World Car Of The Year : 'వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్' అవార్డ్ దక్కించుకున్న హ్యుందాయ్ ఈవీ ఇదే!
World Car Of The Year 2023 : హ్యుందాయ్ ఐయానిక్ 6 ఈవీకి వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ దక్కింది. ఆ వివరాలు..

World Car Of The Year 2023 : ఆటోమొబైల్ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మక అవార్డుల్లో ఒకటి 'వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్' (డబ్ల్యూసీఓటీవై). ఇక 2023 వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డును హ్యుందాయ్ ఐయానిక్ 6 దక్కించుకుంది. వరల్డ్ ఎలక్ట్రిక్ వెహికిల్, కార్ డిజైన్ అవార్డులను సొంతం చేసుకుంది.
2023 వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ కోసం 2023 కియా నిరో, 2023 బీఎండబ్ల్యూ ఎక్స్1, 2024 హ్యుందాయ్ ఐయానిక్ 6 పోటీపడ్డాయి. చివరికి.. ఐయానిక్ 6 ఈవీ.. ఈ అవార్డును సొంతం చేసుకుంది. ఈ అవార్డులను ప్రపంచంలోని సీనియర్ జర్నలిస్ట్ ప్యానెల్ నిర్ణయిస్తుంది.
హ్యుందాయ్ ఐయానిక్ 6 ఈవీ..
Hyundai Ioniq 6 EV : ఈ ఈవీలో మస్క్యులర్ హుడ్, క్లోజ్డ్- ఆఫ్ స్లీక్ బ్లాక్ గ్రిల్, వైడ్ ఎయిర్ డ్యామ్, స్వెప్ట్ బ్యాంక్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్, స్లోపింగ్ రూఫ్‌లైన్, బ్లాక్డ్ ఔట్ పిల్లర్స్, ఆర్చ్డ్ బెల్ట్‌లైన్, ఓఆర్వీఎంల స్థానంలో కెమెరాలు, డిజైనర్ ఆలాయ్ వీల్స్ వంటివి ఉన్నాయి. ఈ సెడాన్ మోడల్ రేర్‌లో కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్‌లైట్స్, షార్క్ ఫిన్ యాంటీనా వంటివి లభిస్తున్నాయి.
హ్యుందయ్ ఐయానిక్ 6 ఈవీ 5 సీటర్ కేబిన్ స్పేషియస్గా ఉంటుంది. రిలాక్సేషన్ కంఫర్ట్ ఫ్రెంట్ సీట్స్ ఆప్షనల్‌గా లభిస్తున్నాయి. మల్టీ జోన్ క్లైమేట్ కంట్రోల్, 64 కలర్ యాంబియెంట్ లైటింగ్, హెడ్- అప్ డిస్ప్లే, మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్ వంటివి ఈ ఈవిలో చూడొచ్చు. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్మెంట్ ప్యానెల్ కోసం 12.3 ఇంచ్ డ్యూయెల్ స్క్రీన్స్ వస్తున్నాయి. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే కూడా ఉన్నాయి.
World Car Of The Year Ioniq 6 EV : ఇక సేఫ్టీ విషయానికొస్తే.. ఈ హ్యుందాయ్ ఐయానిక్ 6 ఈవీలో ఏడీఏఎస్ ఫంక్షన్స్‌తో పాటు 7 ఎయిర్‌బ్యాగ్స్ లభిస్తున్నాయి.
హ్యుందయ్ ఐయానిక్ 6 ఈవీ- ఇంజిన్..
ఈ ఎలక్ట్రిక్ వెహికిల్‌లో సింగిల్ మోటార్ ఇంజిన్ ఉంటుంది. ఆప్షనల్ డ్యూయెల్ మోటార్ సెటప్ కూడా ఉంది. కాగా.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. ఈ ఈవీ 610 కి.మీల దూరం ప్రయాణిస్తుందని తెలుస్తోంది.
Hyundai Ioniq 6 EV price : ఐయానిక్ 6 ధరకు సంబంధించిన వివరాలను హ్యుందాయ్ మోటార్స్ ఇంకా వెల్లడించలేదు. అయితే.. అమెరికాలో దీని ధర సుమారు 40వేల డాలర్లు ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. అంటే ఇండియన్ కరెన్సీలో అది దాదాపు రూ. 32.76లక్షలు.
సంబంధిత కథనం