2024 Suzuki Swift: యూకేలోకి ఎంట్రీ ఇవ్వనున్న సరికొత్త సుజుకీ స్విఫ్ట్; 3 సిలిండర్ ఇంజన్ తో..-in pics india bound 2024 suzuki swift goes on sale in uk next month ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  2024 Suzuki Swift: యూకేలోకి ఎంట్రీ ఇవ్వనున్న సరికొత్త సుజుకీ స్విఫ్ట్; 3 సిలిండర్ ఇంజన్ తో..

2024 Suzuki Swift: యూకేలోకి ఎంట్రీ ఇవ్వనున్న సరికొత్త సుజుకీ స్విఫ్ట్; 3 సిలిండర్ ఇంజన్ తో..

Mar 27, 2024, 02:50 PM IST HT Telugu Desk
Mar 27, 2024, 02:50 PM , IST

  • 2024 Suzuki Swift: 2024 సుజుకి స్విఫ్ట్ హ్యాచ్ బ్యాక్ మోడల్ కొత్త మూడు సిలిండర్ల ఇంజిన్ తో వస్తుంది. ఇది ప్రస్తుత ఇంజిన్ కంటే మెరుగైన ఇంధన సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ మోడల్ ను యూకే మార్కెట్లోకి ఈ ఏప్రిల్ నెలలో సుజుకీ విడుదల చేస్తోంది.

జపాన్లో 2024 స్విఫ్ట్ ను ఆవిష్కరించిన సుజుకి, ఏప్రిల్ 2024 లో యూకే, ఐర్లాండ్ లలో కూడా ఈ సరికొత్త హ్యాచ్ బ్యాక్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మోడల్ రాబోయే నెలల్లో ఇండియా లో కూడా లాంచ్ అవనుంది.

(1 / 9)

స్విఫ్ట్ ఇంటీరియర్ ప్రస్తుతం భారత మార్కెట్లో అమ్మకానికి ఉన్న బాలెనో నుండి తీసుకున్న కొన్ని డిజైన్ అంశాలతో సరికొత్తగా ఉంది. 

(2 / 9)

ఈ స్విఫ్ట్ లో డ్రైవర్ ఎదురుగా కొత్త ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. అలాగే, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే లను సపోర్ట్ చేసే టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది. ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్ ఉన్న ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. 

(3 / 9)

గ్లోబల్ మార్కెట్ కోసం ఈ సుజుకీ స్విఫ్ట్ లో 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ ను ఏర్పాటు చేశారు, టాప్ ఎండ్ వేరియంట్లలో డైమండ్ కట్ వెర్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. భారత మార్కెట్లో మారుతి సుజుకి 14 అంగుళాలు, 15 అంగుళాల చక్రాలను అందిస్తోంది. 

(4 / 9)

నావిగేషన్, రేర్ వ్యూ కెమెరా, రేర్ పార్కింగ్ సెన్సార్లు, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, వైర్లెస్ స్మార్ట్ఫోన్ లింక్ డిస్ప్లే ఆడియో, కీలెస్ ఎంట్రీ & స్టార్ట్, డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్, డ్యూయల్ సెన్సార్ బ్రేక్ సపోర్ట్ (అప్గ్రేడ్), లేన్ డిపార్చర్ వార్నింగ్ అండ్ వీవింగ్ అలర్ట్, రేర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, బ్లైండ్ స్పాట్ మానిటర్, మెరుగైన ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్ వంటి అడ్వాన్స్డ్ ఫీచర్లు ఉన్నాయి.

(5 / 9)

సైడ్ ప్రొఫైల్ నుండి, సుజుకి స్విఫ్ట్ ఐకానిక్ సిల్హౌట్ లుక్ ను కొనసాగించారు. అయితే, ఈ కొత్త మోడల్ మరింత షార్ప్ గా కనిపిస్తుంది.

(6 / 9)

కె 12 డీ అనే నాలుగు సిలిండర్ల ఇంజిన్ స్థానంలో కొత్త జెడ్ 12 ఇ, మూడు సిలిండర్ల యూనిట్ ను ఈ కారులో అమర్చారు. అలాగే, 1,200 సీసీ ని కొనసాగించారు. కొత్త ఇంజిన్ ఇంధన సామర్థ్యాన్ని పెంచుతుందని, రెవ్ రేంజ్ లోయర్ ఎండ్ లో ఎక్కువ టార్క్ ను ఇస్తుందని కంపెనీ తెలిపింది. 

(7 / 9)

గేర్ బాక్స్ ఆప్షన్లలో 5-స్పీడ్ మ్యాన్యువల్ యూనిట్, సీవీటీ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఉన్నాయి. అయితే, భారతదేశంలో, సీవీటీ యూనిట్ కు బదులుగా 5-స్పీడ్ ఏఎంటీ ఉండే అవకాశం ఉంది.

(8 / 9)

ఫ్యూయల్ ఎకానమీని పెంచడానికి ఇందులో 12 వి మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ ను స్టాండర్డ్ గా ఏర్పాటు చేశారు.

(9 / 9)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు