Ola electric scooter: ఎలక్ట్రిక్ స్కూటర్స్ విభాగంలో కొనసాగుతున్న ఓలా ఆధిపత్యం-ola continues to be a market leader in electric scooter segment ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Ola Electric Scooter: ఎలక్ట్రిక్ స్కూటర్స్ విభాగంలో కొనసాగుతున్న ఓలా ఆధిపత్యం

Ola electric scooter: ఎలక్ట్రిక్ స్కూటర్స్ విభాగంలో కొనసాగుతున్న ఓలా ఆధిపత్యం

HT Telugu Desk HT Telugu
Jul 04, 2023 05:22 PM IST

Ola electric scooter: ఎలక్ట్రిక్ స్కూటర్స్ విభాగంలో ఓలా కంపెనీ ఆధిపత్యం కొనసాగుతోంది. జూన్ నెలలో ఈ సంస్థ మొత్తం 40% మార్కెట్ వాటా చేజిక్కించుకుని మార్కెట్ లీడర్ గా మరోసారి నిలిచింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Ola electric scooter: ఎలక్ట్రిక్ స్కూటర్స్ విభాగంలో ఓలా కంపెనీ ఆధిపత్యం కొనసాగుతోంది. జూన్ నెలలో ఈ సంస్థ మొత్తం 40% మార్కెట్ వాటా చేజిక్కించుకుని మార్కెట్ లీడర్ గా మరోసారి నిలిచింది. జూన్‌ నెలలో దాదాపు 18,000 యూనిట్ల ఎలక్ట్రిక్ టూ వీలర్లను ఓలా అమ్మగలిగింది.

40 శాతం మార్కెట్ వాటా

భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్ EV 2W విభాగంలో తన నాయకత్వాన్ని కొనసాగిస్తోంది. జూన్ నెలలో 40% మార్కెట్ వాటాతో తన ప్రథమస్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై ఇస్తున్న సబ్సిడీని తగ్గించిన కారణంగా మొత్తంగా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు క్షీణించినప్పటికీ.. ఓలా మాత్రం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో దూసుకుపోతోంది. జూన్‌ నెలలో దాదాపు 18,000 యూనిట్ల ఎలక్ట్రిక్ టూ వీలర్లను ఓలా అమ్మగలిగింది. తద్వారా ఎలక్ట్రిక్ టూ వీలర్ సెగ్మెంట్ లో నంబర్ 1 గా నిలిచింది.

ఇండస్ట్రీ టాప్

మార్కెట్ లీడర్ స్థానాన్ని ఓలా మరోసారి నిలబెట్టుకుందని ఓలా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అన్షుల్ ఖండేల్వాల్ పేర్కొన్నారు. జూన్ నెలలో ఎలక్ట్రిక్ టూ వీలర్ల అమ్మకాలు మందకొడిగా ఉన్నప్పటికీ .. ఓలా మాత్రం లక్ష్యాలను చేధించగలిగిందన్నారు. తమ బ్రాండ్ కు వినియోగదారుల్లో ఉన్న విశ్వాసం, స్ట్రాంగ్ సప్లై చైన్, డిమాండ్ కు అనుగుణమైన ఉత్పత్తి సామర్ధ్యం.. మొదలైనవి తమ విజయానికి కారణమని ఆయన వివరించారు. జూలై నెలలో S1 ఎయిర్‌ మోడల్ ను లాంచ్ చేయబోతున్నామని వెల్లడించారు. అలాగే, భారతదేశ వ్యాప్తంగా ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లను (EC) ఏర్పాటు చేయనున్నామన్నారు. కంపెనీ ఇటీవలే తన 750వ ECని ప్రారంభించిందని, ఆగస్టు నాటికి 1,000 ఈసీల ఏర్పాటు దిశగా విస్తరించాలని యోచిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఓలా S1 Pro రూ. 1,39,999 లకు, S1 (3KWh) రూ. 1,29,999 లకు, S1 Air (3KWh) రూ. 1,09,999 లకు లభిస్తున్నాయన్నారు.

Whats_app_banner