Nissan Magnite Geza : స్పెషల్ ఎడిషన్ నిస్సాన్ మాగ్నైట్ వచ్చేసింది.. ధర ఎంతంటే!
27 May 2023, 6:19 IST
- Nissan Magnite Geza special edition : నిస్సాన్ మాగ్నైట్ గెజా స్పెషల్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది సంస్థ. ఈ వర్షెన్ హైలైట్స్, ఫీచర్స్, ధర వంటి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..
స్పెషల్ ఎడిషన్ నిస్సాన్ మాగ్నైట్ వచ్చేసింది.. ధర ఎంతంటే!
Nissan Magnite Geza special edition : ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ నిస్సాన్.. కంపెనీకి బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ఉన్న మాగ్నైట్‌కు స్పెషల్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. ఈ నిస్సాన్ మాగ్నైట్ గెజా స్పెషల్ ఎడిషన్ ఎక్స్‌షోరూం ధర రూ. 7.39లక్షలు. ఈ వెహికిల్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. రూ. 11000 టోకెన్ అమౌంట్‌తో నిస్సాన్ డీలర్షిప్షోరూమ్లలో బుక్ చేసుకోవచ్చు.
ఈ స్పెషల్ ఎడిషన్ నిస్సాన్ మాగ్నైట్ గెజాలో సరికొత్త ఆడియో- ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్లు హైలైట్‌గా నిలుస్తున్నాయి. జపనీస్ థియేటర్, ఎక్స్‌ప్రెసివ్ మ్యూజిక్ థీమ్స్ స్ఫూర్తితో ఈ స్పెషల్ ఎడిషన్‌ను రూపొందించినట్టు సంస్థ చెబుతోంది.
నిస్సాన్ మాగ్నైట్ గెజా- ఫీచర్స్..
ఈ స్పెషల్ ఎడిషన్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో 9 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, వయర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే వంటివి వస్తున్నాయి. ఇవి.. జేబీఎల్ స్పీకర్స్‌కు కనెక్ట్ అయ్యి ఉంటాయి. షార్క్ ఫిన్ యాంటీనా, యాప్ ఆధారిత కంట్రోల్స్‌తో యాంబియెంట్ లైటింగ్, రేర్ పార్కింగ్ కెమెరా లభిస్తున్నాయి. లేత గోధుమ రంగుతో కూడిన సీట్ అప్‌హోలిస్ట్రీ వస్తుండటంతో.. ఇంటీరియర్ మరింత స్టైలిష్‌గా మారింది.
ఇదీ చదవండి:- Maruti Suzuki Jimny launch: మారుతి జిమ్నీ లాంచ్ డేట్ వచ్చేసింది.. మహింద్ర థార్ కు గట్టి పోటీ
నిస్సాన్ మాగ్నైట్ స్పెషల్ ఎడిషన్ ఎస్యూవీ..
Nissan Magnite Geza edition launch date : ఈ ఆల్ న్యూ నిస్సాన్ మాగ్నైట్ గెజాలో 1.0 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్, 1.0 లీటర్ టర్బోఛార్జ్డ్ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. మొదటిది 71 బీహెచ్పీ పవర్‌ను, 96ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇక రెండోది 98 బీహెచ్పీ పవర్‌ను, 160 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ రెండింటిలోనూ 5 స్పీడ్ మేన్యువల్ గేర్‌బాక్స్ వస్తోంది. టర్బోఛార్జ్డ్ ఇంజిన్‌లో సీవీటీ ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్ లభిస్తోంది.
ప్రస్తుతం.. నిస్సాన్ మాగ్నైట్ ఎక్స్‌షోరూం ధర రూ. 6లక్షలు- రూ. 11.02లక్షల మధ్యలో ఉంది. నిస్సాన్ మాగ్నైట్.. మారుతీ సుజుకీ ఫ్రాంక్స్, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, సిట్రోయెన్ సీ3, రెనాల్ట్ ఖైగర్, టాటా నెక్సాన్‌లకు గట్టిపోటీనిస్తోంది.