Top 4 hatchback cars: మంచి హ్యాచ్ బ్యాక్ కార్ కోసం చూస్తున్నారా? ఇవి చెక్ చేయండి-top 4 hatchback cars launching soon in india all details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Top 4 Hatchback Cars Launching Soon In India: All Details

Top 4 hatchback cars: మంచి హ్యాచ్ బ్యాక్ కార్ కోసం చూస్తున్నారా? ఇవి చెక్ చేయండి

HT Telugu Desk HT Telugu
Mar 08, 2023 03:36 PM IST

Top 4 hatchback cars: స్మాల్ కార్ సెగ్మెంట్ (small car) భారత్ లో ఎప్పుడు డిమాండ్ ఉండే సెగ్మెంట్. మధ్య తరగతి భారతీయులు ప్రధానంగా చూసే కార్స్ అన్నీ ఈ సెగ్మెంట్ లోనే ఉంటాయి. అందుకే ఈ సెగ్మెంట్ పై అన్ని కంపెనీలకు ప్రత్యేక దృష్టి ఉంటుంది. త్వరలో 4 మోడల్స్ ఈ సెగ్మెంట్ లో సందడి చేయనున్నాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఒకప్పటి కన్నా ఇప్పుడు భారత్ లో ఎస్యూవీ ()ల డిమాండ్ బాగా పెరిగింది. అయినప్పటికీ, చిన్న, మధ్య తరహా కార్లకు ఉండే డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. అందువల్లు, నాలుగు మేజర్ కంపెనీలు ఈ స్మాల్, హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో కొత్త మోడళ్లను లాంచ్ చేయనున్నాయి.

MG Comet: ఎంజీ కోమెట్

ఎంజీ మోటార్ ఇండియా (MG Motor India) త్వరలో 2 డోర్ ఎలక్ట్రిక్ కార్ (2-door electric car)ను మార్కెట్లోకి తీసుకురానుంది. దానిపేరును కోమెట్ (Comet) గా నిర్ణయించింది. ప్రస్తుతం ఇండోనేషియా మార్కెట్లో ఉన్న వూలింగ్ ఎయిర్ ఈవీ (Wuling Air EV)కి స్వల్ప మార్పులు చేసి ఈ మోడల్ ను రూపొందిస్తున్నారు. 2023 జూన్ నాటికి ఈ కారు ఇండియన్ మార్కెట్లో అందుబాటులోకి రానుంది. సుమారు 10 లక్షల రూపాయల ధరలో ఇది లభించే అవకాశముంది. దీనిలో 20-25kWh బ్యాటరీ ప్యాక్ ను అమర్చనున్నారు. సింగిల్ చార్జింగ్ తో గరిష్టంగా 300 కిమీలు వెళ్లే అవకాశముంది.

Tata Altroz CNG: టాటా ఆల్ట్రోజ్ సీఎన్జీ

భారతీయుల ట్రస్టెడ్ బ్రాండ్ టాటా నుంచి వస్తున్న చిన్న కారు Tata Altroz CNG. పెట్రోల్, సీఎన్జీలపై ఇది నడుస్తుంది. దీనిలో 1.2 లీటర్ల రెవొట్రాన్ (revetron) పెట్రోల్ ఇంజిన్ ను అమర్చారు. ఈ సంవత్సరం ఆటో ఎక్స్ పోలో టాటా మోటార్స్ (tata motors) దీనిని ప్రదర్శించింది. ఇందులో రెండు సీఎన్జీ ట్యాంక్ లను అమర్చారు. వీటిలో గరిష్టంగా 60 లీటర్ల సీఎన్జీని ఫిల్ చేయవచ్చు. సీఎన్జీలో లీటరుకు 25 కిమీలవరకు మైలేజీ వస్తుందని కంపెనీ చెబుతోంది.

New-gen Maruti Swift: మారుతి స్విఫ్ట్

మారుతి సుజుకీ (maruti suzuki) నుంచి వచ్చిన మోస్ట్ సక్సెస్ ఫుల్ మోడల్ స్విఫ్ట్ కు మరిన్ని మార్పులు చేసి 2024లో భారతీయ మార్కెట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ కారులో టొయోటా హైబ్రిడ్ టెక్నాలజీ (Toyota's hybrid technology) తో 1.2 లీటర్, 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ను అమర్చనున్నారు. ఈ పవర్ట్రెయిన్ టెక్నాలజీ తో ఈ కారు లీటరుకు 35 కిమీల నుంచి 40 కిమీల వరకు మైలేజీ ఇవ్వనుంది.

New-gen Tata Tiago: టాటా టియాగో

టాటా మోటార్స్ నుంచి వస్తోన్న మరో చిన్న కారు New-gen Tata Tiago. ఇప్పటికే పాపులర్ అయిన టియాగో ను మరింత అప్ గ్రేడ్ చేసి మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. దీన్ని టాటా మోటార్స్ 2024 చివర్లో కానీ, 2025 మొదట్లో కానీ మార్కెట్లోకి తీసుకువచ్చే అవకాశముంది. అల్ట్రోజ్, పంచ్ తదితర కార్లను రూపొందించిన ఆల్ఫా ప్లాట్ ఫామ్ పైననే దీన్ని కూడా తీర్చిదిద్దారు.

WhatsApp channel

టాపిక్