Honda Activa electric scooter : హోండా యాక్టివాకు ఈవీ టచ్.. ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేస్తోంది!
Honda Activa electric scooter : హోండా యాక్టివాకు ఎలక్ట్రిక్ వర్షెన్ రాబోతోంది. ఈ ఈవీపై ఓ కీలక అప్డేట్ బయటకొచ్చింది. ఆ వివరాలు..
Honda Activa electric scooter : ఇండియా 2 వీలర్ సెగ్మెంట్లో హోండా యాక్టివ్‌కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది! ఈ స్కూటర్‌కు మంచి డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో.. హోండా యాక్టివాకు ఎలక్ట్రిక్ వర్షెన్‌ను సిద్ధం చేస్తోంది సంస్థ. ఇక ఇప్పుడు.. ఈ ఈ-స్కూటర్‌పై కీలక అప్డేట్ బయటకు వచ్చింది. 2024 జనవరి 9న.. అమెరికా లాస్ వేగాస్‌లో జరగనున్న కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్)లో హోండా యాక్టివ్ ఎలక్ట్రిక్ స్కూటర్ని సంస్థ రివీల్ చేస్తుందని సమాచారం. ఈ నేపథ్యంలో ఈ మోడల్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
హోండా యాక్టివా ఈవీ..
ఈ హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్లో ఫిక్స్డ్ బ్యాటరీ సెటప్ ఉంటుందని తెలుస్తోంది. ఈ ఈవీ టాప్ స్పీడ్ 50 కేఎంపీహెచ్ అని సమాచారం. స్పీడ్, పర్ఫార్మెన్స్ కన్నా.. హోండా యాక్టివా ఈవీలోని రేంజ్‌పై సంస్థ ఎక్కువగా ఫోకస్ చేసిందట.
Honda Activa electric : అయితే.. ఇలా ఫిక్స్డ్ బ్యాటరీ సెటప్ ఉండటం నగరాల్లోని మల్టీ-స్టోర్ అపార్ట్‌మెంట్స్‌లో నివాసముంటున్న వారికి ఇబ్బందికరంగా ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇలాంటి వారికోసం.. స్వాప్ చేసుకునే బ్యాటరీ ప్యాక్‌తో కూడిన ఓ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ని లాంచ్ చేసేందుకు సంస్థ ప్లాన్ చేస్తోందట. హోండా యాక్టివా ఈవీ లాంచ్ అయిన కొన్ని నెలలకు ఇది కూడా మార్కెట్లోకి అడుగుపెడుతుందని సమాచారం.
కాగా.. ఈ హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ప్రస్తుతం పూర్తి వివరాలు అందుబాటులో లేవు. బ్యాటరీ ప్యాక్, రేంజ్, ఫీచర్స్‌తో పాటు ధరకు సంబంధించిన వివరాలు కూడా తెలియాల్సి ఉంది. లాస్ వేగాస్‌లో జరగే ఈవెంట్‌తో వీటిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Honda Activa electric scooter price in Hyderabad : మరోవైపు.. జనవరిలో ఈ మోడల్ని రివీల్ చేయనున్న సంస్థ.. 2024 మొదటి భాగంలోనే ఇండియాలో లాంచ్ చేస్తుందని టాకన్ నదుస్తోంది. అంతేకాకుండా.. ఈ ఈవీ లాంచ్‌కానున్న తొలి దేశం ఇండియానే కాబోతోందని వార్తలు వస్తున్నాయి. మరి ఇది ఎంత వరకు నిజమవుతుందో చూడాలి.
Honda Activa EV launch : ఇక లాంచ్ తర్వాత.. ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఓలా ఎస్1, టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక, ఏథర్ 450ఎక్స్ మధ్య ఉన్న పోటీని.. ఈ హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ మరింత పెంచుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ఏది ఏమైనా.. హోండా యాక్టివా ఈవీ వర్షెన్ కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సంబంధిత కథనం