2024 Maruti Suzuki Swift : సరికొత్తగా మారుతీ సుజుకీ స్విఫ్ట్.. వచ్చే నెలలో లాంచ్!
Maruti Suzuki Swift 2024 : సరికొత్త మారుతీ సుజుకీ స్విఫ్ట్ 2024 వచ్చేస్తోంది! వచ్చే నెలలోనే ఇది ఇండియాలో లాంచ్ అవుతుందని తెలుస్తోంది. పూర్తి వివరాలు..
Maruti Suzuki Swift on road price Hyderabad : మారుతీ సుజుకీ స్విఫ్ట్ 2024 వర్షెన్.. గత కొన్ని నెలలుగా వార్తల్లో నిలుస్తోంది. ఈ ప్రముఖ హ్యాచ్‌బ్యాక్.. ఈ ఏడాది మేలో ఇండియాలో లాంచ్ అవుతుంది. దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ.. ఈ న్యూ జనరేషన్ స్విఫ్ట్‌ని మే 9న లాంచ్ చేస్తుందని సమచారం. ఇండియాలో మారుతీ సుజుకీకి బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ఉంది స్విఫ్ట్. చాలా కాలం తర్వాత.. అప్డేట్స్ అందుకుంటుండటంతో.. 2024 మారుతీ సుజుకీ స్విఫ్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ మోడల్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
కొత్త తరం మారుతీ సుజుకీ స్విఫ్ట్.. 2023 జపాన్ మొబిలిటీ షోలో అంతర్జాతీయంగా అరంగేట్రం చేసింది. అప్పటి నుంచి.. ఈ హ్యాచ్‌బ్యాక్.. యూరప్, జపాన్ వంటి ప్రపంచ మార్కెట్లలో సేల్‌లో ఉంది. ఇప్పుడు ఆ జాబితాలోకి భారత్ కూడా చేరబోతోంది. ఇండియా-స్పెక్ నెక్ట్స్ జనరేషన్ స్విఫ్ట్.. గ్లోబల్ మోడల్‌ను పోలి ఉంటుంది.
2024 మారుతీ సుజుకీ స్విఫ్ట్: ఎక్స్టీరియర్..
వైఈడీ అనే కోడ్ నేమ్‌తో వస్తోంది కొత్త మారుత సుజుకీ స్విఫ్ట్. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మోడల్‌తో పోలిస్తే గణనీయమైన, విలక్షణమైన విజువల్ లుక్ ఇందులో కనిపిస్తోంది. ఇందులో అప్డేటెడ్ రేడియేటర్ గ్రిల్, ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లతో షార్ప్ అండ్ రీడిజైన్ చేసిన ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ ఉన్నాయి. టాప్ వేరియంట్లో ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్ ఉండనున్నాయి. బంపర్ కూడా డిఫరెంట్‌గా కనిపిస్తోంది. హ్యాచ్‌బ్యాక్‌లో కొత్త డిజైన్ అల్లాయ్ వీల్స్ లభించింది. అంతేకాదు.. ప్యాసింజర్ డోర్ హ్యాండిల్స్‌ని కూడా రీలోకేట్ చేసింది సంస్థ. వెనుక భాగంలో, కొత్త స్విఫ్ట్ స్పోర్ట్స్ రీడిజైన్ చేసిన ఎల్ఈడి టెయిల్ లైట్లు, రీడెవలప్డ్ బంపర్‌ని చూడవచ్చు. 2024 మారుతీ సుజుకీ స్విఫ్ట్ కొత్త కలర్ ఆప్షన్లలో కూడా లభిస్తుంది.
2024 మారుతీ సుజుకీ స్విఫ్ట్: ఇంటీరియర్యయ
Maruti Suzuki Swift 2024 : కొత్త స్విఫ్ట్ ఇంటీరియర్‌లో చాలా మార్పులు కనిపించే అవకాశం ఉంది. డ్యాష్‌బోర్డ్ లేఅవుట్ కొత్తగా ఉంది. ఫ్రీ స్టాండింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంది. సీటు, అప్హోల్ స్టరీ మెటీరియల్ కూడా రిఫ్రెషింగా ఉన్నాయి.
2024 మారుతీ సుజుకీ స్విఫ్ట్: సేఫ్టీ..
సేఫ్టీ పరంగా.. కొత్త స్విఫ్ట్‌లో ఆరు ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఈఎస్పీ స్టాండర్డ్‌గా, రెండవ వరుసలో సెంటర్ ప్యాసింజర్ కోసం మూడు పాయింట్ల సీట్ బెల్ట్, రివర్స్ పార్కింగ్ కెమెరా వంటివి ఉన్నాయి. ఇండియా-స్పెక్ స్విఫ్ట్ గ్లోబల్ మోడల్లో అందుబాటులో ఉన్న 360 డిగ్రీల కెమెరా, అడాస్ వంటివి ఇందులో ఉండకపోవచచు.
2024 మారుతీ సుజుకీ స్విఫ్ట్: ఇంజిన్..
2024 Maruti Suzuki Swift : కొత్త తరం మారుతీ సుజుకీ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌లో.. కొత్త జడ్-సిరీస్ 1.2-లీటర్ మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్ని పొందుతుంది. ఇది ప్రస్తుత మోడల్లోని కే12 నాలుగు సిలిండర్ల పెట్రోల్ యూనిట్ స్థానంలో వస్తుంది. కొత్త ఇంజిన్.. పవర్- టార్క్ అవుట్‌పుట్.. కే12 యూనిట్ ఉత్పత్తి చేసే విధంగానే ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుత ఇంజిన్.. గరిష్టంగా 89బీహెచ్పీ పవర్, 113ఎన్ఎమ్ టార్క్‌ని జనరేట్ చేస్తుంది. కొత్త స్విఫ్ట్‌లో 5-స్పీడ్ మ్యాన్యువల్ యూనిట్, ఏఎమ్‌టీ ఆప్షన్ అందుబాటులో ఉంటాయని ఆశించవచ్చు. అన్ని వేరియంట్లలో అందుబాటులో ఉండే మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీ అతిపెద్ద హైలైట్!
సంబంధిత కథనం