గత ఆర్థిక సంవత్సరం క్యూ4 ఫలితాలను ఇన్ఫోసిస్ గురువారం ప్రకటించింది. క్యూ4 ఎఫ్వై 25లో ఇన్ఫోసిస్ నికర లాభం రూ.7,969 కోట్ల నుంచి 11.75 శాతం క్షీణించి రూ.7,033 కోట్లకు పరిమితమైంది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం రూ.37,923 కోట్ల నుంచి 8 శాతం పెరిగి రూ.40,925 కోట్లకు చేరింది.