Rohan Murthy : కోట్లు విలువ చేసే ఇన్ఫోసిస్​ని వదిలేసిన నారాయణ మూర్తి తనయుడు- ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా?-narayana murthys son left infosys inspired by sudha murthy he is now working on his dreams ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Narayana Murthy's Son, Left Infosys, Inspired By Sudha Murthy, He Is Now Working On His Dreams

Rohan Murthy : కోట్లు విలువ చేసే ఇన్ఫోసిస్​ని వదిలేసిన నారాయణ మూర్తి తనయుడు- ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా?

Sharath Chitturi HT Telugu
Mar 04, 2024 01:00 PM IST

Narayana Murthy’s son : ఇన్ఫోసిస్​ నారాయణ మూర్తి తనయుడు రోహన్​ మూర్తి గురించి మీకు తెలుసా? ఆయన ఇన్ఫోసిస్​ని వదిలేసి, ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా?

ఇన్ఫోసిస్​ ఫౌండర్​ నారాయణ మూర్తి తనయుడు ఇప్పుడేం చేస్తున్నారు!
ఇన్ఫోసిస్​ ఫౌండర్​ నారాయణ మూర్తి తనయుడు ఇప్పుడేం చేస్తున్నారు!

Rohan Murthy company : ఇన్ఫోసిస్​ నారాయణ మూర్తి.. ఈ పేరు తెలియన వారు ఉండరు! నారాయణ మూర్తి భార్య.. సుధా మూర్తి సైతం చాలా మందికి ఒక ఇన్​స్పిరేషన్​. ఇక నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తి, అల్లుడు రిషి సునక్​ (బ్రిటన్​ ప్రధాని) నిత్యం వార్తల్లో ఉంటారు. కానీ నారాయణ మూర్తి కుమారుడు రోహన్​ మూర్తి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? కోట్ల సంపదను సృష్టిస్తున్న ఇన్ఫోసిస్​ని వదిలేసుకుని, తనకు నచ్చిన పని చేస్తూ, తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుని జీవితాన్ని గడుపుతున్నారని మీకు తెలుసా?

ట్రెండింగ్ వార్తలు

రోహన్​ మూర్తి ఇప్పుడేం చేస్తున్నారంటే..

ఏదైనా బిజినెస్​ క్లిక్​ అయితే.. అది తరువాతి తరం వారు చూసుకోవడం సర్వ సాధారణమైన విషయం. ఇందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. అయితే.. ఇన్ఫోసిస్​ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమారుడు రోహన్​ మూర్తి.. ఇందుకు భిన్నం! ఆయన కూడా తన తండ్రి మార్గంలో నడుస్తూ, ఇన్ఫోసిస్​ని వదిలేసి, తన కలను నెరవేర్చుకునేందుకు సొంతంగా ఒక కంపెనీని పెట్టుకున్నారు.

Rohan Murthy story : కొన్నేళ్ల క్రితం.. ఇన్ఫోసిస్​ వైస్​ ప్రెసిడెంట్​గా నియమితులయ్యారు రోహన్​ మూర్తి. కానీ ఆ పదవికి గుడ్​ బై చెప్పి.. ఓ డిజిటల్​ ట్రాన్స్​ఫార్మేషన్​ కంపెనీని ప్రారభించారు. దాని పేరు సొరొకో. ఏఐ సోర్స్​ని వాడుకుని ఆటోమెషన్​ పనులు చేస్తుంది ఈ సంస్థ. సొరొకోకు సీటీఓగా పనిచేస్తున్నారు రోహన్​ మూర్తి. 2022లో ఈ కంపెనీ సుమారు రూ. 150 కోట్ల ఆదాయాన్ని సృష్టించిందని పలు నివేదికలు సూచిస్తున్నాయి.

ప్రొఫెషనల్​ లైఫ్​ని ప్రారంభించే ముందు.. బెంగళూరులోని బిషప్​ కాటన్​ బాయ్స్​ స్కూల్​లో చదువుకున్నారు ఇన్ఫోసిస్​ నారాయణ మూర్తి కుమారుడు రోహన్​ మూర్తి. అనంతరం.. కార్నల్​ యూనివర్సిటీ నుంచి గ్రాడ్జ్యూయేట్​ అయ్యారు. హార్వడ్​ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్​ ఇంజినీరింగ్​లో పీహెచ్​డీ పొందారు.

Why Rohan Murthy left Infosys : రోహన్​ మూర్తిపై ఆయన తల్లి సుధా మూర్తి ప్రభావం ఎక్కువగా ఉంది. సుధా మూర్తి.. ఒక బెస్ట్​ సెల్లింగ్​ ఆథర్​, ఫిలాథ్రోపిస్ట్​. టాటా మోటార్స్​లో ఇంజినీర్​గా కూడా పనిచేశారు. సుధా మూర్తి ఆలోచనలు చాలా ప్రొగ్రెసివ్​గా ఉంటాయి. జీవితంలో ఎలా బతకాలి, ఎలాంటి విలువలు కలిగి ఉండాలి? వంటి విషయాలపై ఆమె తరచూ ప్రసంగాలు చేస్తూ ఉంటారు. ఫలితంగా.. సుధా మూర్తి మంచి మాటలు.. కుమారుడు రోహన్​ మూర్తిని ప్రభావితం చేశాయి. ఆయన కూడా.. తన కలలను నెరవేర్చుకుని సొంతంగా పేరు సంపాదించుకోవాలని ఇన్ఫోసిస్​ నుంచి బయటకు వచ్చేసినట్టు తెలుస్తోంది.

Rohan Murthy net worth : అంతేకాకుండా.. తన మేనమాన శ్రీనివాస కులకర్ణి ప్రభావం కూడా రోహన్​పై ఉంది. ఆయన.. కాలిఫోర్నియా ఇన్​స్ట్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీలో ఆస్ట్రోఫిజిక్స్​ అండ్​ ప్లానిటరీ సైన్స్​ ప్రొఫెసర్​.

అయితే.. రోహన్​ మూర్తి, ఇన్ఫోసిస్​ని వదిలేసినా.. ఆ కంపెనీకి చెందిన 6కోట్లకుపైగా షేర్లు ఆయన వద్ద ఉన్నట్టు తెలుస్తోంది. అంటే ఇన్ఫోసిస్​లో సుమారు 1.6శాతం వాటా ఆయనకు ఉంది. డివిడెండ్​ రూపంలోనే ఆయనకు రూ. 105 కోట్ల కన్నా ఎక్కువ అందుతుందని తెలుస్తోంది.

WhatsApp channel

సంబంధిత కథనం