తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Reliance Industries Q3 Results: ‘రిలయన్స్’ ఆదాయంలో 14.8 శాతం వృద్ధి

Reliance Industries Q3 results: ‘రిలయన్స్’ ఆదాయంలో 14.8 శాతం వృద్ధి

HT Telugu Desk HT Telugu

20 January 2023, 22:31 IST

  • ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం ఫలితాలను రిలయన్స్ గ్రూప్ శుక్రవారం విడుదల చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (Reliance Industries RIL) ఈ Q3 లో మంచి ఫలితాలను సాధించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (Reliance Industries RIL) ఈ Q3 లో స్థూల ఆదాయంలో 14.8% వృద్ధి సాధించింది. మొత్తంగా ఈ Q3 లో RIL స్థూల ఆదాయం రూ. 2,40,863 కోట్లు. ఆయిల్, కన్స్యూమర్ బిజినెస్ లలో వృద్ధి కారణంగా ఈ మెరుగైన ఫలితాలు సాధ్యమయ్యాయి.

ట్రెండింగ్ వార్తలు

Bajaj Pulsar NS400Z: 2024 పల్సర్ ఎన్ఎస్400జెడ్ ను లాంచ్ చేసిన బజాజ్; ధర కూడా తక్కువే..

‘‘ఆపిల్ వాచ్ 7 నా ప్రాణాలను కాపాడింది’’: ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ కు థాంక్స్ చెప్పిన ఢిల్లీ యువతి

Stock market: ర్యాలీకి బ్రేక్; స్టాక్ మార్కెట్ క్రాష్; రూ. 2.3 లక్షల కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లు

Cibil score : జీవితంలో ఎప్పుడూ లోన్​ తీసుకోకపోయినా.. సిబిల్​ స్కోర్​పై ఎఫెక్ట్​ పడుతుందా?

గత ఆర్థిక సంవత్సరం Q3 తో పోలిస్తే, ఈ Q3 లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (Reliance Industries RIL) డిజిటల్ సర్వీసెస్ లో 20.4%, రిటైల్ సెగ్మెంట్ లో 17.2% వృద్ధి ని సాధించింది. ఇంధన ధరల్లో భారీ పెరుగుదల సంస్థ మెరుగైన లాభాలను సాధించడానికి దోహదపడింది.

ఈ Q3 లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (Reliance Industries RIL) వడ్డీలు, పన్నులు, డిప్రీసియేషన్, అమార్టైజేషన్ కన్నా ముందు ఆదాయం రూ. 38,460 కోట్లు గా ఉంది. ఇది గత ఆర్థిక సంవత్సరం Q3 తో పోలిస్తే 13.4% అధికం. డిజిటల్ సర్వీసెస్ విభాగంలో యావరేజ్ రెవెన్య పర్ యూజర్ (average revenue per user ARPU)లో 17.5% వృద్ధి సాధ్యమైంది.

పన్ను అనంతరం లాభాల్లో (profit after tax) RIL స్వల్ప వృద్ధినే కనబర్చింది. గత సంవత్సరం Q3 తో పోలిస్తే, ఈ Q3 లో 0.6% వృద్ధితో రూ. 17,806 కోట్ల పన్ను అనంతర లాభాల (profit after tax)ను సముపార్జించింది. అదే సమయంలో క్యాపిటల్ ఎక్స్ పెండేచర్ రూ. 37,599 కోట్లుగా ఉంది.

డిసెంబర్ ముగిసేనాటికి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (Reliance Industries RIL) కు రూ. 3,03,530 కోట్ల అప్పులున్నాయి. సవాళ్లను ఎదుర్కొంటూ వివిధ విభాగాల ఉద్యోగులు గొప్ప పనితీరును కనబర్చారని Q3 ఫలితాలను విడుదల చేస్తూ RIL చైర్మన్ ముకేశ్ అంబానీ వ్యాఖ్యానించారు. రిలయన్స్ విభాగమైన జియో దేశవ్యాప్తంగా 5జీ సర్వీసులను ప్రారంభించిందని, ప్రస్తుతం దేశంలోని 124 నగరాల్లో జియో 5 జీ సేవలను అందిస్తోందని వివరించారు. KG D6 block నుంచి గణనీయ స్థాయిలో ఇంధనోత్పత్తి జరిగిందన్నారు.