Stocks to buy : కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. ఇప్పుడు ఈ స్టాక్స్ కొంటే భారీ లాభాలు!
Stock market crash : సోమవారం ట్రేడింగ్ సెషన్లో దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఈ ఫాల్లో ఈ స్టాక్స్ కొంటే భారీ లాభాలు వస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.
Stocks to buy today : ఇజ్రాయెల్- ఇరాన్ దేశాల మధ్య ప్రాంతీయ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లు కుప్పకూలాయి. ఆ ప్రభావం భారత స్టాక్ మార్కెట్లపైనా పడింది. సోమవారం ట్రేడింగ్ సెషన్‌ను దేశీయ సూచీలు భారీ నష్టాల్లో ప్రారంభించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 963 పాయింట్ల నష్టంతో 73,282 వద్ద మొదలైంది. ఇక 180 పాయింట్లు కోల్పోయిన ఎన్ఎస్ఈ నిఫ్టీ 22,339 వద్ద ప్రారంభమైంది. 507 పాయింట్ల నష్టంతో.. 48,057 వద్ద ఓపెన్ అయ్యింది బ్యాంక్ నిఫ్టీ.
ఇక నిఫ్టీ ఛార్ట్ విషయానికొస్తే.. "వీక్లీ ఛార్ట్‌లో.. అప్పర్ షాడోతో చిన్న నెగిటివ్ క్యాండిల్ ఏర్పడింది. ఇది రివర్స్ పాటర్న్కి సంకేతం. ఇది.. బుల్స్‌కి నెగిటివ్ న్యూస్," అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ ఎనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు.
ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య నెలకొన్న అనిశ్చితికి తెరపడేంత వరకు.. స్టాక్ మార్కెట్లలో ఒడుగొడుకులు కొనసాగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఫెడ్ వడ్డీ రేట్ల వ్యవహారం కూడా కీలకంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఇదీ చూడండి:- Personal loan : పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ పర్సనల్ లోన్ పొందాలంటే ఏం చేయాలి?
స్టాక్స్ టు బై..
Stock market crash today : ఐఆర్సీటీసీ:- బై రూ. 1057.65, స్టాప్ లాస్ రూ. 1030, టార్గెట్ రూ. 1103
ఏజిస్ లాజిస్టిక్స్:- బై రూ. 480.25, స్టాప్ లాస్ రూ. 464, టార్గెట్ రూ. 502
నహర్ ఇండస్ట్రీస్:- బై రూ. 128.5, స్టాప్ లాస్ రూ. 125, టార్గెట్ రూ. 140
వెస్ట్‌లైఫ్ ఫుడ్‌వరల్డ్:- బై రూ. 826, స్టాప్ లాస్ రూ. 810, టార్గెట్ రూ. 862
చాలెట్ హోటల్స్:- బై రూ. 875.5, స్టాప్ లాస్ రూ. 858, టార్గెట్ రూ. 912
కాన్‌కర్డ్ బయోటెక్:- బై రూ. 1560- రూ. 1565, స్టాప్ లాస్ రూ. 1500, టార్గెట్ రూ. 1680
(గమనిక:- ఇవి నిపుణుల సూచనలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం