తెలుగు న్యూస్ / ఫోటో /
వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ మనకు సెట్ కాదు.. ఆఫీస్‌లకు రావాల్సిందే: నారాయణ్ మూర్తి
- ప్రొడక్టివిటీ పెంచడానికి ఉద్యోగులు కార్యాలయానికి తిరిగి రావాల్పిన అవసరం ఉందన్నారు ఇన్ఫోసిస్ వ్వవస్థాపకులు నారాయణ్ మూర్తి. భారత్ వంటి దేశాలకు ఇది చాలా ముఖ్యం అన్నారు.
- ప్రొడక్టివిటీ పెంచడానికి ఉద్యోగులు కార్యాలయానికి తిరిగి రావాల్పిన అవసరం ఉందన్నారు ఇన్ఫోసిస్ వ్వవస్థాపకులు నారాయణ్ మూర్తి. భారత్ వంటి దేశాలకు ఇది చాలా ముఖ్యం అన్నారు.
(1 / 5)
కోవిడ్ ప్రభావం తగ్గిన నేపథ్యంలో ఉద్యోగులు కార్యాలయానికి తిరిగి రావాలని నారాయణమూర్తి సూచించారు. వర్క్ ఫ్రం హోమ్ వల్ల సృజనాత్మకత, నైపుణ్యం, ప్రతిభ, సంప్రదింపులు వంటి అంశాల్లో మెరుగుదల ఉండదని అభిప్రాయపడ్డారు.(Reuters)
(2 / 5)
'వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్' భారత్‌కు సరికాదని తెలిపారు. ఈ విధానం అంతగా సత్ఫలితాలివ్వదని మూర్తి వెల్లడించారు. కొవిడ్ సంక్షోభ సమయంలో ఉత్పాదకత విషయంలో బంగ్లాదేశ్ కంటే భారత్ వెనుకబడి ఉందని తెలిపారు.(Instagram)
(3 / 5)
ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయడం వల్ల ఆఫీస్ సంస్కృతి బలహీనపడుతుందన్నారు. కావునా ఉత్పాదకతను పెంచడానికి ఉద్యోగులు కార్యాలయానికి తిరిగి రావాలన్నారు. భారతదేశం వంటి దేశానికి ఇది చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు(REUTERS)
(4 / 5)
ఒకే కుటుంబంలో తరాల వారి కలిసి జీవిస్తారు. దీని పని చేయడానికి ప్రత్యేకమైన స్థలం ఉండదు. ఇంటర్నెట్ వేగం కూడా పరిమితింగా ఉంటుదన్నారు
(5 / 5)
చైనాలో కోవిడ్ కేసులు పెరుగుతుండడం,, ఇజ్రాయెల్‌లో కొత్త కోవిడ్ వేరియంట్‌ను దృష్టిలో ఉంచుకుని, కేంద్ర ప్రభుత్వం మళ్లీ హెచ్చరికను జారీ చేసింది. గత శుక్రవారం రాష్ట్రాలకు నోటిఫికేషన్‌ను పంపింది. ఇన్ఫెక్షన్ వ్యాప్తిని తగ్గించడానికి ఫైవ్ యాంగిల్ విధానాన్ని (టెస్ట్-ట్రాక్-ట్రీట్-టీకా, COVID నిబంధనలకు అనుగుణంగా) కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది. ఈ నేపథ్యంలో ఆఫీస్ రావడం కష్టంగానే మారింది(Reuters)
ఇతర గ్యాలరీలు