Suzuki Access 125 : సరికొత్తగా సుజుకీ యాక్సెస్​ 125 స్కూటర్​.. లాంచ్​ ఎప్పుడు?-automobile news 2025 suzuki access 125 spotted testing check details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Suzuki Access 125 : సరికొత్తగా సుజుకీ యాక్సెస్​ 125 స్కూటర్​.. లాంచ్​ ఎప్పుడు?

Suzuki Access 125 : సరికొత్తగా సుజుకీ యాక్సెస్​ 125 స్కూటర్​.. లాంచ్​ ఎప్పుడు?

Sharath Chitturi HT Telugu
Apr 13, 2024 10:48 AM IST

2025 Suzuki Access 125 : సుజుకీ యాక్సెస్​ 125 స్కూటర్​.. సరికొత్తగా భారతీయుల ముందుకు రాబోతోంది. ఈ మోడల్​ అప్డేటెడ్​ వర్షెన్​కి సంబంధించిన వివరాలను ఇక్కడ చూసేయండి..

2025 సుజుకీ యాక్సెస్​ 125 వచ్చేస్తోంది.
2025 సుజుకీ యాక్సెస్​ 125 వచ్చేస్తోంది.

2025 Suzuki Access 125 : ఇండియన్​ 2 వీలర్​ ఆటోమొబైల్​ సెగ్మెంట్​లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది సుజుకీ సంస్థ. అనేక స్కూటర్ల లాంచ్​తో కస్టమర్లను ఆకర్షిస్తూనే ఉంటుంది ఈ దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ. ఇక ఇప్పుడు.. ఇండియాలో తన బెస్ట్​ సెల్లింగ్​ ఫ్యామిలీ స్కూటర్​ అయిన సుజుకీ యాక్సెస్​ 125కి కొత్త వర్షెన్​ని తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ మోడల్​ టెస్ట్​ డ్రైవ్​ చేస్తూ ఇటీవలే భారతీయ రోడ్లపై దర్శనమిచ్చింది. ఈ నేపథ్యంలో.. ఈ స్కూటర్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఓసారి చూసేద్దాము..

సుజుకీ యాక్సెస్​ 125 అప్డేటెడ్​ వర్షెన్​ హైలైట్స్​..

ఇండియాలో టాప్​ 10 స్కూటర్స్​లో ఒకటిగా ఉంటుంది సుజుకీ యాక్సెస్​ 125. ఇక దీని అప్డేటెడ్​ వర్షెన్​పై చాలా రోజులగా మంచి బజ్​ నెలకొంది. కొత్త యాక్సెస్​ 125లోని డిజైన్​ ఎలిమెంట్స్​.. ప్రస్తుతం మార్కెట్​లో అందుబాటులో ఉన్న మోడల్​ని పోలి ఉంటుందని సమాచారం. కానీ ఫ్రెంట్​ స్టోరేజ్​ కాంపొనెంట్​ యాడ్​ అవుతుందట. ఈ స్టోరేజ్​ కాంపోనెంట్​లో సర్క్యులర్​ రిఫ్లెక్టర్​ ఉంటుందట.

ఇక హీట్​ షీల్డ్​కి ఫ్రెష్​ డిజైన్​తో పాటు రీడిజైన్డ్​ రేర్​ మడ్​గార్డ్​ను కూడా యాక్సెస్​ 125 స్కూటర్​కి సుజుకీ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

Suzuki access 125 on road price hyderabad : సరికొత్త సుజుకీ యాక్సెస్​ 125 సీట్​.. ప్రస్తుత వర్షెన్​తో పోల్చితే మరింత ఫ్లాట్​గా ఉంది. అంటే.. పిలియన్​ రైడర్స్​కి కంఫర్ట్​ మరింత పెరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. హజార్డ్​ లైట్స్​, డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, యాప్​ ద్వారా స్మార్ట్​ఫోన్​ కనెక్టివిటీ వంటివి ఇందులో ఫీచర్స్​గా ఉండొచ్చు. ఈ మధ్య కాలంలో ఈ తరహా ఫీచర్స్​ దాదాపు ప్రతి స్కూటర్​లోనూ కనిపిస్తున్నాయి. అందుకే.. పోటీని తట్టుకునేందుకు.. వీటిని యాక్సెస్​ 125లో సంస్థ యాడ్​ చేసే అవకాశం ఎక్కువగా ఉంది.

ఇందులో ఫ్లాట్​ ఫుట్​బోర్డ్​, మెరుగైన అండర్​ సీట్​ స్టోరేజ్​ కూడా ఉండనుంది. హోండా యాక్టివా​లో ఉన్నట్టుగానే.. స్మార్ట్​ కీ ఫీచర్​ కూడా ఈ కొత్త సుజుకీ యాక్సెస్​ 125 స్కూటర్​లో ఉండొచ్చు.

suzuki access 125 price : ఇక ఇంజిన్​ విషయానికొస్తే.. ప్రస్తుతం ఉన్న వర్షెన్​లో ఉన్న ఇంజిన్​నే కొత్త వర్షెన్​లోనూ సంస్థ కొనసాగిస్తుందని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి.

ఈ మోడల్​ ఎప్పుడు లాంచ్​ అవుతుంది? అన్న ప్రశ్నకు ప్రస్తుతం క్లారిటీ లేదు. 2024 రెండో భాగం లేదా 2025 తొలినాళ్లల్లో ఇది మార్కెట్​లోకి అడుగుపెట్టొచ్చని అంచనాలు ఉన్నాయి.

suzuki access 125 showroom near me : ఈ కొత్త సుజుకీ యాక్సెస్​ 125 అప్డేటెడ్​ వర్షెన్​కి సంబంధించిన ఇతర వివరాలపై ప్రస్తుతం క్లారిటీ లేదు. త్వరలోనే సంస్థ నుంచి అప్డేట్స్​ వచ్చే అవకాశం ఉంది.

WhatsApp channel

సంబంధిత కథనం