Israel attacks Iran : ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడి.. ఇక యుద్ధం అనివార్యం?
Israel attacks Iran : ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేసింది! ఇసాఫాహన్ అనే ప్రాంతంలోని విమానాశ్రయానికి సమీపంలో పేలుడు శబ్దాలు వినిపించాయి.
Israel Iran war : ప్రపంచ దేశాలను మరింత భయాదోళనకు గురిచేస్తూ.. ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడి తీర్చుకుంది! ఇరాన్‌లోని ఇసాఫాహన్ అనే ప్రాంతంలోకి ఇజ్రాయెల్ మిసైల్ దూసుకెళ్లినట్టు సమాచారం. ఎయిర్‌పోర్ట్‌కి సమీపంలో భార శబ్దాలు వినిపించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇరాన్‌కు చెందిన అనేక న్యూక్లియర్ ప్లాంట్లు ఇక్కడ ఉండటంతో భయాందోళనలు మరింత పెరిగాయి. అయితే.. తమపై దాడి జరిగిందని ఇరాన్ వెల్లడించింది కానీ ఆ దాడి చేసింది తామేనని.. ఇజ్రాయెల్ ఇంకా ధ్రువీకరించలేదు.
ఇదీ నేపథ్యం..
Israel attacks Iran : ఇజ్రాయెల్- హమాస్ మధ్య గతేడాది అక్టోబర్ నుంచి యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా.. తమ అధికారులను కూడా హతమార్చారన్న ఆరోపణలతో.. ఇజ్రాయెల్‌పై ఇరాన్ ఇటీవలే మిసైళ్లతో దాడి చేసింది. వాటిని.. అమెరికా సాయంతో ఇజ్రాయెల్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. తమకు ఏమీ జరగలేదని, ఇది తమ విజయం అని ఇజ్రాయెల్ చెబుతూ వచ్చింది. ఇరాన్‌పై ప్రతీకార దాడి విషయంలో.. సరైన సమయంలో, సరైన నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. తాజాగా.. ఇరాన్ కాలమానం ప్రకారం.. గురవారం అర్థరాత్రి సమయంలో ఆ దేశంపై ఇజ్రాయెల్ దాడి చేసింది.
తాజా పరిణామాలు..
ఇసాఫాహన్ అనే ప్రాంతంలో.. పేలుళ్లు శబ్దం వినిపించిందని.. ఇరాన్ మీడియా సంస్థలు బ్రేకింగ్ న్యూస్ వేశాయి. ఈ నేపథ్యంలో.. అక్కడి ఎయిర్‌స్పేస్‌ని మూసివేశారు. పలు విమానాలను దారి మళ్లించారు.
మరి ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందా? అన్నది తెలియాల్సి ఉంది.
అయితే.. ఇజ్రాయెల్ దాడి చేయకూడదని, ఒక వేళ చేస్తే.. పరిస్థితులు మరింత తీవ్రమవుతాయని ఇరాన్ హెచ్చరించింది. తమ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని.. ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని పేర్కొంది.
ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగితే.. అది ప్రపంచ దేశాలకు మంచిది కాదు! ద్రవ్యోల్బణం వంటి పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేసిందన్న వార్తలతో.. ప్రపంచ స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. ఇండియన్ స్టాక్ మార్కెట్లు సైతం భారీ నష్టాల్లో ఓపెన్ అవ్వనున్నాయి.
సంబంధిత కథనం