Maruti Suzuki Swift Mocca cafe Edition : కాఫీ కలర్​లో స్విఫ్ట్ స్పెషల్​ ఎడిషన్​.. లుక్​ అదిరింది!-maruti suzuki launches swift mocca edition all you need to know ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Maruti Suzuki Launches Swift Mocca Edition All You Need To Know

Maruti Suzuki Swift Mocca cafe Edition : కాఫీ కలర్​లో స్విఫ్ట్ స్పెషల్​ ఎడిషన్​.. లుక్​ అదిరింది!

Sharath Chitturi HT Telugu
Mar 27, 2023 07:42 AM IST

Maruti Suzuki Swift Mocca cafe Edition : స్విఫ్ట్​ మోకా కేఫ్​ ఎడిషన్​ను తీసుకొచ్చింది మారుతీ సుజుకీ. 2023 బ్యాంకాక్​ మోటార్​ షోలో దీనిని ప్రదర్శనకు ఉంచింది. ఈ మోడల్​ విశేషాలు ఇక్కడ తెలుసుకోండి.

కాఫీ కలర్​లో మారుతీ సుజుకీ స్విఫ్ట్​.. కొత్త ఎడిషన్​ ఇదే!
కాఫీ కలర్​లో మారుతీ సుజుకీ స్విఫ్ట్​.. కొత్త ఎడిషన్​ ఇదే!

Maruti Suzuki Swift Mocca Edition : 2023 బ్యాంకాక్​ మోటార్​ షోలో.. స్విఫ్ట్​కు చెందిన ఓ స్పెషల్​ ఎడిషన్​​ను ప్రదర్శించింది మారుతీ సుజుకీ. అదే.. 2023 మారుతీ సుజుకీ మోకా కేఫ్​ ఎడిషన్​. ఇది కాఫీ రంగులో ఉంది. సాధారణ స్విఫ్ట్​తో పోల్చుకుంటే ఇందులో కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వెహికిల్​ ప్రత్యేకతలను తెలుసుకుందాము..

ట్రెండింగ్ వార్తలు

ఇండియాలో అధిక డిమాండ్​ ఉన్న మోడల్స్​లో స్వీఫ్ట్​ ఒకటి. 2021లోనే ఇది 25వేల లక్షల సేల్స్​ మైలురాయిని దాటేసింది. కాగా.. ఇటీవలి కాలంలో స్విఫ్ట్​కు ఇతర సంస్థల మోడల్స్​ నుంచి పోటీ ఎక్కువ అవుతోంది. పోటీకి చెక్​ పెట్టేందుకు ఓ స్పెషల్​ ఎడిషన్​ను తీసుకొచ్చింది మారుతీ సుజుకీ.

మారుతీ సుజుకీ స్విఫ్ట్​ మోకా కేఫ్​ ఎడిషన్​- ఫీచర్స్​..

Swift Mocca Edition price : ఈ మారుతీ సుజుకీ స్పెషల్​ ఎడిషన్​ స్వీఫ్ట్​లో డ్యూయెల్​ టోన్​ పెయింట్​ స్కీమ్​ (పాస్టెల్​ బ్రౌన్​, లేత గోధుమ రంగు​) ఉంటుంది. ఇందులోని ఫ్రెంట్​, రేర్​ బంపర్లు మరింత స్పోర్టీగా కనిపిస్తున్నాయి. చుట్టూ బ్లాక్​ క్లాడింగ్​ డిజైన్​ లభించింది. స్వెప్ట్​ బ్యాక్​ హాలోజెన్​ హెడ్​లైట్స్​, క్రోమ్​ స్టడ్డెడ్​ గ్రిల్​, వైడ్​ ఎయిర్​ డ్యామ్​, సీ పిల్లర్​ మౌంటెడ్​ డోర్​ హ్యాండిల్స్​, 17 ఇంచ్​ డిజైనర్​ బ్రాంజ్​ కలర్డ్​ వీల్స్​ వస్తున్నాయి. రేర్​లో షార్క్​ ఫిన్​ యాంటీనా, డ్యూయెల్​ ఎగ్జాస్ట్​ టిప్​ గ్రేస్​లు లభిస్తున్నాయి.

2023 స్విఫ్ట్​ మోకా కేఫ్​ ఎడిషన్​లో మేజర్​ అప్డేట్​ అంటే.. క్యాబిన్! ఇందులో కాఫీ రంగులోని లెథర్​ అప్​హోలిస్ట్రీ.. సీట్స్​, డోర్​ ట్రిమ్స్​కు వస్తోంది. డాష్​బోర్డ్​కు లేత గోధుమ రంగు లభిస్తోంది.

Swift Mocca Edition India launch : ఆల్​ న్యూ టచ్​స్క్రీన్​ ఇన్​ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​, లెథర్​ వ్రాప్డ్​ మల్టీఫంక్షనల్​ స్టీరింగ్​ వీల్​, ఇంజిన్​ స్టార్ట్​/ స్టాప్​ కీఎల్​ ఎంట్రీ, మల్టిపుల్​ ఎయిర్​బ్యాగ్స్​, ఈబీడీ, ఏబీఎస్​ వంటి ఫీచర్స్​ ఈ మారుతీ సుజుకీ స్విఫ్ట్​ మోకా కేఫ్​ ఎడిషన్​కు లభిస్తున్నాయి.

మారుతీ సుజుకీ స్విఫ్ట్​ మోకా కేఫ్​ ఎడిషన్- ఇంజిన్​..

2023 స్విఫ్ట్​ మోకా కేఫ్​ స్పెషల్​ ఎడిషన్​లో 1.2 లీటర్​ డ్యూయెల్​జెట్​, డ్యూయెల్​ వీవీటీ ఇన్​లైన్​ 4 కే సిరీస్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 89హెచ్​పీ పవర్​ను, 113ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఈ20 ఫ్యూయెల్​పైనా ఇది నడుస్తుంది.

మారుతీ సుజుకీ స్విఫ్ట్​ మోకా కేఫ్​ ఎడిషన్- ధర..

Maruti Suzuki Swift special Edition : థాయ్​లాండ్​లో స్విఫ్ట్​ మోకా కేఫ్​ ధర 6,37,000 టీహెచ్​బీ. అంటే దాదాపు రూ. 15.38లక్షలు. ఇండియాలో ఈ మోడల్​ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయాన్ని దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ వెల్లడించలేదు. ధరతో పాటు లాంచ్​కు సంబంధించిన వివరాలపై రానున్న కాలంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

WhatsApp channel

సంబంధిత కథనం