Maruti Suzuki Jimny launch: మారుతి జిమ్నీ లాంచ్ డేట్ వచ్చేసింది.. మహింద్ర థార్ కు గట్టి పోటీ
ఇటీవలి కాలంలో వినియోగదారులు ఎక్కువగా ఎదురు చూస్తున్న కారు మోడల్ మారుతి సుజుకీ జిమ్నీ (Maruti Suzuki Jimny). ఈ కారు బుకింగ్స్ ఇప్పటికే 30 వేలు దాటిపోయాయి. మారుతి జిమ్నీ మార్కెట్లో మహింద్ర థార్ కు గట్టి పోటీ ఇవ్వనుంది. జూన్ 7వ తేదీన ఈ కార్ ను లాంచ్ చేయనున్నారు.
ఇటీవలి కాలంలో వినియోగదారులు ఎక్కువగా ఎదురు చూస్తున్న కారు మోడల్ మారుతి సుజుకీ జిమ్నీ (Maruti Suzuki Jimny). ఈ కారు బుకింగ్స్ ఇప్పటికే 30 వేలు దాటిపోయాయి. మారుతి జిమ్నీ మార్కెట్లో మహింద్ర థార్ కు గట్టి పోటీ ఇవ్వనుంది. జూన్ 7వ తేదీన ఈ కార్ ను లాంచ్ చేయనున్నారు.
Maruti Suzuki Jimny launch date: జూన్ 7 న లాంచ్
ఈ కారును మొదట ఆటో ఎక్స్ పో 2023 లో ఆవిష్కరించారు. ధర ఎంతో తెలియకముందే, భారత్ లో 30 వేలకు పైగా వినియోగదారులు ఈ కార్ ను బుక్ చేసుకున్నారు. తాజాగా, ఈ కార్ లాంచ్ డేట్ పై స్పష్టత వచ్చింది. జూన్ 7వ తేదీన ఈ మారుతి జిమ్నీని లాంచ్ చేయనున్నారు. భారత్ లో 5 డోర్ పెట్రోల్ ఇంజన్ మోడల్ అందుబాటులో ఉంటుంది. ఈ కార్ జెటా, ఆల్ఫా వేరియంట్లలో లభిస్తుంది. మారుతి సుజుకీ నెక్సా డీలర్ షిప్ ల వద్ద మాత్రమే ఈ కారు లభిస్తుంది.
K15B petrol engine: కే15 బీ సిరీస్ పెట్రోల్ ఇంజిన్
ఈ ఎస్ యూ వీలో 1.5 లీటర్, 4 సిలిండర్ కే 15 బీ సిరీస్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 6000 ఆర్పీఎం వద్ద 103 బీహెచ్పీ ఔట్ పుట్ ఇస్తుంది. ఇది 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ లేదా 4 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ తో వస్తోంది. ఆటోమేటిక్ వర్షన్ లీటర్ కు 16.39 కిమీలు, మాన్యువల్ గేర్ బాక్స్ వర్షన్ లీటర్ కు 16.94 కిమీల మైలేజీ వస్తుందని కంపెనీ చెబుతోంది. ఆల్ఫా, జెటా.. ఈ రెండు వేరియంట్ల లోనూ ఆటో, మాన్యువల్ వర్షన్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే, ఈ జిమ్నీలో ఆల్ గ్రిప్ ప్రొ 4 వీల్ డ్రైవ్ సిస్టమ్ ఉంది.
Safety Features and Dimensions: ఇవే డైమెన్షన్స్, సేఫ్టీ ఫీచర్స్
మారుతి జిమ్నీ 5 డోర్ ఎస్యూవీ 3,985 ఎంఎం పొడవు, 1,645 ఎంఎం వెడల్పు, 1,720 ఎంఎం ఎత్తు ఉంటుంది. ఈ కారు గ్రౌండ్ క్లియరెన్స్ 210 ఎంఎం, వీల్ బేస్ 2,590 ఎంఎం. ఫ్యుయెల్ ట్యాంక్ సామర్ద్యం 40 లీటర్లు. బూట్ స్పేస్ 208 లీటర్లు. ఒకవేళ వెనుక సీట్ ను ఫోల్డ్ చేస్తే బూట్ స్పేస్ 332 లీటర్లకు పెరుగుతుంది. అలాగే, ఈ కారులో ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఏబీఎస్ ఈబీడీ, హిల్ హోల్డ్ అసిస్ట్, రియర్ వ్యూ కెమెరా, బ్రేక్ అసిస్ట్, హిల్ డిసెంట్ కంట్రోల్, స్పీడ్ అలర్ట్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. మారుతి సుజుకీ జిమ్నీ మొత్తం ఏడు కలర్స్ లో అందుబాటులో ఉంది. అవి పెరల్ ఆర్క్టిక్ వైట్, గ్రానైట్ గ్రే, నెక్సా బ్లూ, బ్లూయిష్ బ్లాక్, సిజ్లింగ్ రెడ్, కైనెటిక్ యెల్లో విత్ బ్లూయిష్ బ్లాక్ రూఫ్, సిజ్లింగ్ రెడ్ విత్ బ్లూయిష్ బ్లాక్ రూఫ్.