Ekagrah Murty : 5 నెలల పసికందు.. సంపద రూ. 4 కోట్లు- తాత వల్లే ఇదంతా!
19 April 2024, 13:59 IST
Ekagrah Murthy Infosys : నారాయణ మూర్తి మనవడు ఏకాగ్రహ్ మూర్తి వయస్సు 5 నెలలు. కానీ ఈ పసికందు.. ఇప్పుడు రూ. 4కోట్లు సంపాదించాడు! అది ఎలా అంటే..
ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి..
Ekagrah Murthy net worth : ఎఫ్వై24 క్యూ4 ఫలితాలను తాజాగా వెల్లడించింది దిగ్గజ టెక్ సంస్థ ఇన్ఫోసిస్. రిజల్ట్స్‌తో పాటు రూ. 28 విలువ చేసే డివిడెండ్‌ని కూడా ప్రకటించింది. ఈ వార్తల మధ్య.. ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి మనవడు ఏకాగ్రహ్ రోహన్ మూర్తి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాడు. ఈ 5 నెలల పసికందు.. సంపద రూ. 4కోట్లు! ఇదెలా సాధ్యమైదంటే..
నారాయణ మూర్తి గిఫ్ట్..
నారాయణ మూర్తి కుమారుడు రోహన్ మూర్తి తనయుడు.. ఈ ఏకాగ్రహ్ మూర్తి. గతేడాది నవంబర్‌లో జన్మించాడు. ఆ పసికందుకు.. ఇన్ఫోసిస్‌కి చెందిన 15లక్షల షేర్లను ఇటీవలే గిఫ్ట్‌గా ఇచ్చారు నారాయణ మూర్తి. అంటే సంస్థలో 0.04శాతం వాటా! ఈ షేర్ల విలువ సుమారు రూ. 200 కోట్లు ఉంటుంది.
ఇక.. ఇన్ఫోసిస్ ఫలితాలను ప్రకటించినప్పుడే.. రూ. 20 డివిడెండ్‌ని ఇస్తున్నట్టు పేర్కొంది సంస్థ. అంతేకాకుండా.. రూ. 8 స్పెషల్ డివిడెండ్‌ని కూడా ఇస్తున్నట్టు ప్రకటిచింది. ఫలితంగా.. మొత్తం డివిడెండ్ రూ. 28కి చేరింది. జులై 1న పేమెంట్ జరుగుతుందని చెప్పింది. ఇన్ఫోసిస్ ప్రకటించిన డివిడెండ్లతోనే.. 5 నెలల ఏకాగ్రహ్ మూర్తి దాదాపు రూ. 4.2 కోట్లు సంపాదించినట్టు అవుతుంది!
Ekagrah Murthy Narayan Murthy : ఈ వార్త విన్నవారందరు షాక్ అవుతున్నారు. 'మా తాత ఆస్తులు అమ్మేశాడు. నారాయణ మూర్తి.. తన మనవడికి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చాడు,' అంటూ కామెంట్లు చేస్తున్నారు.
నారాయణ మూర్తి- సుధా మూర్తికి ఇద్దరు పిల్లలు. వారు.. రోహన్ మూర్తి, అక్షతా మూర్తి (బ్రిటన్ ప్రధాని రిషి సునక్ భార్య). ఇక నారాయణ మూర్తి- సుధా మూర్తిలకు ఇద్దరు మనవళ్లు, ఒక మనవరాలు ఉన్నారు. వారి పేర్లు.. కృష్ణ, ఏకాగ్రహ్, అనౌష్క.
డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికం నాటికి.. అక్షతా మూర్తి దగ్గర 1.05శాతం ఇన్ఫోసిస్ వాటా ఉంది. సుధా మూర్తి దగ్గర 0.93శాతం, రోహన్ మూర్తి దగ్గర 1.64శాతం వాటాలు ఉన్నాయి. ఇన్ఫోసిస్‌లో నారాయణ మూర్తి వాటా 0.04శాతం కన్నా తక్కువే!
ఇన్ఫోసిస్ షేర్ ప్రైజ్..
Infosys share price target : ఇన్పోసిస్ ఫలితాలు.. మార్కెట్ అంచనాలను పూర్తిగా నిరాశపరిచాయి. ఫలితంగా.. శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఇన్ఫోసిస్ స్టాక్.. భారీ నష్టాలతో ఓపెన్ అయ్యింది. కానీ ఆ తర్వాత కాస్త కోలుకుని.. మధ్యాహ్నం 1:45 సమయానికి 1శాతం నష్టంతో రూ. 1411 వద్ద ట్రేడ్ అవుతోంది ఇన్ఫోసిస్ షేరు.