Ola electric car : ఓలా నుంచి ఎలక్ట్రిక్​ కారు.. లాంచ్​ ఎప్పుడంటే!-from car launch to ipo ola ceo bhavish aggarwal shares companys plans ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Ola Electric Car : ఓలా నుంచి ఎలక్ట్రిక్​ కారు.. లాంచ్​ ఎప్పుడంటే!

Ola electric car : ఓలా నుంచి ఎలక్ట్రిక్​ కారు.. లాంచ్​ ఎప్పుడంటే!

Sharath Chitturi HT Telugu
Jul 17, 2023 07:49 AM IST

Ola electric car launch : ఓలా సంస్థ జోరు మీద ఉంది! ఓ కొత్త ఎలక్ట్రిక్​ కారును లాంచ్​ చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

ఓలా నుంచి ఎలక్ట్రిక్​ కారు.. లాంచ్​ ఎప్పుడంటే!
ఓలా నుంచి ఎలక్ట్రిక్​ కారు.. లాంచ్​ ఎప్పుడంటే!

Ola electric car launch : ఎలక్ట్రిక్​ స్కూటర్​తో ఇండియా మార్కెట్​లో దూసుకెళుతున్న ఓలా ఎలక్ట్రిక్​ సంస్థ.. భవిష్యత్తు కోసం భారీ ప్లాన్సే వేసింది! ఈ నేపథ్యంలో ఓ కొత్త ఎలక్ట్రిక్​ బైక్​ను ఆ సంస్థ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు.. కొత్త ఎలక్ట్రిక్​ కారును కూడా తయారు చేసేందుకు ప్రణాళికలు రచించింది. ఈ విషయాన్ని ఆ సంస్థ సీఈఓ భవిష్​ అగర్వాల్​ స్వయంగా వెల్లడించారు.

"మా బిజినెస్​ను విస్తరించాలని చూస్తున్నాము. 2023 చివరి నాటికి ఎలక్ట్రిక్​ బైక్​ను లాంచ్​ చేస్తాము. 2024లో ఎలక్ట్రిక్​ కారును తీసుకొస్తాము. అయితే వీటి టైమ్​లైన్​ మారొచ్చు. ప్రస్తుతం మా స్కూటర్లను ఇండియా నుంచి లాటిన్​ అమెరికా, అగ్నేయ ఆసియా, యూరోప్​కు ఎగుమతి చేసేందుకు ప్లాన్​ చేస్తున్నాము," అని బూమ్​బర్గ్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భవిష్​ అగర్వాల్​ అన్నారు.

ఓలా ఎలక్ట్రిక్​ బైక్​కు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

2021 చివర్లో ఇండియా మార్కెట్​లోకి అడుగుపెట్టింది ఓలా ఎలక్ట్రిక్​. అప్పటి నుంచి ఇప్పటివరకు క్రేజీ గ్రోత్​ను నమోదు చేసింది! ఈవీ సెగ్మెంట్​లో ప్రస్తుతం సంస్థకు 38శాతం కన్నా ఎక్కువ వాటా ఉండటం విశేషం. 2021 డిసెంబర్​ నుంచి ఇప్పటివరకు 2,39,000 ఎలక్ట్రిక్​ స్కూటర్లను విక్రయించింది.

ఇదీ చూడండి:- Ola electric scooter: ఎలక్ట్రిక్ స్కూటర్స్ విభాగంలో కొనసాగుతున్న ఓలా ఆధిపత్యం

'వెస్ట్​కు టెస్లా.. ఈస్ట్​కు ఓలా..'

దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ టెస్లా.. ఇండియాకు వస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపైనా భవిష్​ స్పందించారు. వెస్ట్​కు టెస్లా అని.. ఈస్ట్​కు ఓలా అని వ్యాఖ్యానించారు.

"దక్షిణ భారతంలో భారీ ఫ్యాక్టరీని మస్క్​ రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. అంబానీకి పోటీగా ఆయన వస్తున్నారు. టెస్లా ఫ్యాక్టరీలో లిథియం ఐయాన్​ బ్యాటరీలను భారీ ఎత్తున మేన్యుఫ్యాక్చర్​ చేస్తారని తెలుస్తోంది. ఇది ఓలా ఎలక్ట్రిక్​కు మంచి విషయం. ఇదే జరిగిందే.. మా సంస్థ తయారు చేసే కార్​ సేల్స్​ గణనీయంగా పెరుగుతాయి," అని భవిష్​ అన్నారు.

ఐపీఓ కూడా..

OLA electric IPO : ఈ నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్​ మొబిలిటీ ఐపీఓపైనా భవిష్​ పలు వ్యాఖ్యలు చేశారు.

"సంస్థ నేను ఊహించినదాని కన్నా వేగంగా వృద్ధిచెందుతోంది. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్​ ఇందుకు కారణం. మాకు ఐపీఓ ప్లాన్స్​ కూడా ఉన్నాయి," అని భవిష్​ అగర్వాల్​ స్పష్టం చేశారు. కానీ ఐపీఓ ఎప్పుడు లాంచ్​ అవుతుంది? అన్న విషయాన్ని ఆయన వెల్లడించలేదు.

Whats_app_banner

సంబంధిత కథనం