Ola S1X price drop : భారీగా తగ్గిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు.. కొనాలంటే ఇదే రైట్ టైమ్!
15 April 2024, 17:20 IST
- Ola S1X : ఓలా ఎస్1ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్ల ధరలు తగ్గాయి. ఈ-స్కూటర్ల ధరలను కట్ చేసింది ఓలా ఎలక్ట్రిక్. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఓలా ఎస్1ఎక్స్ ధరలు తగ్గింపు...
Ola S1X on road price : భారత కస్టమర్లకు క్రేజీ న్యూస్ ఇచ్చింది దిగ్గజ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్. తన పోర్ట్‌ఫోలియోలో బెస్ట్ సెల్లింగ్ మోడల్స్‌లో ఒకటైన ఓలా ఎస్1ఎక్స్ ధరలను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఫలితంగా.. ఇప్పుడు రూ. 69,999 (ఎక్స్‌షోరూం ధర) నుంచే ఓలా ఎస్1ఎక్స్ ఈ-స్కూటర్ అందుబాటులో ఉండనుంది. ఇతర వేరియంట్ల ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లపై ధర తగ్గింపు..
రూ. 1,09,000గా ఉన్న ఓలా ఎస్1ఎక్స్ 4 కేడబ్ల్యూహెచ్ వేరియంట్ రూ. 10వేలు తగ్గి రూ. 99,999కి చేరింది. ఇక 3 కేడబ్ల్యూహెచ్ వేరియంట్ ధర రూ. 84,999గా ఉంది. అన్నింటికన్న తక్కువ ధర ఉన్న వేరియంట్.. ఓలా ఎస్1ఎక్స్ 2కేడబ్ల్యూ ఎలక్ట్రిక్ స్కూటర్. దీని ధర రూ. 69,999. ఇవన్నీ ఎక్స్‌షోరూం ధరలను గుర్తుపెట్టుకోవాలి.
ఓలా ఎస్1ఎక్స్.. 7 కలర్స్‌లో అందుబాటులో ఉంది. వీటి డెలివరీ.. వచ్చే వారం ప్రారంభమవుతుందని సంస్థ వెల్లడించింది.
ఎస్1ఎక్స్ ఈ-స్కూటర్లో 5 ఇంచ్ స్క్రీన్, 34 లీటర్ బూట్ స్పేస్, ఓలా ఐకానిక్ హెడ్‌ల్యాంప్, గ్రాబ్ రెయిల్ వంటివి వస్తున్నాయి.
Ola electric latest news : ఇక 4 కేడబ్ల్యూహెచ్ వేరియంట్ రేంజ్ 190 కి.మీలుగా ఉంది. 2 కేడబ్ల్యూహెచ్, 3 కేడబ్ల్యూహెచ్ స్కూటర్లను ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. వరుసగా 95 కి.మీలు, 143 కి.మీలు ప్రయాణించవచ్చు. 2, 3 కేడబ్ల్యూ వేరియంట్లకు ఫిజికల్ కీ వస్తుంది.
ఇదీ చూడండి:- 2024 Maruti Suzuki Swift : సరికొత్తగా మారుతీ సుజుకీ స్విఫ్ట్.. వచ్చే నెలలో లాంచ్!
తమ పోర్ట్‌ఫోలియోలోని ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలను తగ్గించడం ఓలా ఎలక్ట్రిక్‌కి ఇది మొదటిసారి కాదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో.. ఎస్1ఎక్స్+, ఎస్1 ఎయిర్, ఎస్1 ప్రో ధరలను తగ్గించింది. మరీ ముఖ్యంగా.. ఎస్1ఎక్స్+ ధరను రూ. 25వేల వరకు తగ్గించడం విశేషం.
అంతేకాదు.. 8ఏళ్లు లేదా 60వేల కి.మీలతో ఎక్స్టెండెడ్ బ్యాటరీ వారెంటీని కూడా ప్రవేశపెట్టింది ఓలా ఎలక్ట్రిక్ సంస్థ. ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండానే ఈ సేవలను అందిస్తుండటం విశేషం.
ఎందుకు ధరలను తగ్గిస్తోంది..?
Ola S1X price cut : ఇండియన్ 2 వీలర్ ఎలక్ట్రిక్ సెగ్మెంట్లో రారాజుగా కొనసాగుతోంది ఓలా ఎలక్ట్రిక్. ఈ సంస్థకు.. అత్యధిక మార్కెట్ షేరు ఉంది. కానీ ఇటీవలి కాలంలో.. టీవీఎస్, బజాజ్, ఏథర్ ఎనర్జీ వంటి సంస్థల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటోంది ఓలా ఎలక్ట్రిక్. పోటీని తట్టుకుని, నెంబర్ 1గా కొనసాగేందుకు ప్రయత్నిస్తున్న ఆ సంస్థ.. కస్టమర్లను ఆకర్షించేందుకు ఈ విధంగా ప్రైజ్ కట్, డిస్కౌంట్స్, ఆఫర్స్ ఇస్తోందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ఓలా ఎలక్ట్రిక్ వాహనాల ధరల తగ్గింపుతో ఈ-స్కూటర్ల తయారీ సంస్థ మధ్య పోటీ మరింత పెరుగుతుందనడంలో సందేహం లేదు. ఇది కస్టమర్లకు ఒకింత మంచి విషయమే! ధరలు తగ్గితే, కొత్త ఈ-స్కూటర్ కొనాలనుకునే వారికి ఖర్చులు తగ్గుతాయి.