తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tax On Electric Vehicles : అలర్ట్​.. ఈవీలపై కొత్త ట్యాక్స్​ విధించిన ప్రభుత్వం!

Tax on electric vehicles : అలర్ట్​.. ఈవీలపై కొత్త ట్యాక్స్​ విధించిన ప్రభుత్వం!

Sharath Chitturi HT Telugu

11 March 2024, 11:10 IST

    • Government imposes Tax on electric vehicles : ఎలక్ట్రిక్​ వాహనాలపై అదనపు ట్యాక్స్​లను వసూలు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం సిద్ధపడింది. ఈ మేరకు ప్రీమియం ఈవీలపై 10శాతం లైఫ్​టైమ్​ ట్యాక్స్​ని విధించింది.
ఈవీలపై 10శాతం లైఫ్​టైమ్​ ట్యాక్స్​..!
ఈవీలపై 10శాతం లైఫ్​టైమ్​ ట్యాక్స్​..!

ఈవీలపై 10శాతం లైఫ్​టైమ్​ ట్యాక్స్​..!

Karnataka government imposes Tax on electric vehicles : ఇండియాలో ఎలక్ట్రిక్​ వాహనాలకు మంచి డిమాండ్​ కనిపిస్తోంది. ఈవీ సెక్టార్​ శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. పర్యావరణ పరిక్షణకు ఇది మంచి విషయం అని అందరు భావిస్తున్న సమయంలో.. కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది! ప్రీమియం ఎలక్ట్రిక్​ వాహనాలపై అదనంగా ట్యాక్స్​లను వసూలు చేయాలని ఫిక్స్​ అయ్యింది. ఈ మేరకు.. కర్ణాటక మోటార్​ వెహికిల్​ ట్యాక్సేషన్​ యాక్ట్​ 2024ని సవరించింది. ఫలితంగా.. ప్రస్తుతం ఉన్న రోడ్డు ట్యాక్స్​కు అదనంగా.. ప్రీమియం ఎలక్ట్రిక్​ వాహనాలపై 10శాతం లైఫ్​టైమ్​ ట్యాక్స్​ కూడా పడనుంది. ఇది.. ఈవీ సేల్స్​పై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి.

ఎలక్ట్రిక్​ వాహనలపై ట్యాక్స్​ పెంపు..

కర్ణాటక మోటార్​ వెహికిల్​ ట్యాక్సేషన్​ యాక్ట్​ 2024కి చేసిన సవరణ ప్రకారం.. రూ. 25లక్షల కన్నా ఎక్కువ ధర ఉండే ఈవీలపై అదనంగా 10శాతం లైఫ్​టైమ్​ ట్యాక్స్​ పడుతుంది. రిజిస్ట్రేషన్​ సమయంలో ట్యాక్స్​ వేస్తారు.

"ఎలక్ట్రిసిటీపై నడిచే.. మోటార్​ కార్స్​, జీప్స్​, ఓమ్నీబస్సులు, ప్రైవేట్​ సర్వీస్​ వెహికిల్స్​పై, వాటి ధరల మీద అదనంగా 10శాతం లైఫ్​టైమ్​ ట్యాక్స్​ వేస్తున్నాము. రూ. 25లక్షల కన్నా ఎక్కువ ధర ఉండే ఈవీలపై ఇది వర్తిస్తుంది," అని కర్ణాటక ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్​లో ఉంది.

ఇదీ చూడండి:- Car Insurance Premiums : ఇలా చేస్తే.. కారు ఇన్ష్యూరెన్స్​ ప్రీమియం డబ్బును ఆదా చేసుకోవచ్చు!

Tax on electric vehicles in Karnataka : ఈ కొత్త ట్యాక్స్​కి ముందే.. దేశంలోనే రోడ్డు ట్యాక్స్​లు అధికంగా ఉన్న రాష్ట్రంగా నిలిచింది కర్ణాటక. ఇక్కడ.. వాహనాలపై 13శాతం నుంచి 20శాతం మధ్యలో ట్యాక్స్​ వస్తోంది ప్రభుత్వం. ఇక ఇప్పుడు 10 పర్సెంట్​ లైఫ్​టైమ్​ ట్యాక్స్​తో ప్రీమియం ఎలక్ట్రిక్​ వెహికిల్స్​ ధరలు మరింత పెరగనున్నాయి. అయితే.. ప్యూర్​ ఈవీలను రోడ్డు ట్యాక్స్​ నుంచి మినహాయించిన కర్ణాటక ప్రభుత్వం.. హై ఎండ్​ ఎలక్ట్రిక్​ వెహికిల్స్​పై ఇnewలా అదనంగా పన్నులు విధిస్తుండటం గమనార్హం. ఇక ఈవీలకు జీరో రిజిస్ట్రేషన్​ ఫీజుతో రోడ్డు ట్యాక్స్​ మినహాయింపును కూడా ఇస్తోంది కర్ణాటక ప్రభుతవం. ఇతర రాష్ట్రాల్లో.. ఈవీ పాలసీలతో సబ్సిడీలు ఇస్తున్నాయి.

ఇక కర్ణాటక ప్రభుత్వం తాజా నిర్ణయంతో.. ఎలక్ట్రిక్​ కార్లపై ప్రభావం చూపుతుంది. కానీ.. రానున్న సంవత్సరాల్లో ఈవీ సెగ్మెంట్​కు డిమాండ్​ మరింత పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. 2030 నాటికి.. కర్ణాటకలో 23 లక్షలకుపైగా ఈవీలు అమ్ముడుపోతాయని ప్రభుత్వం ఆశిస్తోంది. ఇప్పటికే ఈ నెంబర్​ 3లక్షలు దాటిపోయింది.

తదుపరి వ్యాసం