Stocks to buy today : స్టాక్​ మార్కెట్​లకు భారీ లాస్​.. కానీ ఈ రూ. 350 స్టాక్​తో భారీ లాభాలు!-stocks to buy today 19th april 2024 nifty and sensex news latest ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : స్టాక్​ మార్కెట్​లకు భారీ లాస్​.. కానీ ఈ రూ. 350 స్టాక్​తో భారీ లాభాలు!

Stocks to buy today : స్టాక్​ మార్కెట్​లకు భారీ లాస్​.. కానీ ఈ రూ. 350 స్టాక్​తో భారీ లాభాలు!

Sharath Chitturi HT Telugu
Apr 19, 2024 09:00 AM IST

Stocks to buy today : స్టాక్​ మార్కెట్​ ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..

స్టాక్స్​ టు బై టుడే..
స్టాక్స్​ టు బై టుడే..

Stocks to buy today : ఇజ్రాయెల్​- ఇరాన్​ యుద్ధం, ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల కారణంగా.. దేశీయ స్టాక్​ మార్కెట్​లలో గత కొన్ని రోజులుగా నష్టాలు కనిపిస్తున్నాయి. గురువారం ట్రేడింగ్​ సెషన్​లో కూడా స్టాక్​ మార్కెట్​లు నష్టపోయాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 455 పాయింట్లు కోల్పోయి 72,499 వద్ద ముగిసింది. 152 పాయింట్లు కోల్పోయిన ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 21,996 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇక 415 పాయింట్ల నష్టంతో.. 47,069 వద్దకు చేరింది బ్యాంక్​ నిఫ్టీ.

స్టాక్​ మార్కెట్​ నిపుణుల ప్రకారం.. ఇజ్రాయెల్​- ఇరాన్​ మధ్య నెలకొన్న అనిశ్చితి తొలగేంతవరకు.. స్టాక్​ మార్కెట్​లలో తీవ్ర ఒడుదొడుకులు తప్పవు.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో.. ఎఫ్​ఐఐలు రూ. 4260.33 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2285.52 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

కాగా.. ఈ నెలలో ఎఫ్​ఐఐలు విపరీతంగా అమ్మకాలపై ఫోకస్​ చేశారు. ఇప్పటివరకు.. 22358.88 కోట్లు విలువ చేసే షేర్లను ఇండియన్​ స్టాక్​ మార్కెట్​లో విక్రయించారు.

మరోవైపు.. ఇరాన్​పై ఇజ్రాయెల్​ దాడి చేసిందన్న వార్తలతో శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. అత్యంత భారీ నష్టాలతో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 300 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగిశాయి. డౌ జోన్స్​ 0.06శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500 0.22శాతం నష్టపోయింది. నాస్​డాక్​ 0.52శాతం నష్టాలు చూసింది.

స్టాక్స్​ టు బై టుడే..

ఆస్ట్రా మైక్రోవేవ్​ ప్రాడక్ట్స్​:- బై రూ. 695, స్టాప్​ లాస్​ రూ. 675, స్టాప్​ లాస్​ రూ. 733

Stocks to buy : కేఎస్​బీ:- బై రూ. 4507.5, స్టాప్​ లాస్​ రూ. 4399, టార్గెట్​ రూ . 4747

కల్పతరు ప్రాజెక్ట్స్​:- బై రూ. 1177, స్టాప్​ లాస్​ రూ. 1150, టార్గెట్​ రూ. 1220

ఎవరెడీ ఇండస్ట్సీస్​:- బై రూ. 353, స్టాప్​ లాస్​ రూ. 345, టార్గెట్​ రూ. 370

సెంచరీ టెక్ట్స్​టైల్స్​:- బై రూ. 1806, స్టాప్​ లాస్​ రూ. 1760, టార్గెట్​ రూ. 1895

భారతీ ఎయిర్​టెల్​:- బై రూ. 1265- రూ. 1266, స్టాప్​ లాస్​ రూ. 1245, టార్గెట్​ రూ. 1305

జియో ఫైనాన్షియల్​ సర్వీసెస్​:- బై రూ. 377- రూ. 378, స్టాప్​ లాస్​ రూ. 373, టార్గెట్​ రూ. 388

(గమనిక:- ఇవి నిపుణుల సూచనలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

Whats_app_banner

సంబంధిత కథనం