తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Nio Ev Battery : వావ్​.. 1000కి.మీ రేంజ్​ ఇచ్చే బ్యాటరీని తయారు చేసిన ఈవీ కంపెనీ!

Nio EV battery : వావ్​.. 1000కి.మీ రేంజ్​ ఇచ్చే బ్యాటరీని తయారు చేసిన ఈవీ కంపెనీ!

Sharath Chitturi HT Telugu

01 January 2024, 14:30 IST

    • Nio EV battery : 1000కి.మీ రేంజ్​ని ఇచ్చే బ్యాటరీని రూపొందించింది చైనాకు చెందిన ఓ ఈవీ కంపెనీ. 14 గంటలు నడిపినా.. ఛార్జింగ్​ చేయాల్సిన అవసరం రాకపోగా.. ఇంకా 3శాతం బ్యాటరీ మిగిలి ఉండటం విశేషం!
వావ్​.. 1000కి.మీ రేంజ్​ ఇచ్చే బ్యాటరీని తయారు చేసిన ఈవీ కంపెనీ!
వావ్​.. 1000కి.మీ రేంజ్​ ఇచ్చే బ్యాటరీని తయారు చేసిన ఈవీ కంపెనీ! (REUTERS)

వావ్​.. 1000కి.మీ రేంజ్​ ఇచ్చే బ్యాటరీని తయారు చేసిన ఈవీ కంపెనీ!

Nio EV battery : ప్రపంచ ఆటోమొబైల్​ ఇండస్ట్రీలో మరో సంచలనం! ఎలక్ట్రిక్​ వాహనాలకు డిమాండ్​ భారీగా పెరుగుతున్న వేళ.. ఏకంగా 1000 కి.మీ రేంజ్​ని ఇచ్చే బ్యాటరీని తయారు చేసింది చైనాకు చెందిన ఈవీ సంస్థ నియో. అంతేకాకుండా.. బ్యాటరీ సామర్థ్యాన్ని గ్రాండ్​గా ప్రదర్శించింది ఆ కంపెనీ. నియో సీఈఓ విలయమ్​ లీ.. ఆ బ్యాటరీ ఉన్న కారులో 14 గంటలు పాటు.. ఏకంగా 1,044 కి.మీల దూరం ప్రయాణించడం విశేషం.

ట్రెండింగ్ వార్తలు

Upcoming compact SUVs in India : ఇండియాలో లాంచ్​కు రెడీ అవుతున్న ఎస్​యూవీలు ఇవే..!

TVS iQube : టీవీఎస్​ ఐక్యూబ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో కొత్త వేరియంట్లు.. త్వరలోనే లాంచ్​!

Tata Nexon SUV : టాటా నెక్సాన్​లో కొత్త ఎంట్రీ లెవల్​ వేరియంట్లు.. భారీగా దిగొచ్చిన ఎస్​యూవీ ధర!

Gold price today : స్థిరంగా పసిడి ధరలు- తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఇలా..

అతిపెద్ద రేంజ్​ ఇచ్చే బ్యాటరీ..!

పెట్రోల్​, డీజిల్​ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రపంచ దేశాలు కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఇండియాతో పాటు ప్రపంచం వ్యాప్తంగా ఈవీలకు మంచి డిమాండ్​ కనిపిస్తోంది. ఆటోమొబైల్​ సంస్థలు పోటీపడి మరి కొత్త ఎలక్ట్రిక్​ వెహికిల్స్​ని లాంచ్​ చేస్తున్నారు. అదే సమయంలో.. వెహికిల్​ రేంజ్​పైనా పరిశోధనలు జరుగుతున్నాయి.

Highest battery range car : చైనాలో నియో సంస్థకు మంచి పేరు ఉంది. ఎలాన్​ మస్క్​ టెస్లాకు ఈ నియో గట్టిపోటీనిస్తోంది. ఇక ఆ కంపెనీ సీఈఓ విలియమ్​ లీని.. అక్కడి ప్రజలు.. చైనా ఎలాన్​ మస్క్​ అని పిలుచుకుంటారు.

డిసెంబర్​ 17న షాంఘైలో.. నియో ఈటీ7 ఎలక్టరిక్​ కారు ఎక్కి.. తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు విలియమ్​ లీ. 14 గంటల పాటు.. 1044 కి.మీల దూరం ప్రయాణించారు. ఆ జర్నీని లైవ్​ స్ట్రీమ్​ చేశారు. 14 గంటల తర్వాత.. నియో ఈటీ7 ఈవీ.. షోమిన్​ ప్రాంతానికి చేరుకుంది. అక్కడితో విలియమ్​ జర్నీ ముగిసినా.. బ్యాటరీ మాత్రం ఇంకో 3శాతం మిగిలే ఉండటం విశేషం.

NIO EV battery range : ఈ నియో ఈటీ7 ఈవీలో 150 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ఉందని తెలుస్తోంది. ఇది.. ప్రపంచంలోనే అతిపెద్ద ఎనర్జీ డెన్సిటీ కలిగిన బ్యాటరీ సంస్థ చెబుతోంది. ఈ టెక్నాలజీ ద్వారా.. ఎలక్ట్రిక్​ వెహికిల్​ రేంజ్​ భారీగా పెరిగిందని స్పష్టం చేస్తోంది.

2024 ఏప్రిల్​ నాటికి ఈ 150 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ మాస్​ ప్రొడక్షన్​ని ప్రారంభించాలని నియో సంస్థ ప్లాన్​ చేస్తోంది. అయితే.. ఇది భారీ ఖర్చుతో కూడిన వ్యవహారమే అని చెప్పుకోవాలి. ఈ విషయాన్ని నియో సంస్థ కూడా అంగీకరించింది. ఒక్క బ్యాటరీ విలువ సుమారు 42,100 డాలర్లు ఉంటుందని సంస్థ చెబుతోంది. ఇది.. మొత్తం టెస్లా వై మోడల్​కు సమానం! కానీ ఈవీ విషయంలో దండయాత్ర చేయాలని గత కొన్నేళ్లుగా ప్లాన్​ చేస్తున్న నియో.. ఖర్చు ఎంతవుతుంది? అన్నది పక్కనపెట్టి.. ఈ బ్యాటరీ టెక్నాలజీతో ముందుకెళ్లాలని చూస్తోంది.

EV battery with 1000km range : అయితే.. ఈ ఈటీ7 ఎలక్ట్రిక్​ కారులో రెండో బ్యాటరీ కూడా ఉండే అవకాశం ఉంది. 1000 కి.మీల రేంజ్​ ఇచ్చే బ్యాటరీ అంటే.. సాధారణంగా ధర ఎక్కువగానే ఉంటుంది. దానిని కొనుగోలు చేయలేని వారి కోసం ఆ బ్యాటరీ లేకుండానే కారును విక్రయించాలని చూస్తోంది నియో.

తదుపరి వ్యాసం