexon EV: ఈ ఎలక్ట్రిక్ కార్ల రేంజ్, ధర, స్పెసిఫికేషన్లు.. ఏది బెస్ట్‌?-mahindra xuv 400 ev vs tata nexon ev know these electric cars range specs price comparison details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Mahindra Xuv 400 Vs Tata Nexon Ev: ఈ ఎలక్ట్రిక్ కార్ల రేంజ్, ధర, స్పెసిఫికేషన్లు.. ఏది బెస్ట్‌?

Mahindra XUV 400 vs Tata Nexon EV: ఈ ఎలక్ట్రిక్ కార్ల రేంజ్, ధర, స్పెసిఫికేషన్లు.. ఏది బెస్ట్‌?

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 17, 2023 12:59 PM IST

Mahindra XUV 400 EV vs Tata Nexon EV: టాటా నెక్సాన్ ఈవీకి పోటీని ఇచ్చేలా మహీంద్రా ఎక్స్‌యూవీ 400 ఈవీ భారత్‍లో లాంచ్ అయింది. ఈ రెండు ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీ, రేంజ్, ధరతో పాటు మరిన్ని అంశాలను పోల్చి చూస్తే…

Mahindra XUV 400 vs Tata Nexon EV: ఈ ఎలక్ట్రిక్ కార్ల రేంజ్, ధర, స్పెసిఫికేషన్లు.. ఏది బెస్ట్‌?
Mahindra XUV 400 vs Tata Nexon EV: ఈ ఎలక్ట్రిక్ కార్ల రేంజ్, ధర, స్పెసిఫికేషన్లు.. ఏది బెస్ట్‌? (HT Auto)

Mahindra XUV 400 EV vs Tata Nexon EV: తన తొలి ఆల్ ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ.. ఎక్స్‌యూవీ 400 (XUV 400)ను మహీంద్రా తాజాగా భారత మార్కెట్‍లో లాంచ్ చేసింది. టాటా నెక్సాన్ ఈవీ ఎలక్ట్రిక్ కారుకు ఇది పోటీగా కనిపిస్తోంది. నెక్సాన్ ఈవీ ఇండియాలో బాగా పాపులర్ అయింది. ఇప్పటికే ఈ మోడల్‍కు చెందిన 35,000 యూనిట్లను టాటా మోటార్స్ విక్రయించింది. ఈ తరుణంలో మహీంద్రా ఎక్స్‌యూవీ 400 ఎలక్ట్రిక్ కారు దానికి దీటుగా కనిపిస్తోంది. ఎక్స్‌యూవీ 300 పోలికలతో ఎక్స్‌యూవీ 400 ఈవీ అడుగుపెట్టింది. మహీంద్రా ఎక్స్‌యూవీ 400, టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కార్లను పోల్చి చూస్తే ఎలా ఉన్నాయంటే..

Mahindra XUV 400 EV vs Tata Nexon EV: బ్యాటరీ, రేంజ్

మహీంద్రా ఎక్స్‌యూవీ 400 రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‍లతో వస్తోంది. 34.5 కిలో వాట్ హవర్ (kWh) బ్యాటరీ ఉన్న మోడల్ ఒక్కసారి ఫుల్ చార్జ్‌పై 375 కిలోమీటర్ల వరకు ప్రయాణించేలా రేంజ్ ఇస్తుంది. 39.3 kWh బ్యాటరీ ఉన్న వేరియంట్ 456 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది. ఇక టాటా నెక్సాన్ ఈవీలో 30.2 kWh బ్యాటరీ ఉంటుంది. ఇది 312 కిలోమీటర్ల రేంజ్‍ను ఇస్తుంది. నెక్సాన్‍లో ఎక్కువ రేంజ్ ఇచ్చే ఈవీ మ్యాక్స్ కూడా అందుబాటులో ఉంది. ఇది 437 కిలోమీటర్ల రేంజ్‍ను కలిగి ఉంది.

Mahindra XUV 400 EV vs Tata Nexon EV: పర్ఫార్మెన్స్

మహీంద్రా ఎక్స్‌యూవీ 400 ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ మోటార్ 150 hp గరిష్ఠ పవర్, 310 Nm పీక్ టార్క్యూను ఉత్పత్తి చేస్తుంది. టాటా నెక్సాన్ ఈవీ ఎలక్ట్రిక్ కారు మోటార్ 127 bhp గరిష్ఠ పవర్‌ను, 245 Nm పీక్ టార్క్యూను జనరేట్ చేస్తుంది.

Mahindra XUV 400 EV vs Tata Nexon EV: సైజ్

మహీంద్రా ఎక్స్‌యూవీ 400 కంటే నెక్సాన్ ఈవీ కాస్త పొడవుగా ఉంటుంది. వెడల్పు, వీల్ బేస్ కూడా ఎక్కువే. ఎక్స్‌యూవీ 400 దాదాపు ఎక్స్‌యూవీ 300ను పోలి ఉంటుంది.

Mahindra XUV 400 EV vs Tata Nexon EV: ధరలు

మహీంద్రా ఎక్స్‌యూవీ 400 ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ రెండు వేరియంట్లలో లాంచ్ కాగా.. వీటి ధర రూ.15.99 నుంచి రూ.18.99లక్షల మధ్య ఉంది. రూ.16.49 లక్షలతో ఓ మిడ్ వేరియంట్ కూడా అడుగుపెట్టింది. ఎక్స్‌యూవీ 400తో పోలిస్తే టాటా నెక్సాన్ ఈవీలో ఎక్కువ వేరియంట్లు లభిస్తున్నాయి. నెక్సాన్ ఈవీ ధరలు రూ.14.99 లక్షల నుంచి రూ.17.50లక్షల మధ్య ఉన్నాయి. ఇవన్నీ సబ్సిడీ లేని ఎక్స్-షోరూమ్ ధరలు.

ఈ అంశాలను బట్టి చూస్తే మహీంద్రా ఎక్స్‌యూవీ 400 ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ, నెక్సాన్ ఈవీ దాదాపు ఒకే రకమైన స్పెసిఫికేషన్లను కలిగి ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే నెక్సాన్ ఈవీ విజయవంతం కాగా, మహీంద్రా ఎక్స్‌యూవీ 400 ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ తాజాగా అడుగుపెట్టింది.

Whats_app_banner

సంబంధిత కథనం