Ola S1 Air : ఓలా ఎస్1 ఎయిర్‌లో క్రేజీ ఫీచర్స్..!
24 July 2023, 13:58 IST
- Ola S1 Air : ఓలా ఎస్1 ఎయిర్ ఇప్పుడు ఒక హాట్ టాపిక్. ఈ నేపథ్యంలో ఈ స్కూటర్ ఫీచర్స్ వివరాలపై ఓ లుక్కేద్దాము..
ఓలా ఎస్1 ఎయిర్‌లో క్రేజీ ఫీచర్స్..!
Ola S1 Air : ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లతో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది ఓలా ఎలక్ట్రిక్ సంస్థ. ఇక ఇప్పుడు ఈ సంస్థ నుంచి ఓలా ఎస్1 ఎయిర్ లాంచ్‌కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ-సూటర్ ఫీచర్స్‌తో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
ఫీచర్స్.. మామూలుగా లేవుగా!
ఇండియాలో అతి చౌకైనా ఈవీగా ఈ ఎస్1 ఎయిర్ నిలుస్తుంది. సంస్థ లైనప్‌లోని ఎస్1, ఎస్1 ప్రో సరసన ఈ కొత్త మోడల్ ఉంటుంది. ఇందులో 3 కేడబ్ల్యూహెచ్ లిథియం- ఐయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 125కి.మీల దూరం ప్రయాణిస్తుందని సంస్థ చెబుతోంది. ఎస్1, ఎస్1 ప్రో ఉన్నట్టు కాకుండా, ఈ మోడల్లో బెల్ట్ డ్రైవ్ స్థానంలో హబ్ మోటార్ ఉంటుంది. దీనిని ఓలా హైపర్‌డ్రైవ్ మోటార్ అని పిలుస్తున్నారు. దీని ద్వారా ఎలక్ట్రిక్ స్కూటర్ పవర్ ఔట్పుట్ అనేది 6 బీహెచ్పీకి పెరుగుతుందని సమాచారం. ఈకో, నార్మల్, స్పోర్ట్స్ వంటి రైడ్ మోడ్స్ కూడా ఇందులో ఉంటాయి. దీని టాప్ స్పీడ్ 90కేఎంపీహెచ్ అని సంస్థ చెబుతోంది.
Ola S1 Air feautres : కొత్త ఈవీలో మూవ్ఓఎస్ 3 సాఫ్ట్వేర్ ఉంటుంది. మూడ్స్, డాక్యుమెంట్ స్టోరేజ్, వైఫై కనెక్టివిటీ, ఫాల్ డిటెక్షన్, హాలో ల్యాంప్, హజార్డ లైట్స్, ప్రాక్సిమిటీ వంటి ఫీచర్స్ దీనితో పాటు వస్తాయి. ఇక ఈ స్కూటర్లో ఆల్- ఎల్ఈడీ హెడ్‌లైట్స్, 7 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, సైడ్ స్టాండ్ అలర్ట్, రివర్స్ మోడ్, ఓటీఏ అప్డేట్స్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, జీపీఎస్ నేవిగేషన్, రిమోట్ బూట్ అన్‌లాక్ వంటి ఆప్షన్స్ కూడా వస్తున్నాయి.
ఇదీ చూడండి:- ఓలా నుంచి ఎలక్ట్రిక్ కారు.. లాంచ్ ఎప్పుడంటే!
ఎస్1 ఎయిర్‌లో 34లీటర్ బూట్ స్పేస్ ఉంటుంది. మొత్తం ఐదు రంగుల్లో ఇది అంబాటులోకి రానుంది. అవి కోరల్ గ్లామ్, జెట్ బ్లాక్, లిక్విడ్ సిల్వర్, నియో మింట్, పోర్సెలిన్ వైట్.
ఓలా ఎస్1 ఎయిర్ డెలివరీ ఎప్పుడంటే..
Ola S1 Air price : వాస్తవానికి ఈ మోడల్‌ను గతేడాదే ఆవిష్కరించింది ఓలా ఎలక్ట్రిక్ సంస్థ. కానీ రోడ్డు మీదకు రాలేదు. బ్యాటరీతో పాటు ఇతర ఫీచర్స్‌ను అప్డేట్ చేయడం ఇందుకు ఓ కారణం అని తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఈ-స్కూటర్ కొనుగోళ్ల విండో జులై 31న ప్రారంభమవుతుంది. ఇప్పటికే బుక్ చేసుకున్న వారికి జులై 28నే విండో ఓపెన్ అవుతుంది. ఎలక్ట్రిక్ వెహికిల్ ఇంట్రొడక్టరీ ప్రైజ్ రూ. 1.09లక్షలు (ఎక్స్‌షోరూం). ఇంట్రొడక్టరీ ఆఫర్ ముగిసిన తర్వాత ఎక్స్‌షోరూం ధర రూ. 1.19లక్షలకు పెరుగుతుంది. ఈ ఏడాది ఆగస్టు తొలినాళ్ల నుంచి డెలివరీలు మొదలవుతాయి.