Mahindra XUV 400 Electric SUV: మహీంద్రా ఎక్స్‌యూవీ 400 ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ వచ్చేసింది: ధర, ఫీచర్ల వివరాలివే..
Mahindra XUV 400 Electric SUV launched: మహీంద్రా ఎక్స్‌యూవీ 400 ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ భారత మార్కెట్‍లో విడుదలైంది. ఈనెల 26న బుకింగ్స్ మొదలుకానున్నాయి. ఈ ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ ధర, ఫీచర్లు లాంటి వివరాలు ఇవే.
Mahindra XUV 400 Electric SUV launched: అందరూ ఎంతగానో ఎదురుచూసిన మహీంద్రా ఎక్స్‌యూవీ 400 ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ ఇండియాలో లాంచ్ అయింది. మహీంద్రా&మహీంద్రా (Mahindra & Mahindra) సంస్థ నుంచి వచ్చిన తొలి ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ ఇది. రెండు వేరియంట్లలో సోమవారం (జనవరి 16) భారత మార్కెట్‍లో మహీంద్రా ఎక్స్‌యూవీ 400 ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ అడుగుపెట్టింది. ఈనెల 26వ తేదీన ఈ నయా కారు బుకింగ్స్ మొదలుకానున్నాయి. ఈ ఏడాదిలో ఎక్స్‌యూవీ 400 ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ 20వేల యూనిట్లను విక్రయించాలని మహీంద్రా& మహీంద్రా సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. Mahindra XUV 400 Electric SUV ధర, ఫీచర్ల వివరాలు ఇక్కడ చూడండి.
రెండు వేరియంట్లు
Mahindra XUV 400 Electric SUV: మహీంద్రా ఎక్స్‌యూవీ 400 ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. ఈసీ (EC), ఈఎల్ (EL) వేరియంట్లు అందుబాటులోకి రానున్నాయి. ఆర్కిటిక్ బ్లూ, ఎవరెస్ట్ వైట్, గెలాక్సీ గ్రే, నెపోలీ బ్లాక్, ఇన్ఫినిటీ బ్లూ కలర్ ఆప్షన్‍లలో లభిస్తాయి. సాటిన్ కాపర్ రూఫ్‍తో కూడిన డ్యుయల్ టోన్ పెయింటింగ్ కలర్ ఆప్షన్ కూడా వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది.
బ్యాటరీ, రేంజ్
Mahindra XUV 400 Electric SUV: మహీంద్రా ఎక్స్‌యూవీ 400 ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ.. EC వేరియంట్ కారులో 34.5 కిలో వాట్ హవర్ (kWh) బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీన్ని ఒక్కసారి చార్జ్ చేస్తే కారులో 375 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఇక EL వేరియంట్‍లో 39.4 kWh బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 456 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలిగేలా రేంజ్‍ను ఈ వేరియంట్ కలిగి ఉంది.
Mahindra XUV 400 Electric SUV: పర్ఫార్మెన్స్
0 నుంచి 100 kmph (గంటకు కిలోమీటర్లు) వేగానికి మహీంద్రా ఎక్స్‌యూవీ 400 ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ 8.3 సెకన్లలోనే యాక్సలరేట్ అవుతుంది. రెండు వేరియంట్ల ఎలక్ట్రిక్ మోటార్లు 110 kW పవర్‌ను, 310 Nm టార్క్యూను జనరేట్ చేస్తాయి.
ఫీచర్లు, మరిన్ని వివరాలు
Mahindra XUV 400 Electric SUV: అన్ని వీల్స్‌కు డిస్క్ బ్రేక్‍లు, స్టీల్ వీల్స్, హాలోజెన్ హెడ్‍ల్యాంప్‍లు, సింగిల్ పెడల్ డ్రైవింగ్, కనెక్టెడ్ కార్ టెక్, మాన్యువల్ ఏసీ, ఫాబ్రిక్ సీట్లతో ఎక్స్‌యూవీ 400 ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ వస్తోంది. ఆరు ఎయిర్ బ్యాగ్స్, అలాయ్ వీల్స్, రేర్ కెమెరా, 7.0 ఇంచుల టచ్ స్క్రీన్, కీలెస్ ఇంట్రీ, గో, ప్రొజెక్టర్ హెడ్‍ల్యాంప్స్, రేర్ వైపర్, వాషర్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్‍ను ఈ ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ కలిగి ఉంది.
ధర, బుకింగ్
Mahindra XUV 400 Electric SUV: మహీంద్రా ఎక్స్‌యూవీ 400 ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ ఈసీ వేరియంట్ (3.3Kw) ధర రూ.15.99లక్షలుగా ఉంది. ఈ వేరియంట్‍లోనే 7.2 kW మోడల్ ధర రూ.16.49లక్షలు. ఇక ఈఎల్ వేరియంట్ ధర రూ.18.99లక్షలుగా ఉంది. ఇవి ఇంట్రడక్టరీ ఎక్స్ షో-రూమ్ ధరలుగా ఉన్నాయి. మొదట బుక్ చేసుకునే 5వేల మంది కస్టమర్లకు ఈ ధరలు వర్తించనున్నాయి. ఈ నెల 26వ తేదీన Mahindra XUV 400 Electric SUV బుకింగ్స్ మొదలవుతాయి. మార్చిలో ఈఎల్ వేరియంట్ కార్ల డెలివరీలు ప్రారంభమవుతాయి. ఎక్స్‌యూవీ 400 ఈఎల్ వేరియంట్ డెలివరీలు ఈ ఏడాది రెండో అర్ధభాగంలో మొదలయ్యే అవకాశం ఉంది.
సంబంధిత కథనం