Ola offers: ఓలా ఎస్ 1 ప్రో, ఓలా ఎస్ 1 ఎయిర్ లపై ఏప్రిల్ 15 వరకే ఈ ప్రత్యేక ఆఫర్; త్వరపడండి..-ola s1 pro and s1 air get this special offer till 15th april check details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Ola Offers: ఓలా ఎస్ 1 ప్రో, ఓలా ఎస్ 1 ఎయిర్ లపై ఏప్రిల్ 15 వరకే ఈ ప్రత్యేక ఆఫర్; త్వరపడండి..

Ola offers: ఓలా ఎస్ 1 ప్రో, ఓలా ఎస్ 1 ఎయిర్ లపై ఏప్రిల్ 15 వరకే ఈ ప్రత్యేక ఆఫర్; త్వరపడండి..

HT Telugu Desk HT Telugu
Apr 10, 2024 06:31 PM IST

Ola offers: ఓలా ఎస్ 1 ప్రో, ఎస్ 1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ పై ఓలా ప్రకటించిన ప్రత్యేక ఆఫర్ త్వరలో ముగియనుంది. ఆ ప్రత్యేక ఆఫర్ పొందాలనుకునే కస్టమర్లు ఏప్రిల్ 15 లోపు ఓలా ఎస్ 1 ప్రో, ఓలా ఎస్ 1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ను కొనుగోలు చేయండి.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ పై ప్రత్యేక ఆఫర్స్
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ పై ప్రత్యేక ఆఫర్స్

ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) తన ఎస్ 1 ప్రో, ఎస్ 1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై కొత్త ఆఫర్లను ప్రకటించింది. ఎంపిక చేసిన బ్యాంకు రుణాలు, ఈఎంఐలపై రూ.5,000 క్యాష్ బ్యాక్ అందిస్తోంది. ఈ ఆఫర్ ఏప్రిల్ 15 వరకు మాత్రమే వర్తిస్తుంది. దీని గురించి మరింత సమాచారం పొందడం కొరకు, మీరు మీ సమీప ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) డీలర్ షిప్ ని సందర్శించాలని మేం సూచిస్తున్నాం, ఎందుకంటే వారు ప్రస్తుతం అమలులో ఉన్న ఆఫర్ ల గురించి మరింత సమాచారాన్ని అందించగలుగుతారు.

మార్చి నెలలో అమ్మకాల రికార్డు

మార్చి 2024 లో ఓలా ఎలక్ట్రిక్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం 53,000 కి పైగా బుకింగ్ లను పొందింది. ఇది ఈ సంస్థ సాధించిన అత్యధిక నెలవారీ అమ్మకాల రికార్డు. గత ఆర్థిక సంవత్సరంలో ఓలా స్కూటర్స్ రికార్డు స్థాయిలో 115 శాతం అమ్మకాల వృద్ధి సాధించాయి. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 3,28,785 యూనిట్ల ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ అమ్ముడుపోయాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో అమ్ముడుపోయిన ఓలా స్కూటర్స్ సంఖ్య 152,741 యూనిట్లు. ఓలా ఎలక్ట్రిక్ మార్చి 2024 లో కూడా తన ప్రధాన మార్కెట్ వాటాను నిలబెట్టుకుంది. అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో 42 శాతం వృద్ధిని నమోదు చేశామని ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) వెల్లడించింది. గత త్రైమాసికంలో ఓలా ఎలక్ట్రిక్ 119,310 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించినట్లు పేర్కొంది.

మూడు ఎలక్ట్రిక్ స్కూటర్స్

ప్రస్తుతానికి, ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) కంపెనీ తన పోర్ట్ ఫోలియోలో మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లను కలిగి ఉంది. ఇందులో ఓలా ఎస్1 ఎక్స్ (Ola S1 X), ఓలా ఎస్1 ఎయిర్ (Ola S1 Air), ఓలా ఎస్1 ప్రో (Ola S1 Pro) ఉన్నాయి. 2022-23లో కంపెనీ 205 పేటెంట్ల కోసం దరఖాస్తు చేసింది. ఓలా ఎలక్ట్రిక్ ఆర్ అండ్ డీ యూనిట్స్ ఇండియా, యూకే, యూఎస్ సహా అనేక దేశాలలో విస్తరించి ఉన్నాయి. కంపెనీ ప్రధానంగా కొత్త ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తులు, బ్యాటరీ ప్యాక్ లు, మోటార్లు, వాహన ఫ్రేమ్స్ వంటి ప్రధాన భాగాల రూపకల్పన, అభివృద్ధిపై దృష్టి సారించింది.

Whats_app_banner