BJP tops in income:ఆరు జాతీయ పార్టీలు కలిసి 2022-23 ఆర్థిక సంవత్సరానికి సుమారు రూ.3,077 కోట్ల ఆదాయాన్ని ప్రకటించాయి. వీటిలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అత్యధికంగా రూ.2,361 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆరు జాతీయ పార్టీలు ఆర్జించిన మొత్తం ఆదాయంలో ఇది 76.73 శాతం అని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తెలిపింది.
ఈ పార్టీలు ఎన్నికల కమిషన్లకు సమర్పించిన రికార్డులను ఉటంకిస్తూ ఏడీఆర్ ఈ జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో రూ. 3,077 కోట్ల ఆదాయంతో బీజేపీ తొలి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ రూ. 452 కోట్ల ఆదాయం పొందింది. మొత్తం 6 జాతీయ పార్టీలు పొందిన ఆదాయంలో ఇది 14.70 శాతం మాత్రమే. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు బహుజన్ సమాజ్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, నేషనల్ పీపుల్స్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) తమ ఆదాయాన్ని ప్రకటించాయి.
టాపిక్