Narayana Murthy : 4 నెలల మనవడికి రూ. 240 కోట్ల ‘గిఫ్ట్’​- యంగెస్ట్​ మిలియనీర్​ అయిపోయాడు!-narayana murthy gifts grandson infosys shares worth 240 crore ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Narayana Murthy : 4 నెలల మనవడికి రూ. 240 కోట్ల ‘గిఫ్ట్’​- యంగెస్ట్​ మిలియనీర్​ అయిపోయాడు!

Narayana Murthy : 4 నెలల మనవడికి రూ. 240 కోట్ల ‘గిఫ్ట్’​- యంగెస్ట్​ మిలియనీర్​ అయిపోయాడు!

Sharath Chitturi HT Telugu
Mar 18, 2024 03:23 PM IST

Narayana Murthy gifts grandson : నారాయణ మూర్తి.. తన మనవడికి రూ. 240 కోట్లు విలువ చేసే గిఫ్ట్​ ఇచ్చారు! అదేంటంటే..

ఇన్ఫోసిస్​ ఫౌండర్​ నారాయణ మూర్తి
ఇన్ఫోసిస్​ ఫౌండర్​ నారాయణ మూర్తి (Photograph by Harikrishna Katragadda/ Mint)

Narayana Murthy Infosys latest news : ఇన్ఫోసిస్​ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి.. తన మనవడికి ఓ గిఫ్ట్​ ఇచ్చారు. ఈ వార్త ఇప్పుడు సోషల్​ మీడియాని షేక్​ చేస్తోంది! నారాయణ మూర్తి ఇచ్చిన ఆ గిఫ్ట్​తో.. ఆ 4 నెలల బాలుడు.. యంగెస్ట్​ మిలియనీర్​ అయిపోయాడు. ఇంతకీ ఇన్ఫోసిస్​ ఫౌండర్​ ఇచ్చిన గిఫ్ట్​ ఏంటి అంటారా..

మనవడికి ఇన్ఫోసిస్​ నారాయణ మూర్తి గిఫ్ట్​..

తన మనవడు, 4 నెలల ఎకాగ్రహ్​ రోహన్​ మూర్తికి 15,00,000 ఇన్ఫోసిస్​ షేర్లు రాసిచ్చారు నారాయణ మూర్తి. అంటే సంస్థలో అది 0.4శాతం. కాగా.. ఈ ఇన్ఫోసిస్​ షేర్ల మొత్తం విలువ రూ. 240 కోట్లు! అంటే.. నాలుగు నెలల వయస్సులోనే ఆ బాలుడు కోటీశ్వరుడైపోయాడు.

Ekagrah Rohan Murthy Infosys : ఆఫ్​ మార్కెట్​ ట్రేడ్​లో ఈ ట్రాన్సాక్షన్​ని పూర్తి చేశారు నారాయణ మూర్తి. ఈ ట్రాన్సాక్షన్​ తర్వాత.. ఇన్ఫోసిస్​లో నారాయణ మూర్తి స్టేక్​.. 0.40 శాతం నుంచి 0.36 శాతానికి పడిపోయింది. ఆయన దగ్గర ఇంకా సుమారు 1.51 కోట్ల ఇన్ఫోసిస్​ షేర్లు ఉన్నాయి.

నారాయణ మూర్తి ఫ్యామిలీ..

ఇండియాలో రెండో అతిపెద్ద టెక్​ సంస్థగా కొనసాగుతోంది ఇన్ఫోసిస్​. ఈ సంస్థ ఫౌండర్​ నారాయణ మూర్తి, ఆయన సతీమణి సుధా మూర్తిల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కాగా.. వీరి కుమారుడు రోహణ మూర్తికి అపర్ణ కృష్ణన్​తో పెళ్లి జరిగింది. 2023 నవంబర్​లో వీరికి బాబు పుట్టాడు. అతని పేరు ఏకాగ్రహ్​ రోహన్​ మూర్తి అని పెట్టారు. సంసృతంలో ఏకాగ్రహ్​ అంటే ఫోకస్​!

Infosys share price target : ఏకాగ్రహ్​​ మూర్తి.. నారాయణ మూర్తి- సుధా మూర్తిలకు మూడో గ్రాండ్​చైల్డ్​. వారి కూతురు అక్షతా మూర్తి (బ్రిటన్​ ప్రధాని రిషి సునక్​ భార్య)కి ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు.

ఇక సుధా మూర్తిని ఇటీవలే రాజ్యసభ ఎంపీగా ప్రకటించింది బీజేపీ. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ప్రకటన చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆ తర్వాత.. ఆమె ఎంపీగా ప్రమాణం చేశారు.

ఇన్ఫోసిస్​ని వదిలేసిన రోహన్​ మూర్తి..!

Rohan Murthy story : ఏదైనా బిజినెస్​ క్లిక్​ అయితే.. అది తరువాతి తరం వారు చూసుకోవడం సాధారణమైన విషయం. ఇందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. అయితే.. ఇన్ఫోసిస్​ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమారుడు రోహన్​ మూర్తి.. ఇందుకు పూర్తిగా భిన్నం! ఆయన కూడా తన తండ్రి మార్గంలో నడుస్తూ, ఇన్ఫోసిస్​ని వదిలేసి, తన కలను నెరవేర్చుకునేందుకు సొంతంగా ఒక కంపెనీని పెట్టి సక్సెస్​ సాధించారు. కొన్నేళ్ల క్రితం.. ఇన్ఫోసిస్​ వైస్​ ప్రెసిడెంట్​గా బాధ్యతలు చేపట్టారు రోహన్​ మూర్తి. కానీ ఆ పదవికి గుడ్​ బై చెప్పి.. సొరొకొ అనే ఓ డిజిటల్​ ట్రాన్స్​ఫార్మేషన్​ కంపెనీని ప్రారభించారు. ఏఐ సోర్స్​ని వాడుకుని ఆటోమెషన్​ పనులు చేస్తుంది ఈ సంస్థ. సొరొకోకు సీటీఓగా పనిచేస్తున్నారు రోహన్​ మూర్తి. 2022లో ఈ కంపెనీ సుమారు రూ. 150 కోట్ల ఆదాయాన్ని సృష్టించిందని పలు నివేదికలు సూచిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

WhatsApp channel

సంబంధిత కథనం