తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Jiotag Go: భారత్ లో తొలి డివైజ్ ట్రాకర్ ‘జియోట్యాగ్ గో’ ను లాంచ్ చేసిన రిలయన్స్ జియో

JioTag Go: భారత్ లో తొలి డివైజ్ ట్రాకర్ ‘జియోట్యాగ్ గో’ ను లాంచ్ చేసిన రిలయన్స్ జియో

Sudarshan V HT Telugu

Published Dec 18, 2024 07:58 PM IST

google News
  • JioTag Go: డివైజ్ ట్రాకర్ ‘జియోట్యాగ్ గో’ ను బుధవారం రిలయన్స్ జియో లాంచ్ చేసింది. ఇది భారత్ లోనే మొట్టమొదటి డివైజ్ ట్రాకర్. ఇది గూగుల్ ఫైండ్ మై డివైజ్ యాప్ తో కలిసి పని చేస్తుంది.

జియోట్యాగ్ గో

జియోట్యాగ్ గో

JioTag Go: గూగుల్ యొక్క ఫైండ్ మై డివైస్ నెట్‌వర్క్‌లో భాగంగా భారతదేశపు మొట్ట మొదటి డివైజ్ ట్రాకర్ ‘జియోట్యాగ్ గో’ ను రిలయన్స్ (reliance) జియో లాంచ్ చేసింది. ఇది గూగుల్ (Google) ఫైండ్ మై డివైజ్ నెట్‌వర్క్‌తో కలిసి పని చేయడానికి రూపొందించిన భారతదేశపు మొట్టమొదటి ట్రాకర్. ఇది నాణెం-పరిమాణంలో ఉండే అందమైన ట్రాకర్. ఇది గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store) లో అందుబాటులో ఉన్న గూగుల్ పైండ్ మై డివైజ్ (Google Find My Device) యాప్‌తో సులభంగా కనెక్ట్ అవుతుంది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా వారి డివైజెస్ ను ట్రాక్ చేయగలదు. రియల్ టైమ్ లో ఆ డివైజెస్ ఎక్కడ ఉన్నాయో స్పష్టంగా తెలియజేయగలదు.

ధర ఎంతంటే..?

ఈ ‘జియో ట్యాగ్ గో’ ను కీలు, వాలెట్‌లు, పర్సులు, లగేజ్, గాడ్జెట్‌లు, బైక్‌లు తదితర వస్తువులకు అటాచ్ చేయవచ్చు. ఈ ‘జియో ట్యాగ్ గో’ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండింటిలోనూ లభిస్తుంది. వివిధ రంగులలో ఇది అందుబాటులో ఉంది. ఈ ‘జియో ట్యాగ్ గో’ను అమెజాన్ (Amazon), జియో మార్ట్ (JioMart). రిలయన్స్ డిజిటల్, మై జియో (My Jio) స్టోర్లలో అందుబాటులో ఉంది. దీని ధర కేవలం రూ. 1499గా నిర్ణయించారు.

గతంలో ఐఓఎస్ కోసం..

జియో గతంలో ఐఓఎస్ కోసం జియో ట్యాగ్ ఎయిర్‌ను ప్రారంభించింది. ఇదిర ఆపిల్ ఫైండ్ మై నెట్ వర్క్ తో అనుసంధానమై ఉంటుంది. ఇప్పుడు ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం జియోట్యాగ్ గో ని జియో తీసుకువచ్చింది. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులందరికీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పనిచేసే ట్రాకర్ అందుబాటులోకి జియో (Jio) తీసుకువచ్చింది.

తదుపరి వ్యాసం