Maruti Suzuki Fronx vs Baleno : ఫ్రాంక్స్ వర్సెస్ బలెనో.. ఈ కార్లలో ఏది బెస్ట్?
Maruti Suzuki Fronx vs Baleno : మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ వర్సెస్ బలెనో! ఈ రెండిట్లో ఏది బెస్ట్? ఏది కొనొచ్చు? ఇక్కడ తెలుసుకోండి.,
Maruti Suzuki Fronx vs Baleno : ఇండియా ఎస్యూవీ సెగ్మెంట్లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చింది మారుతీ సుజుకీ ఫ్రాంక్స్. మారుతీ సుజుకీ బలెనో హ్యాచ్‌బ్యాక్ ఆధారంగా ఫ్రాంక్స్‌ను రూపొందించిన విషయం తెలిసిందే. అయితే.. ఫ్రాంక్స్‌కు మంచి డిమాండ్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బలెనోకే గట్టిపోటీనిచ్చే రేంజ్‌కి త్వరలోనే ఫ్రాంక్స్ ఎదుగుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఈ రెండింటినీ పోల్చి, ఏది బెస్ట్? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..
మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ వర్సెస బలెనో- డైమెన్షన్స్..
మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ పొడవు 3,995ఎంఎం. వెడల్పు 1,765ఎంఎం. ఎత్తు 1,550ఎంఎం. వీల్‌బేస్ 2,520ఎంఎం. బూట్ స్పేస్ 308 లీటర్లు.
Maruti Suzuki Fronx price in Hyderabad : ఇక మారుతీ సుజుకీ బలెనో పొడవు 3,99ఎంఎం. వెడలపు 1,745ఎంఎం. ఎత్తు 1,500ఎంఎం. వీల్‌బేస్ 2,520ఎంఎం. బూట్ స్పేస్ 318 లీటర్లు.
మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ వర్సెస బలెనో- స్పెసిఫికేషన్స్..
ఫ్రాంక్స్‌లో 1.0 లీటర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్లు ఉన్నాయి. డ్యూయెల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్న అతి తక్కువ మారుతీ సుజుకీ వాహనాల్లో ఫ్రాంక్స్ ఒకటి. టర్బోఛార్జ్డ్ యూనిట్ 100 హెచ్‌పీ పవర్‌ను, 147.6 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇందులో మేన్యువల్ యూనిట్ 21.5 కేఎంపీహెచ్ మైలేజ్ ఇస్తుంది. ఏఎంటీ వేరియంట్ 20.01 కేఎంపీహెచ్ మైలేజ్ ఇస్తుంది. 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్.. 90 హెచ్‌పీ పవర్‌ను, 113 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. మేన్యువల్ వేరియంట్ 21.7 కేఎంపీహెచ్, ఏఎంటీ 22.89 కేఎంపీహెచ్ మైలేజ్‌ను ఇస్తాయి.
ఇదీ చదవండి:- Maruti Fronx vs Tata Punch : మారుతీ ఫ్రాంక్స్ వర్సెస్ టాటా పంచ్.. ది బెస్ట్ ఏది?
Maruti Suzuki Fronx on road price : మారుతీ సుజుకీ బలెనోలో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. 5 స్పీడ్ మేన్యువల్, ఏఎంటీ గేర్‌బాక్స్ లభిస్తుంది. ఈ ఇంజిన్ 90 హెచ్‌పీ పవర్‌ను, 113 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. మేన్యువల్ వేరియంట్ 22.35 కేఎంపీహెచ్, ఏఎంటీ వేరియంట్ 22.94 కేఎంపీహెచ్ మైలేజ్‌ను ఇస్తుంది.
మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ వర్సెస బలెనో- ధర..
మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ ఎక్స్‌షోరూం ధర రూ. 7.46లక్షలు- రూ. 13.13లక్షల మధ్యలో ఉంటుంది. వేరియంట్ వైజ్ ధరల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Maruti Suzuki Baleno on road price Hyderabad : మరోవైపు మారుతీ సుజుకీ బలెనో ఎక్స్‌షోరూం ధర రూ. 6.61లక్షలు- రూ. 9.88లక్షల మధ్యలో ఉంటుంది.